=====================
మహర్షి మెచ్చిన ముని శ్రీ కావ్య కంఠ గణపతి ముని...
ప్రసాదవర్మ కామ ఋషీ
======================
జూలై 25 ఈ రోజు శ్రీ కావ్య కంఠ గణపతి మునివారి వర్ధంతి సందర్భంగా.
శ్రీరమణ మహర్షిని మొదట ఆ పేరుతో పిలిచినవాడు... మౌనాన్ని ఆశ్రయించిన ఆయనతో మాట్లాడించినవాడు... “నాయన'గా ప్రసిద్ధి కెక్కినవాడు... కావ్యకంఠ గణపతి ముని. తపోవేత్త మాత్రమే కాదు... కవి, దేశభక్తుడు,
సంస్కరణశీలి!
మహర్షి మెచ్చినముని
అపారమైన పాండిత్యం, దేశ విముక్తి కోసం ఆరాటం, సంఘసంస్కరణ అభిలాష, ఆధ్యాత్మిక ఉన్నతికోసం తపన.. ఇవన్నీ కలగలసిన విశిష్టమైన వ్యక్తి వశిష్ఠ లేదా కావ్యకంఠ గణపతి ముని. శ్రీ రమణ మహర్షికి సన్నిహిత
శిష్యునిగా, బహు గ్రంథకర్తగా ఆయన సుప్రసిద్ధుడు. గణపతి ముని తండ్రి అయ్యల సోమయాజుల నరసింహశాస్త్రి. వారిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఉన్న కలువరాయి గ్రామం. పూర్వీకులనుంచి
వారసత్వంగా వచ్చిన గ్రామాధిపత్యంతో పాటు జ్యోతిష, ఆయుర్వేద, మంత్ర శాస్త్రాలలో నరసింహశాస్త్రి దిట్ట. ఆయనకు వారణాసిలోని డుంఠి గణపతి ఇష్టదైవం. కాగా, ఆయన భార్య నరసమ్మగారికి అరసవిల్లిలోని
సూర్యనారాయణమూర్తి ఇష్టదైవం. నరసమ్మగారు ప్రసవానికి పుట్టింటికి వెళ్ళగా, నరసింహశాస్త్రి కాశీకి ప్రయాణం అయ్యారు. 1878 నవంబరు 11వ తేదీ మధ్యాహ్నం డుంఠి గణపతి ఆలయంలో కూర్చొని ఆయన జపం చేస్తూండగా, గణపతి విగ్రహం నుంచి ఒక పసిబాలుడు పాకుతూ వచ్చి, ఆయన తొడమీద కూర్చొని అదృశ్యమైనట్టు కనిపించింది. ఆ శుభ శకునానికి ఆనందించి ఆయన తిరుగు ప్రయాణమై, అత్తవారి ఇంటికి చేరుకున్నారు.
తనకు కాశీలో పసిబాలుడు కనిపించిన సమయానికే, భార్యకు ప్రసవమై, కుమారుడు పుట్టినట్టు ఆయనకు తెలిసింది. ఆ బాలుడికి సూర్య గణపతిశాస్త్రి అని పేరు పెట్టారు. బాల్యంలో మాటలు రాని ఆశుకవి! | గణపతిశాస్త్రిని
ఎన్నో బాలారిష్టాలు చుట్టుముట్టాయి. కంఠనాళాలు మూసుకుపోయి, ఆరేళ్ళ వయసు వచ్చినా మాటలు రాలేదు. చివరకు నొసటా, ఇతర నాడీ సంబంధమైన ప్రదేశాల్లో కాల్చిన లోహం తాకించి, అగ్నిస్పర్శ చికిత్స చేయించడంతో
స్వస్థత చేకూరి, త్వరలోనే మాటలు వచ్చాయి. ఆరేళ్ళకు ఆయనకు అక్షరాభ్యాసం, ఉపనయనం చేశారు. కట్ట | తెగిన సెలయేరులా వాక్రవాహం మొదలయింది. ఛందో, వ్యాకరణ, అలంకార శాస్త్రాలలో, కావ్య, ఇతిహాసాలలో
నిష్ణాతుడయ్యాడు.
ఆశుక హ్మ్విగా, వక్తగా ప్రసిద్ధుడయ్యాడు. అవధానాలు మొదలు పెట్టాడు. తపస్సు కోసం తండ్రితో వివాదం
అప్పటి సాంఘిక సాంప్రదాయాల ప్రకారం, గణపతికి 12వ ఏట వివాహం జరిగింది. ఆయన భార్య విశాలాక్షికి అప్పటికి 8 సంవత్సరాలు. ఆమెకు యుక్తవయస్సు వచ్చిన తరువాత, కోడలును ఇంటికి తీసుకురావాలని
నరసింహశాస్త్రి భావించారు. అయితే కొంతకాలం తపస్సు చేయాలని గణపతి అనుకున్నారు. ఈ విషయమై తండ్రికీ, కొడుకుకూ మధ్య వివాదం జరిగింది. చివరకు. తాను ఏడాదిలో 6 నెలలు ఇంట్లో ఉంటాననీ, 6 నెలలు
తపోయాత్రకు వెళ్ళడానికి తండ్రి, భార్య అంగీకరించాలనీ గణపతి షరతు పెట్టి ఒప్పించారు.
