దేహం పోతుంది.... మరి నేను!!??
✍️యం.సి. శివశంకరశాస్త్రి
✳️❀━❀━❀🪷❀━❀━❀✳️
🪷 శ్రీ రమణ మహర్షులవారికి నామకరణం చేసిన రోజున తల్లిదండ్రులు పెట్టిన పేరు - వెంకట్రామన్♪. ఆయన పదహారో ఏట తండ్రి మరణవార్త విని ఇంటికి చేరుకున్నాడు♪. బయట పడుకోబెట్టిన మృతదేహాన్ని చూడగానే... 'మా నాన్న చనిపోయాడంటారేం? ఇక్కడే ఉన్నాడుగా' ఆశ్చర్యంగా అన్నాడు♪. 'చనిపోకపోతే నిన్ను ప్రేమతో దగ్గరికి పిలిచి మాట్లాడేవారు కదా బాబూ!’ సానునయంగా అన్నారు అక్కడ చేరిన పెద్దలు♪.
🪷 'అయితే, ఇంతకాలం నాతో మాట్లాడింది ఈ శరీరం కాదా?' వెంటనే సంశయం వెలిబుచ్చాడు♪. పెద్దల నోట మాట రాలేదు... శరీరం వేరు. లోపలి నుంచి మాటాడింది వేరా... అంటే... నేను ఈ శరీరం ఒకటి కాదా, వేరు వేరా? అలాంటప్పుడు 'నేను' ఎవరు? ఆయన మనసును తొలిచివేసిన తొలి సంశయమిది♪.
🪷 ఒకనాడు వెంకట్రామన్ తన మేనమామ ఇంటిలో మేడమీద ఉన్న చిన్న గదిలో ఒంటరిగా కూర్చున్నాడు♪. కొంత సేపటికి తన ఊహకు అందని ఓ విచిత్ర సంఘటన జరిగింది♪. అది ఆయన మాటల్లోనే చెప్పాలంటే...
✳️ శరీరంలో ఎలాంటి అనారోగ్యమూ లేదు♪. చనిపోతున్నానన్న మాట ఎవరితోనూ చెప్పదలచుకోలేదు. వస్తూన్న మరణాన్ని ఎదుర్కొని, ధైర్యంగా పర్యవసానం తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరాను♪. అనుకొన్నట్టు నిజంగానే చావు దాపురించింది♪. ఇంతకీ చావు అంటే ఏమిటి? ఎవరికొస్తుంది♪. నాకేనా? నేను ఎవరిని, చనిపోయేది ఏమిటి? ఓహో! ఈ శరీరం చనిపోతుంది♪. పోతే పోనీ, అనుకొన్నాను. అంతే... నా రెండు కాళ్లు, చేతులు బార్లా చాచాను♪. పెదాలు బిగపట్టాను♪. మాట, పలుకు లేకుండా శ్వాస పీల్చకుండా ఉండిపోయాను♪. అటుపై నేను నాపై దృష్టి సారించాను♪. చావును అనుభవించాను... మళ్ళీ ఇలా అనుకొన్నాను♪. శరీరం చచ్చిపోయింది♪. ఇక శవాన్ని శ్మశానానికి తీసుకుపోతారు♪. దహనం చేస్తారు♪. కాలి బూడిదైపోతుంది♪. బూడిదైన శరీరంలో 'నేను' నశించానా? నేను నశించిపోతే శరీరం కాలి బూడిదైనట్లు నేను ఎలా తెలుసుకోగలను♪. అయితే, నేను శరీరాన్ని కానా? శరీరం కాలి బూడిదైన తరువాతా చావును అంటకుండా ప్రకాశిస్తున్నాను♪. దీన్నిబట్టి అనునిత్యమైన శరీరం నేను కాదన్నమాట♪. _*శరీరం వేరు, నేను వేరు. 'నేను' నాశనం లేని 'ఆత్మ'. శరీరం క్షయమైతే నేను అక్షయం. మహనీయంగా తలపింపజేసే ఈ శరీరంలోని భావాతీత శక్తిని నేను♪.*_
🪷 అంతే... అలా అనుకున్న నాకు నన్నావహించిన మరణ భయం శాశ్వతంగా నా నుంచి దూరమైపోయింది♪. అని ఆయనే (రమణులు) స్వయంగా చెప్పుకున్నారు♪.
🪷 భగవాన్ రమణ మహర్షులు - వారి మహాభినిష్క్రమణానికి ముందు, కొద్ది కాలంపాటు ఎడమ చేయిపై లేచిన రాచపుండుతో బాధపడ్డారు♪. రమణులను దర్శింపవచ్చిన భక్తులు ఎవరికి తోచిన విధంగా వారు వైద్య సలహాలిచ్చారు•. మహావైద్యులను పిలిపించి పలుమార్లు శస్త్ర చికిత్సలు చేయించారు♪. ఈ శరీరం నాది కాదు అనుకొన్న రమణులు భక్తుల మనవి కాదనలేక శస్త్రచికిత్సలకు తలవొగ్గి జరుగుతున్నవాటిని తనవికాదనుకుని భావించి భరించారు♪.
🪷 శ్రీరమణ మహర్షులవారు 1950 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి తమ భౌతిక దేహాన్ని వీడారు♪. భక్తజనులందరూ చూస్తుండగానే ఆ శరీరంలోంచి ఓ దివ్యజ్యోతి కాంతులు విరజిమ్ముతూ బయటికొచ్చి ఆకాశమార్గాన వెళ్తూ అరుణాచల శిఖరంలో కలిసిపోయి కనుమరుగైంది♪.
🙏 తాను, శరీరం ఒకటి కాదని ప్రత్యక్ష నిరూపణ చేసి ఆ తత్త్వ తేజాన్ని అందరికీ పంచిపెట్టి దేహం చాలించిన రమణులవారు భక్తజన హృదయాల్లో ఈనాటికీ చిరంజీవిగా విరాజిల్లుతున్నారు.
❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు
సేకరణ:
✳️❀━❀━❀🪷❀━❀━❀✳️
No comments:
Post a Comment