*_🌹'ఈ రోజు ఒక మంచి మాట.'🌹_*
*_కోపగించుకోవడం అంటే, మన మీద మనమే ప్రతి కారం తీర్చుకోవడం. ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు అతని హృదయంలో ఉంటుంది. పదేపదే నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోకు. నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే, వందమంది గొప్ప వాళ్ళ గురించి ముందు నువ్వు తెలుసుకోవాలి. చీమలను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో.. ఎంత గొప్పగా జీవించావో... నీ చేతలు చెప్పాలి,ఎంత గొప్పగా మరణించావో ఇతరులు నీ గురించి చెప్పాలి. అధికారం చూసి వచ్చే వ్యామోహం ఎంతో ప్రమాదకరం అన్ని జ్ఞానాలలో కెల్లా అత్యున్నతమైనది తనను తాను తెలుసుకోకపోవడం. నీవు ఈ ప్రపంచానికి అర్థం కాకున్నా బ్రతికేయవచ్చు కానీ, నీకు నీవు అర్థం కాకుంటే ఈ ప్రపంచంలో మరెక్కడ బ్రతకలేవు._*
*_మిత్రమా ఒక్క మాట..._*
*_డబ్బు, దర్పం, అధికారం అశాశ్వతమైనవి. పరోపకారం, మంచితనం, ఇతరుల కష్టాలను చూసి చలించే గుణం నీలో ఉన్నట్టయితే నీవు మనిషిగా మనిషిలో శాశ్వతంగా బ్రతికావని అర్థం. ☝🏾_*
*_✍🏾మీ. డా.తుకారాం జాదవ్. 🙏🏾_*
No comments:
Post a Comment