Wednesday, July 31, 2024

****శ్రీ రమణీయం - 38🌹 👌ఎవరైనా ఆశ్రయించాల్సింది దేవుని గుణాలనే..👌

 [7/31, 04:38] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 38🌹
👌ఎవరైనా ఆశ్రయించాల్సింది దేవుని గుణాలనే..👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

🌈 38. ఎవరైనా ఆశ్రయించాల్సింది దేవుని గుణాలనే..🌹

✳️ జన్మరాహిత్యం అంటే బొక్కెనలో విడిగా కనిపిస్తున్న నీటిని బావిలో కలపడం లాంటిదే. నీళ్ళలో మునిగి ఉన్నంతవరకూ బొక్కెనలో ఉన్న నీటికి ప్రత్యేక ప్రతిపత్తిలేదు. కానీ నీళ్ళలోనుండి బయటకురాగానే వాటిని బొక్కెనలో నీళ్ళని అంటాం కానీ బావిలో నీళ్ళని అనటంలేదు. వివేకంతో ఆలోచిస్తే బొక్కెన అనే పరిధిచేరినా ఆనీళ్ళు బావినీళ్ళు కాకుండా పోయాయా? నీవు ఎలా ఉన్నా ముక్తుడివేనని భగవాన్ చెప్పిన మాటలో ఆంతర్యం అది. *మన దేహపరిధి చేత మనసు అని అంటున్నా... అది విశ్వమనసు (పరమాత్మ) లో భాగమేనన్న భావస్వేచ్చే మోక్షం.♪*

✳️ దేహ పరిధిచేత మనసుకి ఏర్పడిన మైల, మోహం వదలడానికి సమయం పడుతుంది. నామజపంవల్ల కదిలే విశ్వమనసు దైవానుగ్రహంగా మన ప్రయత్నాన్ని సులభంచేస్తుంది. విశ్వమనసులో మనమూ భాగమైనప్పటికీ పరిధి చేత ఆ పవిత్రత మన మనసుకి లేకుండాపోతుంది. దైవం అంటే విశ్వమనసే. అది ఎక్కడ, ఎప్పుడు, ఎవరు పిలిచినా పలుకుతుంది. ఆపదలో ఉన్నప్పుడు ఏడుకొండలవాడిని మనం ఉన్నచోటునుండే మొక్కుకుంటాంగానీ, తిరుపతి వెళ్ళి మొక్కుకోవడంలేదుకదా! కాకపోతే,  మొక్కు తీర్చుకునేందుకు తిరుపతి వెళ్తాం. మన మనసు ఇప్పుడు అల్పంగా ఉంది. సర్వశక్తివంతం, పరమ పవిత్రము అయిన ఆ విశ్వమనసులోని అణు మాత్రాన్ని తెచ్చుకొని కర్తృత్వాన్ని పొందుతున్నాము. అదే ఇంత నాటకానికి కారణం అయింది. మనం ఈ విశ్వంలో ఎంతటి అస్వతంత్రులమో విచారిస్తే ఈ కర్తృత్వం పోతుంది. ఆ విశ్వమనసు సర్వత్రా నిండిఉందన్న సత్యదృష్టిచేతనే మనం రాతివిగ్రహంలో కూడా దైవాన్ని చూడగలుగుతున్నాం. దైవం రూపంలేని వాడని అంటున్నామంటేనే రూపం తీసుకోలేని అసమర్థుడని చెప్పినట్లు అవుతుంది. పోనీ రూపరహిత ధ్యానమే ఉత్తమం అనుకున్నా నామజపం మనోబలాన్నిచ్చి ఆస్థితికే చేరుస్తుంది♪.

✳️ జ్ఞానిబోధ అర్థం కావాలంటే మనం జ్ఞానులమైనా అయి ఉండాలి, లేదా జ్ఞాని మాటపై పరిపూర్ణ విశ్వాసమైనా ఉండాలి♪. హాస్టల్లో చేరిస్తేగానీ పిల్లాడికి తల్లి విలువ తెలియనట్లు జ్ఞాని ఉన్నంతకాలం వారిని దేహమాత్రుడిగా చూస్తాం. వారు అంతర్ధానం అయిన తర్వాత గౌరవించి గుడికడతాం. మనకు పురాణాలను అందించిన మహాజ్ఞానుల మాటల్లో కూడా వికారాలనే వెతకటం అలవాటైంది. మనం అన్నింటినీ మనవైపు నుంచి ఆలోచించి ఆక్షేపిస్తున్నాం♪. 

