Monday, March 25, 2024

"నిజమైన శిష్యరికము" మనల్ని 'బానిసలు'గా కాదు, 'దేవుళ్ళు'గా మారుస్తుంది. ఎప్పుడు, ఎలాగ?* *"True discipleship" makes us Gods not slaves. When & How?* *~~~~~~* - సద్గురు శ్రీ మెహెర్ చైతన్యజీ మహరాజ్

 [3/17, 15:01] +91 73963 92086: *"నిజమైన శిష్యరికము" మనల్ని 'బానిసలు'గా కాదు, 'దేవుళ్ళు'గా మారుస్తుంది. ఎప్పుడు, ఎలాగ?*
*"True discipleship" makes us Gods not slaves. When & How?*
*~~~~~~*
          -  సద్గురు శ్రీ మెహెర్
             చైతన్యజీ మహరాజ్

(Part -1)

*(ప్రశ్న::  _విభిన్నమైన మార్గాలలో ప్రయాణిస్తూ, దేవుడు ఒక్కడే అని చెప్పినా, ఆచరణలో మాత్రం భిన్నత్వాన్ని వ్యక్తం చేస్తారు చాలా మంది. అటువంటి వారు  ఏ విధమైన దృక్పథం కలిగి ఉంటే,  ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలరు ??)_*

*గురుదేవులు::  ఈ రోజు మెహెర్ బాబా వారి ప్రవచనమైనటువంటి "True Discipleship"ని గురించి విచారణ చేద్దాం. "శిష్యరికము"ను గురించి బాబా ఇచ్చినటువంటి ఒక ప్రవచనాన్ని గురించి మనము ఈ రోజు విచారణ చేద్దాము.*

*"శిష్యరికము" అనేటువంటిది– గురుశిష్యులు ఉభయుల మధ్య ఉండేటువంటి ఒక ఆధ్యాత్మిక సంబంధము. ఈ సంబంధమును*
 -    అవతార పురుషులతోనూ,
 -   సద్గురువులతోనూ,
 -   సాధారణ గురువులతోనూ
*పెంపొందింపచేసుకుంటూ ఉంటాడు, మానవుడు.*
         _*ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగి– 'ఆధ్యాత్మిక మార్గములో పురోగమించి నిజ గమ్యము చేరాలి' అనేటువంటి జిజ్ఞాస కలిగి ఉంటాడో, ఆ వ్యక్తి– తనకు ఆధ్యాత్మిక మార్గములో మార్గదర్శకత్వము వహించడానికీ, సుగమముగా "గమ్యము" చేర్చడానికీ అవసరముగా ఒక గురువును నిర్ణయించుకుంటాడు.*_
    -   సాధారణమైనటువంటి
        మంత్రోపదేశములు
        ఇచ్చేటువంటి
        గురువుని గానీ, లేదా
    -   సద్గురువులలో ఒకరిని
        గురువుగా గానీ, లేదా
    -   అవతార పురుషుణ్ణి
        గురువుగా గానీ
*_స్వీకరించి, వారి యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాగుతూ ఉంటుంటుంది._*

