Wednesday, July 17, 2024

 ప్రతి కొడుకు,తల్లి, అత్త,కో్డలు,మనవడు ,భార్య,భర్త,,,,,
ఒక్కరికేంటి అందరికి కనువిప్పు కలిగించే
ప్రతి ఒక్కరూ చదవవలసిన వాస్తవ కథ.........
హిందు స్థాని 
ఓ కొడుకు.........కోడలు....వారి పుత్రుడు.........వారితో పాటు నాన్నమ్మ ఒకే ఇంట్లో ఉండేవారు.
ఆ కోడలికి అత్తగారిని ఎలాగైనా వేరుగా ఉంచాలి అన్న ఆలోచం ఉండేది.ఎన్నో సార్లు భర్తను అడిగి చూసింది. కానీ ఆ కొడుకు దానికి ఒప్పుకోలేదు..........రోజూ ఏదో వంకతో భర్తను సాధించసాగింది.
ఒకరోజు భర్తతో మంచిగా ఉంటూనే..........ఇలా అన్నది......
" మీ అమ్మ ను పక్కనే ఉన్న ఇంట్లో ఉంచి.....సమయానికి ఆమెకు వేడి వేడిగా వేళకు చేసి
పంపుతాను. ఆమెకూడా విశ్రాంతిగా ప్రశాంతంగా ఉంటుంది కదా! ఒక్కసారి ఆలోచించండి "
ఏదో చికాకులో ఉండి " సరేలే చూద్దాం " అన్నాడు భర్త......ఇదే అదనుగా అత్తగారికి ఇంటికి పక్కనే
ఓ ఇంటిని చూసి పంపడానికి రెడీ చేసింది ఆ కోడలు......
ఆ తల్లి కూడా కొడుకు మాటను కాదు అనలేక.........తనవల్ల ఇద్దరి మధ్య గొడవ ఎందుకని ఆ తల్లి అంగీకరించింది..కానీ కొడుకు కు తెలియకుండా ఆ కోడలు ఆ అత్తగారికి ఓ షరతును పెట్టింది.
అదేంటంటే.........అత్తగారికి ఓ పళ్ళెం ఇచ్చి భోజనానికి టిఫినుకు ఆ పళ్ళెం తీసుకుని అత్తగారు
రావాలి....
పాపం ఆ తల్లికి ఇది అవమానంగా అనిపించింది.......అడుక్కుతినే దానిలా అలా వెళ్ళడం బాధగా
అనిపించినా కొడుకును ఇబ్బంది పెట్టలేక అలాగే చేసింది ఆ అత్తగారు.
ఇది మనవడికి చాలా బాధగా అనిపించేది..........నాన్నమ్మ అలా దూరంగా ఉండటం ఆ
పసిమనసుకు నచ్చలేదు. అలా తిండికోసం నాన్నమ్మ రావడం అస్సలే నచ్చలేదు....
వాళ్ళ అమ్మకు తెలియకుండా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకునేవాడు.......
అలా కొన్ని సంవత్సరాలు గడిచి పోయాయి....మనవడికి మంచి ఉద్యోగం వచ్చింది....మొదటి జీతం
రాగానే తన తల్లికి ఓ వెండి పళ్ళెం కొని తీసుకుని వొచ్చాడు........తల్లి ఆనందంతో ..........
" నామీద ఎంత ప్రేమరా! నీకు నాకోసం వెండి పళ్ళెం తెచ్చావా! నువ్వే రా నా కొడుకంటే" అంటూ కొడుకును మెచ్చుకుని మళ్ళీ ఇలా అంది.......
" ఇంట్లో ఎవరికీ వెండి పళ్ళెం లేదు మరి నాకే ఎందుకు తెచ్చావురా కన్నా! " అని అడిగింది.
దానికి ఆ కొడుకు ఇలా జవాబు ఇచ్చాడు....
" అమ్మా! రేపు నాకు పెళ్ళి అవుతుంది.. నువ్వుకూడా వేరేగా ఉండాల్సి వస్తుంది కదా! అప్పుడు
నా పెళ్ళాం నీకు కనీసం స్టీలు పళ్ళెం కూడా ఇవ్వడానికి ఒప్పుకోకపోవచ్చు....అందుకే ఇప్పుడే
వెండి పళ్ళెం కొనేశాను..........రేపు నువ్వు ఏ ఆకులోనో అన్నం తినడం నేను చూడలేనమ్మా!"
కనీసం మా అమ్మ వెండి పళ్ళెంలో అడుక్కుంటుందన్న తృప్తి నాకు ఉండాలి కదమ్మా!"
కాబట్టీ............మనము ఇతరులకు చేసే మంచైనా, చెడైనా మళ్ళీ మనకే తిరిగి వస్తుంది....
#ViralV🚩
తల్లిదండ్రులను భారంగా భావించి మీరు తప్పు చేస్తూ........మీ పిల్లలకు కూడా నేర్పకండి 🙏
#motherslove ❤️

No comments:

Post a Comment