Friday, June 28, 2024

,
            *_నేటి మాట_*

*జీవితంలో సుఖశాంతులు ఎలా లభిస్తాయి???*

మానవుడు కోరికలు ఎంత తగ్గించుకుంటే అంతగా సుఖశాంతులు లభిస్తాయి...
మానవుని జీవితము దీర్ఘప్రయాణము. 
ఇందులో మన desires ఎంత తగ్గించుకుంటే అంత సుఖశాంతులు పొందుతాము. దీనినే రైల్వే డిపార్టుమెంటు వారు Less luggage more comfort, make travel a pleasure అన్నారు...
మనయొక్క కోరికలే మన లగేజి, విద్యార్థులు, యువకులు, నిత్యనిర్మలమైన సత్యమార్గములో ప్రవేశించవలసినవారు. 
కానీ, దురదృష్టవశాత్తు ఈనాడు విద్యార్ధులలో అనేక విధములైన కోరికలు ప్రవేశించి వారిని ఉన్మత్తులుగా చేస్తున్నాయి. 
విద్యార్థులు, కోరవలసింది ఏమిటి, అనే విచారణ చేయటం లేదు. 
నీకు నీవు పరీక్షించుకో! "నేను విద్యార్థినా లేక విషయార్థినా, అని, విద్యార్ధిగా నీవు ప్రవేశించి విషయార్థిగా రూపొందినప్పుడు అశాంతి shadow వలె వెంట ఉంటుంది. 
మానవునియందు రెండు విధములైన తత్త్వములున్నవి. మానవునికి రెండు విధములైన రూపములున్నవి. 
భగవద్గీతలో కృష్ణుడు రెండు విధములైన ధర్మాలను ప్రబోధిస్తూ వచ్చాడు...

*'స్వధర్మము, పరధర్మము'...* 
స్వధర్మమంటే ఏమిటి? 
నేను బ్రాహ్మణుడను, నేను క్షత్రియుడను, నేను వైశ్యుడను, నేను శూద్రుడను, యిది కాదు ధర్మము. 
'స్వ' అనగా ఆత్మ. 
స్వధర్మము అనగా ఆత్మ ధర్మము. 

ఇక రెండవది, 
పరధర్మము అనగా నేమి??
దేహసంబంధమైన ధర్మము, స్వధర్మ, ఇదే సామీప్య, సాలోక్య, సారూప్య, సాయుజ్యములు.
స్వధర్మమనేది కేవలం ఆత్మధర్మము. 
ఈ స్వధర్మముయొక్క తత్త్వము యేమిటి?
 'నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం'. 

ఈ పవిత్రమైన, దివ్యమైన భావములు హృదయమునందు ఆవిర్భవించి మానవుని పవిత్రమైన మార్గములో ప్రవేశింపచేసే ఆత్మధర్మములు. పరధర్మమనగా దేహమునకు సంబంధించినది. 
మనలో చాలామందికి తెలుసు. 
భారతదేశము విదేశీయుల చేతిలో కుమిలిపోతున్న సమయములో దీనిని బానిసత్వమునుండి వేరుగావించి స్వతంత్రమును పొందాలని అనేకమంది భారతీయులు దీని నిమిత్తమై పోరాటము సలుపుతూ వచ్చిరి. 
అప్పుడోక రకమైన కీలకాన్ని వారు అనుసరిస్తూ వచ్చారు, స్వదేశీ వస్తువులే వాడాలి, పరదేశమునుండి దిగుమతి చేసుకున్న వస్తువులు వాడకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నారు. 
'స్వదేశము', 'విదేశము', అని ఉపయోగించారు. 
అనగా మనదేశముయొక్క వస్తువులే మనము వాడాలి...
విదేశీ వస్తువులు వాడకూడదు అని. 
స్వదేశము, విదేశము అని కొంత భౌగోళిక సరిహద్దును నియమించుకోటంచేత స్వాతంత్ర్యము పొంది విజయాన్ని సాధించగలిగారు.
బాహ్య జగత్తునందు స్వదేశము అన్న భావమును ఉపయోగం చేసుకోటంచేతనే స్వరాజ్యమును పొందగలిగారు. 
నిజానికి, స్వరాజ్యం అంటే ఆత్మ సామ్రాజ్యము. 
దీనిని పొందేటందుకు ఆత్మగుణములే ఉపయోగించుకోవాలని దీనికి ఒక అర్ధము. 
స్వబుద్ధులనే ఉపయోగించాలి, స్వగుణములనే పాటించాలి, స్వభావములనే మనము ఆచరించాలి. 
అనగా ఆత్మభావములు, ఆత్మ సంకల్పములు. 
ఇవి మన హృదయమునకు సంబంధించినవి. 
దానిని మనము అనుసరించినప్పుడే అదేమన witness గా రూపొందుతుంది. 
కనుక, స్వబుద్ధితో స్వగుణాన్ని స్వప్రయత్నముచే పొందినప్పుడే మనకు స్వరాజ్యము లభిస్తుంది...

              *_🥀శుభంభూయాత్.🥀_*
    *🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*

No comments:

Post a Comment