Saturday, July 13, 2024

 💐💐💐#కుక్కే_సుబ్రమణ్య_స్వామి_ఆలయం💐💐💐

అతిశక్తివంతమైన నాగ దోష పరిహారం గుడి ! 
కుక్కే శ్రీ సుబ్రమణ్యస్వామిగుడిలో నాగ దేవత ఎప్పుడూ కొలువైవుంటుందిఅని ప్రగాఢ విశ్వాసం.

కుక్కే శ్రీ సుబ్రమణ్యస్వామి వారి గుడి నాగదోషపరిహారములకు చాలా ప్రసిద్ధమైనది.ఇక్కడ ప్రధానంగా సర్పహత్యాదోషం, ఆశ్లేష బలి పూజ మరియు నాగప్రతిష్టపూజలు చాలా నిష్టగా నిర్వహిస్తారు. 

కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని సుల్లియా అనే వూర్లో కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయం వుంది.

 ఈ ఆలయం ప్రాకృతిక సౌందర్యాలు వెలువరించే కర్ణాటకరాష్ట్రం దక్షిణ కన్నడజిల్లాలో మంగళూరుకి 100కిమీ ల దూరంలో కుమారపర్వత శ్రేణులమధ్య ధారా నది ఒడ్డున వున్న గ్రామం 'సుబ్రహ్మణ్యం'లో వుంది. సుబ్రమణ్యస్వామిని ఇక్కడ నాగదేవతగా ఆరాధించటం విశేషం. 

పూర్వం ఈ గ్రామాన్ని 'కుక్కె పట్నం' అని పిలిచేవారు.క్రమంగా ఇది కుక్కె సుబ్రహ్మణ్య'గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ గుడిలో నాగదోషపరిహారములు చేసుకుంటే వారికి జీవితంలో ఎటువంటి బాధలులూలేకుండా మంచి సంతానం కలిగి సుఖసంతోషాలతో జీవిస్తారని పురాణ గాధల్లో వుంది.

కుక్కే సుబ్రమణ్యస్వామివారి ఆలయస్థల పురాణం ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగినది  .  మన దేశంలో ఎన్నో దేవాలయాలు వెలిసాయి.వాటిలో కొన్ని ఆలయాలను భక్తులు, రాజులు, వంశస్థుల వారు దేవుడిపై భక్తిని చాటిచేప్పెందుకు నిర్మించగా మరి కొన్ని దేవాలయాల్లో దేవతలు స్వయంభూలుగా వెలిసారు. 

అలా వెలిసిన దేవాలయాల్లో కుక్కే సుబ్రమణ్యస్వామిఆలయం ఒకటి.కుమారస్వామి అంటే సుబ్రమణ్యస్వామి. కార్తికేయుడికి నిలయమైన ఈ క్షేత్రాలలో పరశురామక్షేత్రం ఒకటి. సుబ్రమణ్యఆలయం గురించి 'స్కాందపురాణం'లో సనత్ కుమారసంహితలోని సహ్యాద్రికాండలోని తీర్ధక్షేత్ర మహామణి పురాణంలో తెలుపబడింది.

స్థలపురాణం పూర్వం తారకుడు, సూర్పర్మాసురా అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. తన ఆయుధాన్ని ఇక్కడి ధారానదిలో శుభ్రపరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత కుమారధార పర్వతశ్రేణులలో గణపతి మున్నగు దేవతలతో కుమారస్వామి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇంద్రుడు తన కుమార్తెను వివాహం చేసుకొమ్మని కోరగా ఆయన అంగీకరిస్తాడు. ఆ తరువాత వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో తనతో పాటు వెలియడానికి అంగీకరించటం వల్ల ఈ క్షేత్రం వెలసింది.

 సుబ్రమణ్యస్వామి ముఖద్వారం తూర్పుముఖమై ఉన్నా, భక్తులు మాత్రం పృష్టభాగం నుండి ముందుకు వెళ్లి స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. గర్భగుడికి, ఈమధ్య నిర్మించబడ్డ వసారాకు మధ్యన వెండితాపడాలతో అలంకరింపబడ్డ స్తంభం ఉంటుంది.

No comments:

Post a Comment