దృఢమైన మనసు సత్యాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది.ఒక మూసలో మనం లేనపుడు అన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము.మోక్షం బయట కొనేది కాదు.నిజ సుఖం కోట్లు పోసిన ఎక్కడ లభించదు. జన్మ లేకుండా చేసుకోవడం అనేది సామాన్య విషయం కాదు.అవి ఇవి చదివి గొప్పవాండ్లము అనుకొనే వాండ్లు ఉన్నారు.మనం ఏదో కొన్ని గ్రంధాలు చదివి, సాధనలు చేసిన, పుణ్యక్షేత్రాలు తిరిగితే వచ్చేది కాదు.సద్గురువులు ఉండే కాలంకోనే, విషయం తెలుసుకున్న వాండ్లు కూడా వెళ్లలేక పోయారు, పొందలేక పోయారు. దగ్గరలోనే ఉండి పోలేని వాండ్లు కూడా ఉన్నారు.వారిని అంటి పెట్టుకొని,మహాత్ముల సాంగత్యంలో వెళ్తుండే వాండ్లకు ఒక మార్గం అనేది అప్పుడు ఏర్పడుతుంది ఇంకో మార్గం ఉండదు.
No comments:
Post a Comment