నవద్వీపాన్ని మెప్పించిన కావ్య కంఠుడు... | తండ్రి ఆశీస్సులతో మొదట ప్రయాగకూ, అక్కడి నుంచి కాశీకీ గణపతి శాస్త్రి వెళ్ళారు. కాశీలో ఉండగానే, దర్భంగా సంస్థాన పాఠశాల ప్రధానో పాధ్యాయుడు శివకుమార పండితునితో
పరిచయం అయింది. గణపతి పాండితీ వైభవానికీ, ప్రజ్ఞాపాటవాలకూ ఆయన ఆకర్షితుడయ్యాడు. బెంగాల్లో ప్రసిద్ద విద్యా కేంద్రమైన నవద్వీపానికి వెళ్ళి, విద్వత్ పరీక్షలో పాల్గొనాల్సిందిగా ప్రోత్సహించాడు. ఒక పరిచయ పత్రం, మందస రాజు ఆర్థిక సహాయంతో సహా అన్ని ఏర్పాట్లూ చేశాడు. నవద్వీపంలో ఉద్దండ పండితుల మధ్య 'గణపతి రితి కవి కులపతి రతి దక్షో దాక్షిణాత్యోహం' అంటూ తన శబ్ద ప్రభుతనూ, వశ్యవాక్కునూ, పాండితీ వైభవాన్ని గణపతిశాస్త్రి అత్యద్భుతంగా ప్రదర్శించారు. 'కావ్యకంఠ అనే బిరుదును అందుకున్నారు. తరువాత గోత్ర ఋషి నామాన్ని చేర్చుకొని, 'వాశిష్ట గణపతి శాస్త్రి'గా పేరు మార్చుకున్నారు. అదే వేద సాంప్రదాయం!
మంత్ర, ధ్యానాలలో స్త్రీ, పురుష, వర్గ భేదాలు అసంబద్దమనీ, సామాజిక, ఆర్థిక రంగాలలోనే కాకుండా ఆధ్యాత్మిక రంగంలో సైతం మహిళలకు సమాన హక్కులు ఉండడమే వేద సంప్రదాయమనీ గణపతి శాస్త్రి చెప్పేవారు.
దళితులకు మంత్ర దీక్షలు ఇచ్చారు. పరదేశీ యుల పాలనలో ఉన్న దేశ విముక్తి కోసం ఆయన ఎంతగానో తపించారు. ఉమాసహస్రం', 'ఇంద్రాణీ సప్తశతి' తదితర స్తోత్ర గ్రంథాలలో సైతం జాతీయ భావాలను చొప్పించిన విలక్షణ
దేశభక్తుడాయన. హైదరాబాద్ లోని ఆది హిందూ సంఘం ప్రతినిధులు ఆయనను మాడపాటి హనుమంతరావు - గారి ఇంటినుంచి పల్లకిలో ఊరేగిస్తూ, వారి హాస్టల్ కు తీసుకువెళ్ళి, 'ముని' అనే బిరుదుతో సత్కరించారు.
1923 డిసెంబరులో కాకినాడలో నిర్వహించిన కాంగ్రెస్ మహాసభలలో బులుసు సాంబమూర్తిగారి ఆహ్వానంపై గణపతి ముని పాల్గొని, మహిళల హక్కులపై అద్బుతంగా ప్రసంగించారు. 1924లో మహాత్మా గాంధీ అధ్యక్షతన
బెల్లాంలో జరిగిన సభలో, ద్రవిడ రాష్ట్రీయ కాంగ్రెస్ అధ్యక్షుని హోదాలో పాల్గొని, అస్పశ్యతను తీవ్రంగా ఖండించారు. అది శాస్త్ర సమ్మతం కాదని గణపతి ముని ఇచ్చిన వివరణకు గాంధీ ఎంతో సంతోషించారు. అయితే,
సంస్కుతాన్ని జాతీయ భాషగా చెయ్యాలని కోరుతూ గణపతి తీర్మానాన్ని ప్రవేశపెడతారని తెలిసి, గాంధీ ఆయనను వారిం చారట. రాజకీయాలతో జోక్యం పెట్టుకోవద్దని చెప్పారట! శ్రీ రమణునితో అనుబంధం | తపస్సే గణపతి
ముని ప్రధాన లక్ష్యం. దానికోసం వివిధ క్షేత్రాలను సందర్శించడం మొదలుపెట్టారు. ఆ భాగంగా తమిళనాడులోని తిరువన్నామలై (అరుణాచలం) చేరుకున్నారు. అక్కడ తన సమవయస్కుడొకరు 'బ్రాహ్మణ స్వామి'గా
మన్ననలు అందుకోవడం గమనించారు. 1907 నవంబరు 18వ తేదీన, విరుపాక్ష గుహ బయట ఒక రాతిమీద కూర్చొని ఉన్న బ్రాహ్మణ స్వామిని కలుసుకొని, నమస్కరించారు. “నా సాధనలో ఏదో లోపం ఉందనిపిస్తోంది.