*➢*       _మెహెర్ బాబాను అవతార పురుషునిగా విశ్వసించి, ఆయనను ప్రేమిస్తుండేటువంటి వారు ఉన్నారు, "ప్రేమికులు"గాను._
*➢*      _అవతార పురుషుడైనటువంటి మెహెర్ బాబాను "గురువు"గా స్వీకరించి– ఆయన నుండి ఆదేశాలు పొంది, ఆయన ఆదేశానుసారము ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వారూ ఉన్నారు._
*➢*     _అదే విధముగా మెహెర్ బాబా సమకాలికులైనటువంటి ఆ కాలపు ఐదుగురు సద్గురువులు, వారికి సంబంధించినటువంటి శిష్యవర్గము కూడా ఉంటూనే ఉన్నది. (అంటే)_
 *  *షిర్డీ సాయిబాబా* వారిని
   "భగవంతుడు"గనూ 
    విశ్వసిస్తారు,
   "గురువు"గనూ
    విశ్వసిస్తారు;
    ఆయనను ఆరాధిస్తారు.
         ఆరాధించడం ద్వారా,
         వారి యొక్క
         ఆధ్యాత్మికమైనటువంటి
         మార్గములో వారికి
        "వెలుతురు"ను, అంటే
         మార్గమందు
         పురోగమించడానికి
         అవసరమైనటువంటి 
         సహాయాన్ని పొందుతూ
         ఉంటుంటారు.
    అదే విధంగా, 
    వారికి సంబంధించినటువంటి
  'శిష్యులు', 'ప్రేమికులూ'
    (కూడా) ఉన్నారు.
 *  అదే విధముగా
   *ఉపాసనీ మహరాజ్* ని
    "గురువు"గా స్వీకరించి,
     ఆయన యొక్క
     ఆదేశానుసారము
     జీవిస్తుండేటువంటివారూ
     ఉన్నారు.
 *  *నారాయణ మహరాజ్* కీ 
     శిష్యులున్నారు. వారి
     మార్గానుసారముగానే,
     ఆధ్యాత్మికముగా
     కృషి సలుపుతున్నారు.
 *   అదే విధముగా
    *బాబాజాన్* కీ
     శిష్యులున్నారు;
    *తాజుద్దీన్ బాబా* కూ
      శిష్యులున్నారు.
*ఈ విధముగా ఎవరెవరు, వారి వారి జిజ్ఞాసను పురస్కరించుకొని, వారు విశ్వసించినటువంటి రీతిలో ఈ మహాత్ములను (అనగా)– అవతార పురుషుల్ని గానీ, సద్గురువుల్ని గానీ గురువులుగా స్వీకరించి, ఆధ్యాత్మికముగా పురోగమించడానికి కృషి చేస్తున్నారు, వారి యొక్క సహాయము ద్వారా.*

ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందీ, విచారణ చేసి ఇప్పుడొక నిర్ణయానికి రావాల్సిందీ ఏమిటంటే::
       _*"భగవంతుడు ఒక్కడేను" అని అందరూ చెప్తున్నారు. అదే విధముగా "భగవంతుణ్ణి చేరు మార్గం కూడా ఒక్కటే" అనీ చెప్తున్నారు. తరువాత, "ఈ మార్గములో ప్రయాణము చేసి, గమ్యము చేరిన తరువాత– ఈ 'ఆధ్యాత్మిక గమ్యము' కూడా ఒక్కటేను" అనీ చెప్తున్నారు.*_
           _*ఇటువంటప్పుడు ఈ మహాత్ముల వెనుక, ఈ అవతార పురుషుల వెనుక, ఈ సద్గురువుల వెనుక, ఈ*_
  -   ప్రత్యేకమైనటువంటి
       పద్ధతులు, 
  -   ప్రత్యేకమైనటువంటి
      సాంప్రదాయములు,
  -   ప్రత్యేకమైనటువంటి ఈ
      ఆధ్యాత్మిక
      సాధనా విధానములు,
_*ఇవన్నీ కల్పింపబడడము చేత, ఒక్కడై ఉన్నటువంటి భగవంతుణ్ణి అన్వేషిస్తుండేటువంటి సాధకుడు– ఒక్కడై ఉన్నటువంటి, అవిభాజ్యుడై ఉన్నటువంటి భగవంతుణ్ణి పొందడానికి బదులుగా, ఏదో ఒక పాక్షికమైనటువంటి భగవంతుని స్థితిని మాత్రమే పొందేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటున్నాడు*._
          _*దీని నుండి తప్పించుకోవడానికి, (అంటే) ఈ పాక్షికమైనటువంటి ఈ భగవంతుని స్థితి నుండి తప్పించుకుని– ఒక్కడై, ఆవిభాజ్యుడై ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి తాను చేరడానికి తాను అన్వేషిస్తూ, తాను విశ్వసిస్తూ పురోగమిస్తున్నటువంటి ఈ మార్గములో– వ్యక్తి అవలంబించవలసినటువంటి మెలకువలు ఏమిటి? ఏ పద్ధతుల ద్వారా, ఏ విధమైనటువంటి అవగాహన ద్వారా– తన యొక్క భావనలో ఏ విధమైనటువంటి భిన్నత్వమూ లేకుండా, "ఏకత్వ"
[3/17, 15:02] +91 73963 92086: సంబంధమైనటువంటి అనుభూతితో పురోగమించి గమ్యము చేరగలడో, ఆ విషయమై మెహెర్ బాబా యొక్క ప్రవచనాన్ని ఈ రోజు మనము పరిశీలిద్దాము.*_
  
     
To be contd ....

No comments:

Post a Comment