Friday, June 28, 2024

 శ్రీమద్రామాయణము.

(203 వ ఎపిసోడ్)

"" మాతృ దేవోభవః,పితృ దేవోభవః,ఆచార్య దేవోభవః ""

""కాలగమనములో అనేక మార్పులు సహజముగ జరుగుతునే ఉంటాయి.అవి సక్రమాలా  కాదా అనేది మన విచక్షణపై ఆధారపడి ఉంటుంది.""

నిన్న ఒక మిత్రుడు చరవాణిలో సంభాషిస్తు "" నిన్న ఫాదర్స్ డే'"కదండి మీ రామాయణము చూడలేక పోయాను.  అందరం మాట్లాడుకోవటం తోనే సరదాగ గడిచి పోయింది.ఈ రోజు మీ రామాయణము చదివాను.చాలా బాగుంది.'"ఇది సంక్షిప్తముగ అతని ఉధ్దేశ్యం.
నాకు మనసులో 'ఇంటింటి రామాయణం "అనే మాట గుర్తుకు వచ్చింది. నా రామాయణము కాదురా తండ్రీ " వాల్మికి రామాయణము" అని నాలో నేను నవ్వుకొని అతడు చెప్పిన ఫాదర్స్ డే గురించి యోచన చేసాను. అమ్మకి నాన్నకి ఒకరోజు కేటాయించి వారిని పూజించటం పరలోకగతులైతే స్మరించటం సబబా అనిపించింది.
కానీ కొన్ని పసి హృదయాలలో శాశ్వతంగా తండ్రిపై గౌరవము కలిగేలా ఒక పండుగలా ఒక రోజును (ఇక్కడ దినమనే మంచి పదాన్ని వాడరాదు) ఎంపిక చేసుకోవడము మంచిదేనేమో అనిపించింది. ఇక ఈ ఫాదర్స్ డే గురించి గానీ తండ్రులను గౌరవించే విధానము రామాయణములో ఎమైనా  చెప్పబడిందో చూద్దాము.

రామాయణము అయోధ్యాకాండములో తల్లితండ్రుల సేవ గురించి
 రాముడు

"" ఏష ధర్మస్తు సుశ్రోణి పితుర్మాతుశ్చ వధ్యతా|,
అతశ్చ తం వ్యతిక్రమ్య నాహం జీవితుముత్సహే||,

"" అస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాధ్యతే||,
స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురుమ్||,(30-31_32,) 

ప్రత్యక్షదైవస్వరూపులైన మన ఎదుట యున్న వారిని కాదని ఎక్కడో ఉన్న పరదైవములను ఆరాధించుట యుక్తముకాదు.ఓ జానకీ తల్లితండ్రులకు విధేయుడనై వారి ఆజ్ఞలను పాలించుటయే ధర్మము.నా బొందిలో ప్రాణమున్నంతవరకు ఆ ధర్మమును అతిక్రమించను.అంటాడు.

 ఇది తండ్రికి ఒక కొడుకు ఇవ్వవలసిన గౌరవము.

"'యతో మూలం  నరః పశ్యేత్ ప్రాదుర్భావమిహాత్మనః,
కథం  తస్మిన్ న వర్తతే ప్రత్యక్షే సతి దైవతే""(18-16),

ఓ కైకేయి మాతా! నా వలన నా తండ్రికి ఏమైనా అసంతృప్తి కలిగినదా ఏమి? అది నాకు కష్టం కలిగిస్తుంది.కారణము"" ప్రతి వ్యక్తి కిని జన్మనిచ్చిన తండ్రి ప్రత్యక్ష దైవమే.అట్టి తండ్రి సజీవుడై ఆజ్ఞాపించగ ఆయనకు అనుకూలముగ ప్రవర్తించుటయే ప్రతిఒక్కరి కర్తవ్యమని అంటాడు.

ఇదీ ప్రతి కొడుకు తండ్రిమాటకు ఇవ్వవలసిన గౌరవము.

 అయ్యో తండ్రిగారు కన్నీరు పెడితున్నారేల? 

"" హితేన గురుణా పిత్రా  కృతజ్ఞేన నృపేణ చ|,
నియుజ్యమానో విస్రబ్ధః కిం కుర్యామహం ప్రియమ్||<(19-05),

నాకు నా తండ్రియే హితుడు,గురువు,ప్రత్యక్షదైవము.అట్టివాని ఆజ్ఞలు నేనెలా పాటించకుండగ యుండగలను? నేను తండ్రిమాటలకి కట్టుబడి రాజ్యాధికారము త్యజించి వనవాసములకు వెళ్లగలవాడను.

ఇదీ కుమారులుగ తండ్రి మాటలకు గౌరవము ఇవ్వవలసిన పధ్దతి.

తల్లి తండ్రులను గౌరవించు విధానము వారిని ప్రేమించు మార్గము వారి మాటలను దక్కించు నైపుణ్యము రామాయణము మనకి నేర్పు తున్న తీరు అద్భుతము అత్యంత ఆదర్శనీయము

మదర్స్ డే  ఫాదర్స్ డే లు జరుపుకోవడము సరదాగ కాకుండగ వెనకయున్న సాంప్రదాయాల వెల్లువను వాటి విలువలను గమనించుకోవాలని రామాయణము మనలని హెచ్చరిస్తున్నదని మనమందరము భావించి తల్లిదండ్రులను గౌరవించుకునే బాటలో పయనిద్దాదము.
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్.

No comments:

Post a Comment