*🌺 ఓం నమఃశివాయ 🌺*
*' త్యాగే నైకే అమృతత్వ మానసు: '....అంటుంది వేదం....*
*అంటే త్యాగము ద్వారానే అమృతత్వం సిద్ధిస్తుంది..*
*నిండిన కుండ ఖాళీ అయితేనే మళ్ళీ నింపడానికి వీలు పడుతుంది..*
*గుడి ముందు ఉన్న యాచకులను బాగుచేయలేని వాడు దేవుడెలా అవుతాడు !?*
*మనల్ని ఎలా బాగు చేస్తాడని కొందరు మూర్ఖులు ప్రశ్నిస్తూ ఉంటారు..*
*అయితే ఆ యాచకులను ఆదుకొమ్మనే దేవుడు తమకు ధనాన్ని ఇచ్చాడని, వారిని తన దృష్టిలో పడేలా చేశాడని మాత్రం తెలుసుకోరు!*
*వారికి పైసా విదల్చరు కానీ దేవుని ఉనికిని ప్రశ్నిస్తారు!! ఇది తగని పని..*
*ఉన్నదానిని పది మందికి పంచి ఆదుకోవాలి..*
*భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.*
*తమ గురించి తాము ఎటువంటి ఆందోళన చెందకుండా భగవంతునిపై విశ్వాసం ఉంచుకోవాలి.*
*మీ పాత్ర ఖాళీ అవుతుంటే భగవంతుడు దానిని మళ్ళీ నింపుతుంటాడు.*
*తద్వారా త్యాగమనే చక్రం నిరంతరం తిరుగుతూ ఉండాలి.._*
*🌹ఓం నమఃశివాయ 🌹*
No comments:
Post a Comment