Wednesday, June 26, 2024

*****మరణం తర్వాత?

 *మరణం తర్వాత?*
*భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది*
భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా, మొదట, మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే మీరు మరణానికి కొద్ది గంటలలో, చేరువలో ఉన్న వ్యక్తిని  యొక్క అరికాలు పాదాలు గమనించారంటే.. అవి చల్లబడుతున్నాయి అని తెలుసుకుంటారు. 

*సూక్ష వెండి తీగ*
అసలు ఏం జరుగుతుందంటే, ఆత్మకి శరీరానికి అనుసంధానింపబడి ఉన్న వెండితీగ తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండితీగ తెగుతుందో, శరీరంలో అంతవరకు బంధింపబడిన ఉన్న ఆత్మకి స్వేచ్చ లభించి శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్లలేక, మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని, మరణించిన వెంటనే సూక్షమంగా పరిశీలిస్తే, ముఖంలోనో లేక శరీర ఇతర అవయవలాలలోనో సూక్షమైన కదలికలు గమనించగలగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే, ఆత్మ తన శరీరాన్ని కదలించడానికి ప్రయత్నించడం వల్లనే. మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది అయినా కూడా, వెండి తీగ తెగిపోవడం వలన, శరీరంలో దూరగలిగినా అక్కడ ఉండలేక పోవడం వలన,







*మరణం తర్వాత?*
*భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది*
భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా, మొదట, మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే మీరు మరణానికి కొద్ది గంటలలో, చేరువలో ఉన్న వ్యక్తిని  యొక్క అరికాలు పాదాలు గమనించారంటే.. అవి చల్లబడుతున్నాయి అని తెలుసుకుంటారు. 

*సూక్ష వెండి తీగ*
అసలు ఏం జరుగుతుందంటే, ఆత్మకి శరీరానికి అనుసంధానింపబడి ఉన్న వెండితీగ తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండితీగ తెగుతుందో, శరీరంలో అంతవరకు బంధింపబడిన ఉన్న ఆత్మకి స్వేచ్చ లభించి శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్లలేక, మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని, మరణించిన వెంటనే సూక్షమంగా పరిశీలిస్తే, ముఖంలోనో లేక శరీర ఇతర అవయవలాలలోనో సూక్షమైన కదలికలు గమనించగలగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే, ఆత్మ తన శరీరాన్ని కదలించడానికి ప్రయత్నించడం వల్లనే. మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది అయినా కూడా, వెండి తీగ తెగిపోవడం వలన, శరీరంలో దూరగలిగినా అక్కడ ఉండలేక పోవడం వలన, ఆత్మ ఇక శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. *ఏదో ఒక శక్తి వలన ఆత్మ, అలా శరీరం నుండి పైకి, ఇంకా పైకి ఆకర్షింపబడుతుంది.*

*భౌతికశరీరానికి ముగింపు*
శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మా తన ప్రియమైన వాళ్లతో మాట్లాడుతుంది, నేను మరణించలేదు అని చెబుతుంది. కానీ, ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినబడవు. నెమ్మదిగా ఆత్మకి అర్థమవడం మొదలవుతుంది తాను  ఇక తన శరీరంలో జేరలేనని. శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి, ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడము మరియు చూడడము జరుగుతుంది. సాధారణంగా అంత్యక్రియలు జరిగేంతవరకూ ఆత్మ అలా సుమారు 12 అడుగులు శరీరానికి పైన వుంటుంది. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, *ఇకపై ఎక్కడైనా అంత్యక్రియలు కార్యక్రమం జరుగుతోంది అంటే, అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి, అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ, వింటూ ఒక సాక్షిభూతంగా వుందని.*

*భౌతికదేహంతో విడివడుట*
ఇక అంత్యక్రియలు కూడా జరిగాక, తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక, ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థీవ దేహం పంచభూతాలలో కలసిపోయిందని నిర్ణయించుకుంటుంది. అప్పటిదాకా తను దేహంలో ఉండడం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడివడిపోవడం వలన, ఇక ఆత్మకి పూర్తి స్వేచ్చ అనుభవంలోకి వస్తుంది. ఆత్మ తలచుకున్న మాత్రానా ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది. తర్వాతి 7 రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు, తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది. 7 రోజులు ముగిసాకా, తన కుటుంబానికి, ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని, భూమిని దాటి గగనంలోకి వెళ్ళిపోతుంది.