✳️ దారుకావనంలో శివుడు నగ్నంగా తిరిగినా, అక్కడే ఉన్న ఋషులు, ఋషి పత్నులకు వికారం కలగలేదు. కానీ అది చదువుతుంటే మనకు వికారం కలుగుతుంది. మన మానసిక స్థితి అలా ఉంది. సీతాదేవిని వెదికేటప్పుడు హనుమంతుడు ఒంటిపై దుస్తులులేని అనేక మంది స్త్రీలను చూశాడని రామాయణంలో వ్రాశారు. వాల్మీకి రచనలోని నిజాయితీ కూడా మనకు వికారంగా కనిపిస్తే అది ఆ జ్ఞానితప్పా? మన తప్పా? తాముచూసిన సత్యాన్ని ప్రపంచానికి అందించిన జ్ఞానుల్లో 90 శాతం మన భారతీయులే. నామం, జపం, రూపం మన ఇష్టానికి అడ్డుకావచ్చుగానీ ధ్యానానికి మాత్రం అడ్డుకాదు. కాబట్టే పురాణాలు మనకందించిన వ్యాసభగవానుడు మాత్రమేకాదు, అద్వైతాన్ని బోధించిన ఆదిశంకరాచార్యుల వంటి మహానుభావులు కూడా మనకి అనేక దేవతా మూర్తుల స్తోత్రాలను అందించారు. నడక వచ్చేంతవరకూ పిల్లాడికి చక్రాలబండి ఊతంగా ఇస్తాం. మనం కొనివ్వకపోతే వాడైనా గోడలు పట్టుకునే నడుస్తాడు. నీకు నడక నేర్పిన గోడ మరొకరికి అక్కర్లేదనటం ఎంతవరకూ వివేకం అవుతుంది♪.

✳️ మనలో ప్రేమ ఉంటే రాయిరప్ప కూడా మన మాట వింటాయి. ఈ విశ్వంలో అణువణువులో ఉన్న మనసు జ్ఞానికి, యోగికి తెలుస్తుంది. వారు ఆ విశ్వ చైతన్యాన్ని అణుమాత్రమైనా వృథా చేయరు కనుక అవి వారి మాటవింటాయి. అదే మనకు మహత్యంగా కనిపిస్తుంది. ఇంట్లో మన మాట వినే పిల్లాడు ఉంటేనే పేపరు తెచ్చుకోవడానికి బద్ధకించి వాడితో తెప్పించుకుంటాము. కానీ, ప్రకృతి అంతా తన మాట వింటున్నా జ్ఞాని ఏ మాత్రం బద్ధకించక తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తాడు. ప్రకృతి తమ మాట వింటుంది కాబట్టే శ్రీకృష్ణుడు ద్రౌపది మానాన్ని రక్షించగలిగాడు. షిర్డిసాయిబాబా కూలిపోతున్న భవనాన్ని తన మాటతో ఆపారు. ఒక మఠాధిపతి రాష్ట్రపతి కోసం వర్షాన్నే ఆపారు. మన ప్రక్కనే ఉన్న పిల్లవాడు ప్రమాదంలో పడితే మనం రక్షించుకోలేము. మరి రాఘవేంద్రస్వామి ఎక్కడో నీళ్ళలో పడిన బాలుడ్ని రక్షించారు.

✳️ సత్యాన్ని నిర్గుణంగా దర్శించిన ద్రష్టలు మనకోసం దైవానికి రూపనామాలు ఏర్పాటుచేస్తే మనం మాత్రం నేరుగా ధ్యానం చేస్తానంటే సాధ్యపడే పనికాదు. గతజన్మలోనే సాధనను పూర్తి చేసుకున్న కృతోపాసకులకు సాధ్యమయ్యే మార్గాలను మనకు అన్వయించుకోకూడదు. హోటల్కి వెళ్లి కూడా నేనే వండుకుని తింటాననటం ఎలాంటిదో మన పూర్వులు చూపిన సర్వజనీన మార్గాన్ని వదిలి సొంతప్రయత్నం చేయడం అలాంటిది♪. 

✳️ *సాధనలో ఒక మార్గం గొప్పది, ఒకమార్గం అల్పమైనది అనిలేదు. ఫలం శ్రద్ధలో ఉంది గానీ మార్గంలో లేదు. భక్తి, జ్ఞాన, యోగాల మిళితమైన నామజపం ఇవ్వలేని ఫలం అంటూ ఏదీలేదు♪.*
[7/31, 04:38] +91 73963 92086: ✳️ మనం చేసే సాధన మన భావితరాలకు సరూపంతో అందిస్తేనే అది నిలుస్తుంది కనుక రూపనామాల విషయంలో సందేహం అక్కర్లేదు. భగవంతుడికి రూపం లేదని చెప్తున్న మతాలు కూడా ఏదో ఒక స్థలాన్నో, నిర్మాణాన్నో ఆశ్రయిస్తున్నారే గానీ గాలిలో ప్రార్థనలు ఎవరూ చేయడంలేదు. దైవం, జ్ఞాని, గురువు దేహపరంగా సమానులు కాకపోవచ్చు కానీ కనిపించని శక్తిగా వారంతా సమానులే. మహానుభావులు దేహానికి పరిమితంకాని విశ్వచైతన్య మూర్తులు కనుకనే వారిని తలుచుకుంటున్నాం. మనం నిజంగా ప్రార్థించేది దేహాన్నే అయితే మన ఇంటి ప్రక్కవాడినే ప్రార్థించవచ్చు కదా. మన రక్షణ మనచేతిలోనే ఉంటే దైవాన్ని ఎందుకు ప్రార్థిస్తాం. రోడ్డు ప్రమాదాలను ఎందుకు జరగనిస్తాము. మామూలుగా నాలుగు అడుగులు వేస్తేనే కాళ్ళునొప్పులు పుట్టే వ్యక్తికి తిరుపతికొండ ఎక్కితే ఏ బాధా ఎందుకు ఉండటంలేదు? 

