అరుణాచలమే జ్ఞానమార్గం,
నీ శరీరం దేవుడు కట్టుకున్న గుడి.
నీ హృదయం ఆయన గర్భగుడి.
అందులో స్పందనగా ఆ భగవంతుడే కొలువై ఉన్నాడు.
మనస్సే ఆ గర్భగుడికి గడప. ఆయన కట్టుకున్న గుడి నిజం పులిలాగ నిజమైన గుడి.
నువ్వు కట్టించిన గుళ్ళు పేపర్ టైగర్ లాగ బొమ్మల కొలువులో గుళ్ళు.
ఎంతసేపూ, ఆవారాగా, గుడి బయట దుకాణాల మధ్య తిరుగుతూంటావు బతుకంతా. పరుసు కొట్టేశారని కొన్నాళ్ళు, భక్తుడవై, గుళ్లో ప్రదక్షణాలు చేస్తూ తిరుగుతూంటావు.
ఇంకా ముదిరితే, పూజారివై, దేవుడి గడప దగ్గర కూర్చుని పూజలూ అర్చనలూ చేస్తావు, పొద్దల్లా..
మోహమాటపడకు. గడప దాటి గర్భగుడి లోపలికి వెళ్ళు. దేవుడు తప్పుకుంటాడు. ఆ చోటు నీకోసం ఇన్నాళ్లూ పట్టి ఉంచానంటాడు.
పరాయివాణ్ణి కానంటాడు.
కొంతసేపటికి కనుమరుగై ఇక్కడ ఎప్పుడూ కూడా ఇద్దరం లేమే.. చూసుకో.. అని కథా శ్రవణం ముగిస్తాడు.
ఆలస్యం చెయ్యకు. అడుగుపెట్టు. అక్కడా ఇక్కడా తిరగకు, గుడి మూసేస్తారు.
అరుణాచలశివ🙏🏻
No comments:
Post a Comment