*ఆత్మప్రయాణం*
ఆత్మలలోకానికి వెళ్ళ్దడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసివుంటుంది. అందువలన తర్వాతి 12 రోజులు అత్యంత ముఖ్యమైనవి. *ఈ 12 రోజులలో మనం జరుపవలసిన కార్యక్రమాలు చక్కగ నెరవేర్చవలసి వుంటుంది. మరియు మనం చేసిన తప్పులను క్షమించమని ఆత్మని అడగడము మరియు ప్రార్ధించడము జరుపవలెను.* *అంత్యక్రియల తరువాత జరుపబడే కార్యక్రమాలు, ప్రార్థనలు, ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి.* ఆత్మలలోకానికి అడుగుపెడుతున్నాను అన్న సూచనగా, మార్గం యొక్క ముగింపులో ఆత్మకి ఒక అతి పెద్ద వెలుగు కనపడుతుంది.

*పూర్వీకులను కలసుకొనుట*
హిందువులు 11వ మరియు 12వ రోజున జరుపబడే ఇతర కార్యక్రమాలవలన, *ఆత్మ తన పూర్వీకులను, ఆప్త మిత్రులను, బంధువులను మరియు తనకు మార్గనిర్దేశనం చేసిన వారిని కలసుకోవడం జరుగుతుంది* మనం భౌతికంగా ఎలాగైతే, మన దూరపుబంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌగిలించుకుంటామో, అదేవిధంగా ఆత్మలలోకంలో కూడా 12వ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మని అహ్వానించి మనస్పూర్తిగా కౌగిలించుకుంటారు. ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గనిర్దేశకులు, ఆత్మని తను భూలోకంలో, భాద్యతవహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి, ఒక పెద్ద వెలుగువంటి బోర్డ్ ఉన్న ప్రదేశానికి తీసుకునివెళ్తారు. దీనినే *కార్మిక్ బోర్డ్* అంటారు. ఈ బోర్డ్ లో గత జన్మలో జరిగినదంతా చూపించబడుతుంది.

*జీవితాన్ని పరిశీలించుకొనుట*
ఇచ్చట అంక్షపెట్టే వారు, నిర్ణయించేవారు ఎవరూ ఉండరు. *ఎలాగైతే ఆత్మ భూమిపైన తన జన్మలో ఇతరులని నిర్ణయించిందో అంటే జడ్జ్ చేసిందో అలాగ ఇక్కడ తనని తానే జడ్జ్ చేసుకుంటుంది. భూమిపై ఎవరికైతే కష్టాలను కలిగించిందో అవన్నీ చూసుకొని తాను తప్పుచేసానని ఫీల్ అవుతుంది. *తాను చేసిన తప్పుల నుండి జ్ఞానం పొందటానికి శిక్ష కావాలని కోరుకుంటుంది.* ఈ విధమైన తన గత జీవితాన్ని పరిశీలించుకోవడం ద్వారా, *రాబోయే తన జీవితానికి ఒక బ్లూప్రింట్ అంటే నఖలు లేదా ఒక ప్లాను వేసుకుంటుంది. ఏలాంటి సంఘటనలని ఎదుర్కొనాలి, ఎలాంటి ఛాలంజ్ లను ఎదుర్కొనాలి, ఎలాంటి కష్టాలను అధిగమించాలి, ఇలాంటి ఎన్నో నిర్ణయాత్మక రచనలతో నఖలు తయారుచేసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే, నిమిషాలతో సహా, వయస్సు, వ్యక్తులు, పరిసరాలు, సంభవాలు లేక సంఘటనలు అన్నీ, తాను ఎదుర్కొనవలసినవి రచించుకుంటుంది.*  

*నఖలు లేదా నమూనా*
*ఈ విధంగా మన తప్పిదాలకి మనమే బాధపడతాము మరియు శిక్షలు విధించుకుంటాము.* ఒక ముఖ్యవిషయం చెప్పాలి అదే ఏమిటంటే, మీరు ఒక తప్పు చేసే దానికి 10 రెట్లు లేదా 20 రెట్లు అధికంగా భాదపడవలసి వస్తుంది అంటారు. అది నిజం కాదు. కానీ ఆత్మా తన గత జన్మ పరిశీలన చేసుకున్నాక ఎంత ఎక్కువగా బాధపడుతుందో అంత ఎక్కువగా శిక్షని విధించుకుంటుంది. ఒకోసారి 5 నెలలు ఒక వ్యక్తి తాను బాధపెట్టి వుంటే 2 సంవత్సరాలు తన రాబోయే జన్మలో బాధపడాలి అని కూడా నిర్ణయంతీసుకుంటుంది. అందువలనే, *మీ భావోద్వేగాలని సరిచేసుకుంటూ ఉండాలి అని అంటూ వుంటారు ఎందుకంటే, అవే తర్వాత కూడా మోసుకునిపోబడతాయి కాబట్టి.* ఒకసారి ఈ నమూనా పూర్తిగా తయారుచేసుకున్నాక ఒక ప్రశాంతతో కూడిన కాలం ఆత్మకి అప్పుడు ప్రారంభమవుతుంది.

