Friday, July 26, 2024

✍🏽 నేటి కథ ✍* *దేని అందం దానిదే

 *✍🏽 నేటి కథ ✍*

*దేని అందం దానిదే*

*డా॥ ఎం. హరికిషన్ - 9441032212*

ఒక అడవిలో ఒక గాడిద ఉండేది.
అది ఒకరోజు నెమలి పురివిప్పి ఆట ఆడుతుంటే చూసింది.
" అబ్బ... ఆ నెమలి పింఛం ఎంత అందంగా ఉంది. అది నాకు గూడా ఉంటే
ఎంత బాగుంటుందో” అనుకొంది.
ఒకరోజు గాడిద ఏటిలో నీళ్ళు తాగుతా పులిని చూసింది.
“అబ్బ... దీని ఒళ్ళంతా చారలు చారలుగా ఎంత నిగనిగలాడుతోంది. నాగ్గూడా
ఒళ్ళంతా పులిలా చారలుంటే ఎంత బాగుంటుందో” అనుకొంది.
ఒకరోజు గాడిద పొడవైన మెడతో ఒక పెద్ద చెట్టు ఆకులు తెంపుతా వున్న
జిరాఫీని చూసింది.
“అబ్బ... దీని మెడ ఎంత బాగుంది. నాకు గూడా ఇలాంటి పొడవైన మెడ
వుంటే ఎంత బాగుంటుందో” అనుకొంది.
గాడిద తాను అందంగా లేనని చాలా బాధపడసాగింది.
ఒకరోజు దానికి ఒక ముని కనిపించాడు.
ఆ ముని కాళ్ళపై పడి “నాకు నాలుగు వరాలు ఇవ్వు" అని వేడుకొంది.
ముని దాని బాధ చూసి “సరే” అన్నాడు.
గాడిద వెంటనే నెమలిలాగా పింఛం, పులిలాగా చారలు, జిరాఫీలాగా మెడ
కావాలనుకొంది. మూడు వరాలతో మూడు వచ్చేశాయి. నాలుగోవరం దాచుకొంది.
గాడిద సంబరంగా ఇంటికి పోయింది. కానీ దాన్ని చూసి మిగతా గాడిదలన్నీ
భయపడిపోయాయి. కొన్ని పారిపోయాయి.
ఏవీ దానితో మాటలు కలపలేదు. మిగతా జంతువులుగూడా దూరం దూరం
తిరగసాగాయి.
దాంతో ఆ గాడిద పోయి చెరువులో తన రూపం తాను చూసుకొంది. ఆ
చారలు, పొడవైన మెడ, నెమలి పింఛం తనకే చాలా వికారంగా అనిపించాయి.
తన పాత రూపమే చాలా అందంగా తోచింది.
వెంటనే నాలుగోవరంతో తన రూపం తనకు రావాలని కోరుకుంది.

No comments:

Post a Comment