Sunday, July 7, 2024

ఇది నేర్పేదే ఆధ్యాత్మిక చదువు. ఇదే ఆత్మజ్ఞాన చదువు.

 జీవించటం అంటే ఎప్పుడు ఏదో ఒకటి కోరుకుంటూ ఉండటం - ఎప్పుడు ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉండటం - ఎప్పుడు ఏదో ఒకటి అనుభవిస్తూ ఉండటం - ఎప్పుడు ఏదో ఒకటి, చెడో,మంచో ఆలోచిస్తూ ఉండటం - ఎప్పుడూ సుఖాన్నో, దుఃఖంనో పట్టుకు వేలాడటం కాదు. జస్ట్ జీవించటం..... దేనికి అతుక్కుపోకుండా జస్ట్ జీవించటం. నిర్మల ఆకాశములో మేఘాలు సాగిపోయినట్లు - జీవితములో అనేకం వచ్చి పోతూ ఉంటాయి. నేనొక జీవ శక్తిని అని అన్నిటిని గమనించటం. అన్నీ చేయాలి - చేస్తూ చూడాలి. అన్నీ అనుభవించాలి - అనుభవిస్తూ గమనించాలి. వచ్చిపోయే వాటితో కలిసిపోయి, గతమును, భవిష్యత్తును ఊహించుకుంటూ జీవించకుండా - అన్నిటికి సాక్షిగా.... వచ్చిపోయే అనేకానికి సాక్షిగా, అనుభవాలకు ప్రయత్నాలకు, అన్ని కదలికలకు సాక్షిగా, కాలాతీతముగా నేను వున్నాను. నేను సాక్షిగా వున్నాను అన్న నిశ్చల స్థితిపై సాగుతున్న కదలికలు ఇవన్నీ. ఈ కదలికలన్నిటికీ ఆధారమైన సాక్షి చైతన్యాన్ని నేను. అన్నీ నాకు తెలుసు, అన్నీ నాకు గుర్తు వున్నాయి అన్న విషయాలు కాక - గుర్తు వున్నాయి అని చెబుతున్న సాక్షిని నేను. జీవించటం కాదు ఇక్కడ జరుగుతున్నది. జీవము అంటే శక్తి ఉండటం అనేది వున్నది. జీవ లేక శక్తి చలనమే జీవితముల అనిపిస్తున్నది. చలనమును చూస్తే జీవితములా, సృష్టిలా కనిపిస్తుంది. శక్తిని చూడగలిగితే అనంతములా, స్థిరములా అనిపిస్తుంది. చూడటం మారాలి. ఇది నేర్పేదే ఆధ్యాత్మిక చదువు. ఇదే ఆత్మజ్ఞాన చదువు. 🌹god bless you 🌹

No comments:

Post a Comment