*మరుజన్మ*
*మన మరుజన్మ ఆత్మలలోకంలో తయారు చేసుకున్న నఖలు పై ఆధారపడి ఉంటుంది.* జన్మకి మరుజన్మకి మధ్య 20 నుంచి 30 ఏళ్ళు పట్టవచ్చు లేదా ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. *మన తల్లిదండ్రులను మనమే నిర్ణయించుకుంటాము* ఒకోసారి తల్లిగర్భంలో పిండం  రూపుదిద్దుకుంటున్న సమయంలోనో లేక గర్భం దాల్చిన 4, 5 నెలకో, లేక పుట్టడానికి కొంత సమయం ముందో ఆత్మ ప్రవేశించడం జరుగుతుంది. ఈ సృష్టి ఎంత అద్భుతమైనదంటే పుట్టే తేదీ, సమయము మరియు స్థలమునకు తగినట్ట్లు గ్రహముల అమర్చబడినాయి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను దురదృష్ట జాతకుడను, నాకు అదృష్టం లేదని కానీ అసలు విషయం ఏమిటంటే, *నీ జీవితం మొత్తం కూడా, నువ్వు ఆత్మలలోకంలో తయారుచేసుకున్న నఖలు లేదా బ్లూప్రింట్ మాత్రమే.* ఒకసారి మరుజన్మ తీసుకున్నాక, 40 రోజులదాకా బిడ్డ తన గత జన్మకి సంబందించిన జ్ఞాపకాలు అన్నీ కలిగివుంటుంది. అందువలనే ఒకోసారి సంబంధం లేకుండా నవ్వడమూ లేక ఏడ్వడమూ జరుగుతూ ఉంటుంది. 40 రోజుల తర్వాత, గత జన్మకి సంబందించిన అన్ని జ్ఞాపకాలు ఆటోమెటీక్ గా తుడిచివేయబడి, అసలు నాకు గతజన్మ అంటూ ఒకటి ఉందా అన్నంతగా మారిపోతాము.

*నఖలు అమలుపరచబడుట*
*ఇక అప్పటినుండి నఖలు లో లిఖించుకున్నది పూర్తిగా అమలులోకి రావడం ప్రారంభమవుతుంది.* ఇక అప్పటి నుండి, మన సంఘటనలు తలచుకుని, ఇతరులను మరియు భగవంతుని దూషించడము ప్రారంభమవుతుంది. *అందువలన మీరు ఇంకొకరిని వ్రేలెత్తి చూపే ముందర గుర్తుంచుకోండి, ఇతరులందరూ మీ నఖలు లో మీరు పూర్తిగా మీ స్వంత ఇష్టంతో లిఖించుకున్న ప్రకారమే మీకు సహాయం చేస్తున్నారని.* మనము ఏదైతే ముందరే జరగాలని నిర్ణయించుకున్నామో అదే జరుగుతోంది. *తలిదండ్రులు, బంధువులు, మిత్రులు, శత్రువులు, భాగస్వామీ అందరూ కూడా మన జీవితంలోకి ఎందుకువస్తున్నారంటే, వారు అలా రావాలని మీరే నిర్ణయించుకున్నారు కాబట్టి.* 

మరణించిన తర్వాత ఆత్మలు భూమిపైనే తిరుగుతూ ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిలో కొన్ని, చేయవలసిన పని మధ్యలో ఆగిపోవడం, అత్యంత దుఃఖం, గాయాల వలన మరణించడం, అనుకోని సమయంలో అంటే ఉన్నపలంగా మరణం సంభవించడము.   ఏది ఏమైనప్పటికి ఆత్మకి 12 రోజుల గడువు మాత్రమే ఉంది, ఈ గడువులోపే తను చేయాలనుకున్నవన్నీ చేయగలగాలి. 12 రోజుల తర్వాత కొంతకాలం ఆగి, ఆత్మల లోకాల ద్వారం కూడా మూసివేయబడుతుంది.
అలా జరిగితే, ఆత్మల పరిస్థితి మరీ దయానీయకమై పోతుంది. ఎందువలన అంటే, అవి ఆత్మలలోకానికీ వెళ్లలేవు, భూలోకంలో శరీరంతో వ్యవహరించడానికి మళ్ళీ జన్మ తీసుకోలేవు.   *అందువలననే మన ప్రార్థనలు మరియు మరణించినవారికి జరుపబడే కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి.* అలా చేయడం వలన, ఆత్మలు తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించి ఆత్మలలోకానికి వెళ్ళి చేరుతాయి. హిందూ సాంప్రదాయంలో ఆ 12 రోజులు దేవాలయానికి వెళ్ళడం నిషిద్దం అని వుంది.   *మనము మరణించిన వారికి కాపాడుటకు వారు తమ గమ్యాన్ని చేరుటకు మన వంతు సహాయం చేయడం కూడా ఎంతో ప్రాధాన్యమైనదే.*

*మనకి మరణం లేదు, మరణం అనేది అంతం కాదు, అది ఒక విడిది సమయం మాత్రమే మళ్ళీ మనం కలుసుకోవడానికి.🌹

No comments:

Post a Comment