జపతప, సాధనలు ఎన్ని చేసినా తపస్సు స్వరూపం నాకు తెలియడం లేదు. దయచేసి మీరు చెప్పాలి” అని ప్రార్థించారు. “నేను' అనే స్పురణ ఎక్కడినుంచి వస్తోందో విచారిస్తే, మనసు అందులో అణిగిపోతుంది. అదే
తపస్సు, మంత్ర, శభోత్పత్తి ఎక్కడ జరుగుతోందో గమనిస్తే మనసు అందులో లీనం అవుతుంది. అదే తపస్సు!” అని బ్రాహ్మణ స్వామి వివరించారు. తన సుదీర్ఘ అన్వేషణ ఆనాటితో సమాప్తం అయిందని గణపతిశాస్త్రి
భావించారు. బ్రాహ్మణ స్వామి అరుణాచలం చేరినప్పటి నుంచీ (1896 సెప్టెంబరు 1) మౌనంగానే ఉండేవారు. మొదటిసారిగా మౌనం వీడి మాట్లాడింది గణపతి శాస్త్రితోనే! | భగవాన్ శ్రీ రమణ మహర్షి' అనే మకుటంతో అయిదు
శ్లోకాలతో 'శ్రీ - రమణ పంచకాన్ని గణపతి శాస్త్రి రచించి, గురుదక్షిణగా బ్రాహ్మణ స్వామికి సమర్పిస్తే, ఆయన “సరే నాయనా!” అన్నారు. అప్పటినుంచి బ్రాహ్మణస్వామి శ్రీరమణ మహర్షిగా, గణపతిశాస్త్రి 'నాయన'గా
ప్రసిద్ధులయ్యారు. తనకు అంతటి గొప్ప గురువును , ప్రసాదించినందుకు కృతజ్ఞతగా నాయన ఉమాసహస్రం' రాసి అమ్మవారికి సమర్పించారు. ఆరుణాచలంలో ఉన్నప్పుడే నాయ నకు కపాల భేదన సిద్ధి కలిగింది. అప్పుడు
ఆయనకు కలిగిన తాపాన్ని శ్రీ రమణులే ఉపశమింపజేశారు. అలాంటివాళ్ళు ఎక్కడినుంచి వస్తారు!
అది 1935 వినాయకచవితి. ఆ రోజున అనూహ్యమైన అపశ్రుతి చోటు చేసుకుంది. గణపతి విగ్రహానికి కాకుండా గణపతిశాస్త్రికి పూజ చేస్తా మని, దానికి అంగీకరించాలనీ భక్తులు నాయనను వేడుకున్నారు. అయిష్టంగానే
ఆయన దానికి అంగీకరించారు. పూజ చక్కగా జరిగింది. కానీ అలవాటు చొప్పున పురోహితుడు ఉద్వాసన మంత్రం కూడా చెప్పేశాడు! అది గమనించి నాయన నవ్వుకున్నారట! 1936 జూలై 25న శిష్యులు ఎప్పటిలాగానే
శనివార హోమానికి వచ్చారు. నాయన కూడా హోమంలో పాల్గొన్నారు. తరువాత శిష్యులను పంపేసి, మంచం మీద పడుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం రెండున్నర గంటలకు అనాయాసంగా శరీరాన్ని వదిలి, అనామయ
లోకానికి వెళ్ళిపోయారు.
నాయన దేహ పరిత్యాగం గురించి విన్న శ్రీ రమణులు గద్దద స్వరంతో “అటువంటి వారు మనకెక్కడినుంచి వస్తారు” అన్నారట!
కావ్యకంఠ గణపతి ముని అనేక గ్రంథాలను రచించారు. 'ఉమాస హస్రం', 'ఇంద్రాణీ సప్త శతి', 'దశ మహావిద్యలు', రేణుకా స్తోత్రం', 'అంబికా స్తోత్రం', 'శ్రీ రమణగీత, భారత చరిత్ర', అలాగే పరీక్ష అనే పరిశోధన గ్రంథం, 'ఋగ్వేద
సంహిత' (అసంపూర్ణం), సంస్కృతంలో 'పూర్ణ అనే నవలలాంటివి ఎన్నో వీటిలో ఉన్నాయి. “వేదాలు పౌరుషేయాలే! అంటే అతీంద్రీయ ద్రష్టలైన మహర్షులు రచించిన గ్రంథాలు వేదాలు!” అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు.
No comments:
Post a Comment