*గోవిందా గోవింద,!!!*
*శ్రీ వెంకటేశ్వర స్వామి ఏయుగానికి చెందినవారు!??*
🌹\|/ తిరుమల లో స్వామి వారు శిలారూపం లో దర్శనం ఇవ్వడం ప్రారంభించింది కలియుగం లోనే కావచ్చు......
🌹\|/ కానీ స్వామి వారు కృతయుగం నుండి తిరుమల లొనే " మాయా స్వరూపం "లో వున్నారు.
అందుకే స్వామివారు శ్రీ ఆది వరహస్వామి గా తిరుమలనే కలియుగంకు నాందిగా కృతయుగం లొనే ఎంచుకున్నారు., అందుకే వరాహస్వామి తిరుమలలో వెలిసినారు.
🌹\|/ పూర్వం సృష్టి ప్రారంభం లో శ్వేత వరాహ కల్పం లో వరాహస్వామి భూమిని సముద్రం నుండి పైకి తెచ్చి సృష్టిని ఆరంభింప చేశాడనితదనంతరం వెంకటాచలం పైన ఇప్పటి స్వామి వారి పుష్కరిణి పక్కన శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నాడని వరాహ పురాణం చెప్తుంది.దానికి నిదర్శనమే ఇప్పుడు మనం చూస్తున్న పుష్కరిణి కి పశ్చిమాన కల వరాహస్వామి ఆలయం.
🌹\|/ ఈ సంఘటన సృష్టి ఆరంభం లో సుమారు 200 కోట్ల సంవత్సరాల కాలం క్రితం జరిగింది.
దానికి ఋజువే నేటి సహజ సిధ్ధ శిలాతోరణం కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా ఈ శిలాతోరణం వయస్సు 200 బిలియన్ సంవత్సరాలు గా తేల్చారు.
🌹\|/ శ్రీనివాసుడు తిరుమల పై కలియుగాంతం వరకు ఉండడానికి వరాహస్వామి అనుమతి ఇచ్చినందున ప్రథమ దర్శన భాగ్యాన్ని శ్రీనివాసుడు వరాహ స్వామి వారికి కల్పించారని వెంకటాచల మహత్యం లో తెలుపబడింది. దానికి నిదర్శనమే నేటి వరాహ స్వామి సన్నిధి లో కల అనుమతిపత్రం. (అయితే అది కుబేరయంత్రం అని ఒక నమ్మకం కలదు )
🌹\|/త్రేతాయుగంలో దశరథ మహారాజు తిరుమల క్షేత్రo లో అప్పటికి ఎవరికీ సాధ్యం కాని స్వామి వారి " మాయా స్వరూప" దర్శనం చేయగలిగిన కారణంగా..... పుత్రుడు కొరకు ప్రార్ధించడం, స్వామి శ్రీ రామునిగా అతనికే జన్మించాడు అని వెంకటాచల మహత్యం లో చెప్పబడింది
🌹\|/రావణుని బారి నుండి రక్షింపమని మునులు, ఋషులు వెంకటాచాలమునకు వెళ్ళుట. శ్రీనివాసుడు అభయమిచ్చుట.
🌹\|/శ్రీరాముని కంటే స్వామి హనుమ వయసులో పెద్ద.
త్రేతాయుగం కాలంలో బాల్యం లో అల్లరి చేస్తున్న అతనిని అతని తల్లి , అల్లరి చేస్తే ఎదురుగా ఉన్న పుట్టలో ఒక నల్ల బూచాడు వున్నారు..అతనికి నిన్ను ఇచ్చేస్తా అని భయపెట్టి, చేతులకి బేడీలు వేసి అన్నందనిలయనికి ఎదురుగా నిలబెట్టింది.
🌹\|/మనం ఇపుడు తిరుమల లో చూస్తున్న బేడి ఆంజనేయ స్వామి విగ్రహం త్రేతాయుగం లోనిది.
అంటే స్వామి అక్కడ అప్పటి నుంచే ఉన్నట్టే కదా.
🌹\|/ద్వాపరయుగంలో బలరాముడు కూడా మహాభారత యుద్ధం సమయం లో మనశాంతి కోసం తిరుమల ,మొదలగు క్షేత్ర దర్శనానికి వచిన్నట్టు ఆధారాలు ఉన్నాయి.
🌹\|/ పాండవులు అరణ్య వాసం లో కూడా తిరుమల క్షేత్ర దర్శనం చేశారు అని ఆధారాలు ఉన్నాయి.
వారు స్నానం ఆచరించి, కొంత కాలం కొండ పై గడిపిన తీర్థమే నేటి తిరుమల లో " పాండవ తీర్థం".
🌹\|/ఇలాంటి ఎన్నో సాక్ష్యాధారాలు చాలా ఉన్నాయి కనుక తిరుమలలో శ్రీనివాసుడు మాయా స్వరూపంలో కృతయుగం నుంచి ఉన్నాడు కానీ శిలారూపంలో కలియుగం నుండి మాత్రమే దర్శనం ఇస్తున్నారు అంతే.
*🙏ఓం నమో వెంకటేశాయ.🙏*
No comments:
Post a Comment