చెట్టు!!!
డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా
చెట్టుకు వెనక రెండు ముందు రెండు
మాంసపు ముద్దలా వళ్లంతా పళ్ళు కాసినందుకు పరవళ్ళు తొక్కుతుంది.!!?
చెట్టుకు కింది నుంచి పైకి
ఒక నది ప్రవహిస్తుంది!!!
చెట్టు నుదుట బొట్టు పెడదామంటే
బట్టలు లేకుండానే ముట్టుకుంటావని
ముళ్ళు గుచ్చుకుంటుంది.!!!
భూమిని కప్పుకున్న చెట్టు మట్టిని తొక్కి పట్టి అంటును ముట్టుకోనంటుంది!!!
పుట్టుకను మరిచిన చెట్టు గుట్టు విప్పితే
నగ్నంగా నేనడివీధుల్లో రెండు వైపులా పెరుగుతుంది ఇప్పుడు.!!!?
తలకాయలు లేని చెట్టుకు
కాళ్లు చేతులు ఈసారి కాయలేదు.!!
ఋతువులు లేని చెట్టును క్రతువులకు వాడుతున్నారు.!!
పతివ్రతల్లా చెట్లు పెరట్లో పేరంటాల్లో పెళ్లిళ్లో పాల్గొంటున్నాయి.!!!
చెట్టును కట్టుకున్న పసుపు కొమ్ము
అమ్మను తిట్టుకుంటుంది.!!
తిండి లేని చెట్టు కట్టెగా మారింది
ఆకు పెట్టిన తిండితో నాగజెముడయ్యిందీ!!
చీకటి వెలుగుల కోసం చెట్టు ఇప్పుడు కిటికీలోంచి తొంగి చూస్తుంది.!!!
కళ్ళు కాసిన చెట్టు తీయని పలకరింపు కోసం
లోకం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తుంది.!!
రేపటికి ఆ చెట్టు
నవరంద్రాల మురళి కావచ్చు!!
కానీ
ఊదేవాడు శ్రీకృష్ణుడే కానక్కరలేదు!!!?
డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా 🙏
No comments:
Post a Comment