Friday, June 28, 2024

 *_🌹'ఈ రోజు ఒక మంచిమాట.'🌹_*

*_ఈ లోకమంతా డబ్బు చుట్టే తిరుగుతుంది. తెల్లవారి లేచిన మొదలు, రాత్రి పడుకునే వరకు ఉరుకుల పరుగులు డబ్బుకోసమే.. డబ్బు ముందుర   అందరూ మహానటులే..._*

*_ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు బంధుత్వాలు, పలకరింపులు అన్నీ కూడా డబ్బుని చూసే వస్తాయి... ఈ మాట జీర్ణించుకోవడం కాస్త బాధాకరమైన... సమాజంలో జరుగుతుంది ఇదే కదా!_*

 *_నేడు సమాజంలో..._*
*_మానవత్వం, మంచితనం,నైతిక విలువలు ఒకప్పటి మాట... ప్రస్తుతం ఇప్పుడు మంచితనం ఉన్నదా అనేది ముఖ్యం కాదు.. మనీ ఉన్నదా అనేది ముఖ్యం. క్యారెక్టర్ ఎలాంటిది అనేది ముఖ్యం కాదు...క్యాష్  ఉందా అనేది ముఖ్యం._*

*_చెరువు నిండితేనే కప్పలు వస్తాయి, బెల్లం ఉంటేనే ఈగలు ముసురుతాయి, చక్కర ఉంటేనే చీమలు వస్తాయి, డబ్బులు ఉంటేనే అన్నీ వస్తాయి.._*

*_మిత్రమా...డబ్బులు సంపాదించు కాదనను కానీ, డబ్బుతో వచ్చే బంధుత్వాలు, బంధాలు, స్నేహాలు, ప్రేమ, ఆప్యాయతలు, గౌరవ, మర్యాదలు ఇవన్నీ నీ వద్ద డబ్బులు ఉన్నంతసేపే నిన్ను ఊక్కిరివికిరి చేస్తాయి._* 

*_అదే డబ్బు నీ నుండి వెళ్ళిపోగానే,  ఒక్కొక్కటిగా మెల్లగా నీ నుండి దూరం అవుతాయి. అప్పుడు నీవు  ఒంటరివాడవుతావు . అందుకే, డబ్బుతో  వచ్చేవి శాశ్వతంగా నిలిచి ఉండవు._*

*_డబ్బుతో పాటు, మంచితనం, సేవ భావం, ఇతరుల కష్టాలలో చలించే హృదయం కలిగి ఉండు. అహంకారాన్ని పక్కన పెట్టి, ప్రతి వ్యక్తి లో ప్రేమను పంచు. అప్పుడు నీవు వారి హృదయంలో  చిరస్థాయిగా నిలిచిపోతావ్

 *_✍🏾మీ..🍉🍑🍅🍓🍓🍇🤝🤝🤝🤝🤝రాళ్లభండి చంద్రశేఖర్ శాస్త్రి 👏👏🙏👍👍🙏🏾_*

No comments:

Post a Comment