Friday, June 28, 2024

 జూన్ 21. ప్రపంచ యోగా దినోత్సవం!


                    *హాస్య యోగా!*
                       


*హాస్య యోగా... వల్ల  ఉపయోగాలు  ఏమిటి?  మీరు కూడ రోజు చేయండి! లాభాలు ఎన్నో ఉంటాయి!!* 

తలకు మించిన పని భారంతో స్త్రీలు పురుషూలూ అధికంగా ఒత్తిడికి గురవుతున్నారని తాజా సర్వేలు చెబుతున్నారుు. 

ఈ ఒత్తిడి తెచ్చే అనర్థాలు అనేక ఇబ్బందులను కలిగిస్తున్నట్లు కూడా ఇవి వెల్లడిస్తున్నాయి. మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకూ! కారణం మానసిక ఒత్తిడేనని పరిశోధనల్లో తేలింది. వీటిని తరిమికొట్టి ఉల్లాసంగా గడపడానికి మంచి మార్గం ఒకటుంటుందంటున్నారు వైద్యులు. 

అదే హాస్య యోగా..!

హాస్య యోగా చేసేవారిలో ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరు తుంది. మెదడుకు ప్రాణవాయువు సరఫరా మెరుగవుతుంది. శరీరం లోపలి అవయవాల పనితీరు చురుకుగా మారుతుంది. కనుక  రోజులో సాధ్యమైనంత వరకు ఎక్కువగా పగలబడి నవ్వమని హాస్యయోగా వైద్య నిపుణులు చెబుతున్నారు.


*ఆఫీస్ కార్యాలయాల్లో...*

నేడు చాలా కార్యాలయాల్లో  పనిచేసే ఉద్యోగులు కనీసం 10 నుంచి 15నిమిషాలు సమయాన్ని కూడా నవ్వడానికి కేటాయించడం లేదని సర్వేలు చెబుతున్నాయి. 

దీని వల్ల వారిలో ఒత్తిడి అధికమవుతున్నట్లు పరిశోధకులు గమనించారు. 

కొందరు నవ్వడానికి అవకాశం వచ్చినా కూడా మూతి ముడుచుకుని కూర్చుంటున్నారని తమ అధ్యయనంలో తేలిందని చెబుతున్నారు.


*నవ్వు చేసే మేలు....*

నవ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న ఒకే ఒక్క కారణంతో  కొందరు గదంతా బీటలు వారిపోయేటంతటి పెద్ద శబ్దం చేస్తూ నవ్వడం వంటివి కూడా చేస్తున్నారట. ఆ సమయంలో తోటి ఉద్యోగులు తిట్టుకోవడం, అటువంటి వారితో సరిగా కలవకపోవడం, ఎక్కడ నవ్వుతారోనోనని దూరం దూరంగా వ్యవహరించడం వంటివి చేస్తున్నారని పరిశోధనల్లో వెల్లడైంది. 

అందుకే నవ్వుతున్నప్పుడు అవతలి వ్యక్తి భావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇదంతా ఎందుకొచ్చిన తిప్పలు.. అనుకుంటే నేరుగా లాఫింగ్‌ క్లబ్‌కు వెళ్లి ఇష్టం వచ్చిన విధంగా నవ్వుకోవచ్చని వారు సలహా ఇస్తున్నారు. 

ఇలా చేయడం వల్ల ఎదుటి వారికి ఇబ్బంది కలగదు.. ఒత్తిడీ దూరం అవుతుంది అని వారంటున్నారు. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల 
సంఖ్యలో లాఫింగ్‌ క్లబ్బులు వెలిశాయి. 

అయినా అందులోకి వెళ్లేవారు చాలా తక్కువ మందే. బిడియం, సిగ్గు వంటి కారణాలతో చాలా వరకు దూరంగా వుంటున్నారు. 

కానీ ఆరోగ్యం విషయంలో ఇవన్నీ తగదు అని నిపుణులు చెబుతున్నారు.✍️
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి* 
     
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment