Friday, June 28, 2024

****

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...
జీవితంలో ఉన్నత విలువలు సాధించాలంటే సహనం, పట్టుదల, నిలకడ కావాలి.

మనకు ఎవరివల్లనైనా హాని కలిగితే అది మన మంచికే అని భావించాలి, బాధను భరించాలి.

మనలోని స్థిరత్వాన్ని చూపేందుకు, మనపై మనకు గల విశ్వాసాన్ని ప్రకటించేందుకు ఒక చక్కటి అవకాశాన్ని వారు కలిగించారని వారి ఎడల కృతజ్ఞతను ప్రకటించాలి.

ఎటువంటి ఒత్తిడి ఎదురైనా సమతుల్యతను కోల్పోకుండా ఉండగలగడమే మనిషిలోని శక్తికీ, జ్ఞానానికి కొలబద్ధ. 

జీవితంలోని ఆటుపోట్లను సహించేందుకు మనిషికి సమత్వస్థితి, వివేకవంతమైన జ్ఞానం ఆవశ్యకం🌷🙏🙏

No comments:

Post a Comment