✅👉 ఆధ్యాత్మిక ప్రయాణంలో మన అనుభవాలే మనకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని, బలాన్ని ఇస్తాయిగానీ కేవలం విన్నదీ, చదివిందీ మనను ముందుకు సాగనివ్వదు.

꧁☆•┉┅━•••❀🔯❀•••━┅┉•☆꧂

🌈 మనసు - విశ్వమనసు: 💫

✳️ మనకు మనసు ఉన్నట్లే ఈ విశ్వానికి కూడా ఒక మనసు ఉంది. ఈ విశ్వమంతా ఒకానొక శక్తి వ్యాపించి ఉంది. విషయాన్ని గ్రహించి దానికి తగ్గ క్రియచేసే ఆ శక్తికే మనసు అని పేరు. ఇది సృష్టి అంతటా ఉంది. వేడిదగ్గరకు వెన్నను చేరిస్తే అది కరిగిపోతుంది. ఈ ప్రక్రియలో మంటకు వెన్న గురించి, వెన్నకు మంట గురించి తెలియదు. కానీ కరిగిపోవడం అనే క్రియమాత్రం జరిగిపోతుంది. మనిషికైతే ఇలా తెలియకుండా ఏ క్రియా జరగదు. అంటే మనిషికి తెలిసినట్లుగా ప్రకృతిలో ప్రతీదానికి తెలియడం అనే గుణం ఉండనక్కర్లేదు. కానీ సృష్టిలో మాత్రం తెలియడం అనే క్రియలేకుండానే తెలివితో నిరంతరం అనేక పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఏటా ఒకే కాలానికి పూత వేయాలని చెట్టుకు ఎలా తెలుసు? ఏ కాలానికి ఎక్కడ, ఎంత మోతాదులో వర్షించాలో మేఘాలకు ఎలాతెలుసు?. ఇలా గ్రహించి అదృశ్యంగా పనిచేస్తున్న శక్తే మనసుగా పిలవబడుతుంది, ఈ అదృశ్య శక్తినే సైన్స్ సహజం అంటుంది. ఆ సహజాన్నే మనం భగవంతుడని అంటాము. ప్రార్థిస్తే వినేశక్తి ఆ విశ్వమనసుకి ఉంది. తన్మయత్వంతో క్షణకాలం పాటు మనకు ఇష్టమైన ఏ రూపంలో తలుచుకున్నా విశ్వమనసుగా ఉన్న శక్తి మనని అనుగ్రహిస్తుంది. నిత్యము, నిరతము విశ్వమంతా నిండి ఉండేది జ్ఞానం. అది మన మనసు ద్వారా వ్యక్తమైతే భక్తి అయింది♪. 

✳️ దైవానికి రూపం లేదనే విశ్వాసం కొందరిది. వారు కూడా రూపం అనే ఒక్క గుణం మినహాయించి మిగిలిన అన్ని గుణాలను దైవానికి ఆపాదిస్తూనే ఉన్నారు. ఏ మతం వారైనా దైవాన్ని వరాలు ఇవ్వడం, పిలిస్తే పలకడం, రక్షించడం వంటి అనేక గుణాలతో కొలుస్తున్నవారే. అందరికీ.. అందుబాటులో ఉండేలా మనం రూపం అనే గుణంకూడా ఏర్పాటు చేసుకున్నాం. ఒక్క రూపాన్ని తీసేసినంత మాత్రాన ఏవరూ భగవంతుణ్ణి ఏ గుణంలేని వాడుగా ఆరాధించటంలేదు కదా! పెళ్ళిచూపులకు వెళ్లేముందు వధూవరుల గుణగణాలన్నీ అడిగి రూపం బాగుంటుందా అంటారు. అంటే రూపం గుణాల్లో ఒకటేగానీ అదిమాత్రమే గుణంకాదు. మనకి రూపం లేదని తెలిసేవరకూ మనం దైవాన్ని ఒక రూపంతో పూజించడం వల్ల లాభమే గానీ నష్టంలేదు. దైవాన్ని మనకి ఇష్టమైన రూపంలో ఎదురుగా ఉంచుకున్నా కొలిచేదిమాత్రం అందులోని అదృశ్యశక్తినే అయినప్పుడు రూపంవల్ల వచ్చిన నష్టం ఏముంది. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడన్న అనుభవం కలిగేవరకూ రూపధ్యానం, నామజపం అవసరం. భగవంతుని విషయంలో రూపం, నామం, శక్తి వేరుగాలేవు. ఏ వస్తువునుండీ రూపాన్ని వేరుచేయలేము.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment