🌹 గుడ్ మార్నింగ్ 🌹జీవితములో మనము ఏమి చేసినా అది భౌతికమైనా - ఆధ్యాత్మికమైన, దైవపరమైన క్రియలు ఏవైనా మనము సంతోషముగా ఉండటానికి మాత్రమే. తప్పులు చేస్తే తాత్కాలిక సుఖం దొరకవచ్చునేమోగాని - ఆ తప్పు మనసులో కదలాడుతూనే ఉంటుంది.ఇలా తప్పుల వలన మనసు పాడవుతుంది. పాడయినా మనసు లక్షణాలు - అభద్రత భయం, కంగారు ఆదుర్ధా, వత్తిడి, డిప్రెషన్, కోపం ఈర్ష్య, అసూయ, ద్వేషం,ఆశాంతి, చంచల మనసు,నిద్రపట్టకపోవడం, గొడవలు, గోలలు, అత్యాశ - ఇలాంటి అనేక చెడు లక్షణాలు పాడయిన మనసు పరిగెత్తే దారులు.ఇవి కాలగమనములో శరీరాన్ని, కుటుంబాన్ని, మన చుట్టూ వుండే వారిని కూడా పాడు చేస్తాయి.
మనసు పాడవ్వ కూడదు అనుకున్నా - పాడయిన మనసు సరి అవ్వాలి అనుకున్నా వీటన్నిటికీ ఒక్కటే మందు - మంచి.... మంచిగా ఆలోచించటం. మంచిగా జీవించటం..... కొంచెం ఓర్చుకోవటం... కొంచెం భరించటం. ఇవి మంచి వాళ్ళ లక్షణాలు. మంచిగా ఉండటం ఆధ్యాత్మిక సాధన. 🌹god bless you🌹http://youtube.com/post/UgkxSlWOoVIzsBzjZNQrdIAS7_m6Nmwuoms2?si=5ysmumtssU1a_m_a
No comments:
Post a Comment