🌹గుడ్ మార్నింగ్ 🌹మన జీవితములో జరిగే ప్రతి పని, మనము అనుభవించే ప్రతి సుఖ, దుఃఖ భావము మన సొంత తయారీనే. కొద్దిగా గమనించుకుంటే మన ఆలోచనలు, పనులు, భావాలు మనం సరి చేసుకునే అవకాశము మన చేతిలోనే వున్నదని తెలుస్తుంది.మనం ప్రయత్నించి చేస్తేనే ఒక పని మన ద్వారా జరుగుతుంది. మనము స్వీకరిస్తేనే ఒక భావము మనలో కదులుతుంది,మనను కదుపుతుంది. మనలో ఆలోచనలు పుట్టడము కూడా గతములో ఎదో విధముగా మనము గ్రహించి మన లోపల చేర్చుకున్న విషయాలే - తిరిగి ఆలోచనలుగా వస్తాయి. ఇదంతా ఒక చక్ర భ్రమణము లాగా ఉంటుంది. ఈ మన శరీర పని తీరును గమనించుకోగలిగితే - అన్నీ సరి చేసుకోవచ్చు. మన విధి అంటే సుఖ దుఖాలు ఎవరో రాయటము లేదు - మొత్తము మనమే రాసుకుంటున్నాము - చేసుకుంటున్నాము. మనను మనం మార్చుకోగలము అని తెలియటమే జ్ఞానము. మార్చుకునే ప్రయత్నము సాధన. మార్పు ఆధ్యాత్మికము. ఇదే ఆధ్యాత్మిక చదువు... 🌹god bless you 🌹
No comments:
Post a Comment