*_🌹'నేటి ఆధ్యాత్మిక సాధన..'🌹_*
*_మనం ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నప్పుడు తప్పు చేయడానికి దూరంగా ఉండాలి. తెలియని వారు చేస్తే అది వేరే కానీ ,మనం భగవద్గీత గురించి తెలుసుకొని భౌతిక సుఖాల కోసం, తప్పు చేయడమనేది చాలా విచారకరం._*
*_మానవజన్మ వచ్చింది భగవంతుని గురించి తెలుసుకోవడానికి మరియు జీవన్ముక్తి పొందడానికి (తిరిగి తిరిగి జన్మించకుండా) అని నమ్మి, దైవికమార్గం గురించి తెలుసుకొని చివరి వరకు ఆ మార్గంలో నడువడం అనేది చాలా ముఖ్యం._*
*_ఎవరి కష్టాలకైనా కారణం కర్మే కాబట్టి కర్మని ఎలా తొలగించుకోవాలి, ప్రస్తుతం ఇప్పుడు ఎటువంటి కర్మ చేయాలి. అనేదే ముఖ్యము._*
*_భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు కర్మ మార్గమును ఆచరించడం ఉత్తమం. ప్రారబ్ద కర్మను బట్టి సంచిత కర్మ ఉంటుంది. సంచిత కర్మను బట్టి ఆగామి కర్మ ఉంటుంది._*
*_ప్రారబ్దకర్మను మనము ఏమి చేయలేము కానీ, సంచిత కర్మ మన చేతిలో ఉంది కాబట్టి జాగ్రత్తగా కర్మలు చేయండి._*
*_అంటే ఆచితూచి మాట్లాడడం, అలాగే ఒక పని చేసేముందు వాటి పర్యవసానం తెలుసుకోవడం._*
*_మానవుడు తాను చేయవలిసింది చేస్తే,మానవులు మాధవుడు గా మారవచ్చు .అది మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనం ఉత్తమమైన ఆధ్యాత్మిక మార్గంలో నడిస్తే ప్రతి ఒక్కరు రుషితత్వమును పొందుతారు ._*
*_ఆ తర్వాత వారు మాధవులే అవుతారు. తపస్సు చేసినప్పుడు రాక్షసులకు సైతం వరాలిచ్చిన భగవంతుడు మనం గొప్పదైన ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నప్పుడు మనకు ఎందుకు ఇవ్వడు అని ఒకసారి ఆలోచించండి._*
*_మనలోనే ఏదో లోపం ఉంది అని గ్రహించండి .మనం నడిచే మార్గాన్ని బట్టి దైవ సహాయం అందుతుంది. కాబట్టి ఆ మార్గాన్ని మీరు తెలుసుకొని నడుచుకోవాలి._*
*_తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే గురువులను ఆశ్రయించండి. మనం ఉన్నతలోకాలలో ఉండాలి అంటే ధ్యానం ఒక్కటే కాకుండా ,జీవించే విధానం కూడా ఎంతో ఉన్నతంగా ఉండాలి. అప్పుడే మీరు ఏ దైవ లోకము కోరుకుంటే ఆ లోకానికి వెళ్ళవచ్చు.✍🏾_*
*_'శ్రీ గురుభ్యో నమః '🙏🏾_*
*_'సర్వం కృష్ణార్పణమస్తు.. 🚩🙏🏾_*
*_-మీ డా. తుకారాం జాదవ్. 🙏🏾_*
No comments:
Post a Comment