తెలివి అనేది మనను మనం సంస్కరించుకోటానికి, ఇతరులకు హాని చేయకుండా ఉండటానికి, వీలయిన మంచి చేస్తూ, మంచిగా జీవించటానికి ఉపయోగించినప్పుడు - మనలోని జ్ఞానాన్ని సరైన దిశలో వాడుతున్నామని అర్ధము. నిరంతరం ఎదుటివారి హాని కోరుకుంటూ, మనలో మనం చెడు భావాలకు, వ్యతిరేక ఆలోచనలకు లోనవుతున్నాము అంటే అదే జ్ఞానమును తప్పు దోవలో వాడుతున్నామని అర్ధము. మనుషులందరిలో ఉన్న ప్రాణ శక్తి ఒక్కటే.అదే అన్ని రకాలుగా పని చేసేది. దానిని మనము ఎలా వాడుతున్నాము అన్న దానిపై మన సుఖ దుఖాలు ఆధారపడి వున్నాయి. సృష్టి శరీర పరముగా అందరికీ అన్నీ సమముగానే ఇచ్చింది. మనుషులే కర్మ ఫలముల రూపములో అసమానతలు సృష్టించుకుంటున్నారు.సుఖము - దుఃఖము
ఇవి బయటి నుండి వస్తున్నవి కావు. అంతర్గత మనసులో పుడుతున్నవి. మనలో పుట్టే భావ పరంపరకు మొత్తము మనమే కారణము. ఈ విషయాన్ని అర్ధం చేసుకోగలిగితే - మన ప్రతి ఆలోచన - పని సక్రమముగా వుండేలా చూసుకోగలుగుతాము. మన ఆలోచనలు,
మన భావాలు మన అదుపులో ఉండటమే ఆధ్యాత్మికము... ఉంచుకునే ప్రయత్నమే సాధన. ఇది అర్ధమయ్యి ఆచరించటమే జ్ఞానము.
No comments:
Post a Comment