Sunday, July 28, 2024

****పాటలతో పరీక్షలో విజయాలు


1. గుర్తుంచుకో - 5 లక్షలు

జ్ఞాపక శక్తిని పెంచుకునేందుకు 
లేనేలేవోయ్ మందులు మాకులు   ||జ్ఞాపక||

మెదడులో ఉంటాయ్ పది వేల కోట్ల న్యూరాన్లు|| 
క్రియాశీలకంగ ఉంటాయందులొ 
జ్ఞాపక శక్తికి సంబంధించి ఐదు లక్షల న్యూరాన్లు !!     అంటే....!
 నువ్వు గురుతుంచుకోవచ్చు 
ఐదు లక్షల విషయాలు !!! 
నీకెందుకింకా? భయాలు     ॥జ్ఞాపక.. ॥

నీ మెదడులో నింపొద్దసలే
అనవసరపు విషయాలు...! 
అదే జరిగితే గురుతుండవసలే
అవసరమైన విషయాలు... 
నీకవసరమైన విషయాలు..!    ॥జ్ఞాపక॥

సినిమాలు.. స్నేహితులతో 
చిట్..చాట్లు....!! చాటింగులూ..!! 
తగ్గించుకోవాలి...!! గాసిప్పులూ కబుర్లూ.....!!! అనవసరమైనవి చేరకుంటే... 
మెదడుకు జ్ఞాపక శక్తీ 
పెరుగుతుంది.. 
చదివిందంతా గుర్తుంటుందీ...!!    ॥ జ్ఞాపక ॥

జ్ఞాపక శక్తీ సమానమేలే..!! 
అందరికి.. మనకందరికీ.. 
బ్రహ్మ సమయంలో చదివితే.. 
ఉంటాయ్ ఎన్నో ప్రయోజనాలూ.. 
ఇక వేసేయ్ మనసుకు కళ్ళెం...!! 
మీవేలే ఇంక విజయాలూ...    ॥ జ్ఞాపక ॥





2. మైండ్ హాలిడే - చదువులకు జాలిడే

ఉంటాయ్ మనసుకు మెదడుకు
వేరు వేరుగా లక్ష్యాలు 
మనసు చెప్పేదికాక..!! మెదడు 
చెప్పేది వినాలోయ్   ॥ ఉంటాయ్ ॥

ఐదు నిమిషాల విశ్రాంతివ్వాలెప్పుడు. 
సబ్జెక్ట్ నుంచి మరో సబ్జెక్ట్ 
చదివేటప్పుడు..!! 
అంటారా విశ్రాంతిని 'మైండ్ హాలిడే'..!! 
చూడొద్దు 'టీ.వీ.' లు..!! చెప్పుకోవద్దు 
కబుర్లప్పుడు..!! 
కళ్ళను చన్నీటి బట్టతో కప్పుకోవాలి..!! 
చదివినదంతా గుర్తుకు తెచ్చుకోవాలి..     ॥ ఉంటాయ్॥

ప్రిపరేషన్ హాలిడేస్' 
లో నిద్రపోవాలి!! మద్యాహ్నం రెండు గంటలు..!!

నిద్రలేచి.. స్నానం చేసి... 
చదివితే చాలు... 
ఉదయంవలెనే.. ప్రశాంతంగా ఉంటారందరు..!!
'ఒకే రోజు రెండు ఉదయాల టెక్నిక్కది'!!
ఆచరించి చూస్తే చాలు..!! 
పొందేరందరు విజయాలూ...   ॥ ఉంటాయ్ ॥ 



3. టెన్షన్ వదులు - అటెన్షన్

టెన్షన్..!! టెన్షన్ 
పరీక్ష వేళల ఒకటే టెన్షన్..!! 
ఉండాలి నీకు అటెన్షన్..!! 
మెదడు లోని కొన్ని చర్యలే 
ఆ టెన్షన్..కు కారణాలు..!! 
పాటిస్తే కొన్ని చిట్కాలు..!! 
పోవునులే ఈ భయాలు..!!     ॥ టెన్షన్ ॥

పరీక్ష రాసే పది నిమిషాల ముందు 
మూసుకోవాలి కళ్ళు..!!
ఓ రెండు నిమిషాలు చాలు...!! 
గుండె నిండా పీల్చుకోవాలి ఊపిరులు...!!
నెమ్మదిగా వదిలితే చాలు..!!     || టెన్షన్ ॥

పిడికిలి బిగించి వదలాలి....!! 
ఇలా చేయాలి... అనేక సార్లు.!!
తగ్గుతాయిలే పరీక్ష వేళల టెన్షన్లు...!!    ॥ టెన్షన్ ||

పరీక్ష రాస్తున్నంత సేపు 
నోట్లో నములుతుండాలి...!! 
ఎలాక్కయను... 
తగ్గుతాయిలే ఒత్తిడులు..!! 
పరీక్ష వేళల టెన్షన్లు..!!      || టెన్షన్ ||


4. చదువూ - నిద్రపో

ఓకే సమయంలో చదవాలోయ్ ప్రతి రోజు..!!
నిద్రపోవాలి ఓకే సమయంలో ఏ రోజు..!!
సగం విజయాలు అవుతాయిలే.. నీ స్వంతాలు..!!    ॥ఓకే॥

బ్రహ్మ ముహూర్తంలో లేస్తే బహు బాగు..!! 
చదివింది బాగా గుర్తుండిపోవు..!! 
రాత్రి పది గంటలకు పడుకుంటేనే..!! 
అది సాధ్యం..!!     ॥ఓకే॥

పెన్నూ.. పుస్తకం ఉంచుకోవాలి.. 
ముఖ్యమైనవి రాసుకోవాలి..!! 
పునశ్చరణలో కొద్ది సమయంలో.. 
ఒకేసారి గుర్తుకొస్తాయి అన్నీ..!!     ॥ఓకే॥ 

ఐదు నిమిషాల వ్యవధి ఉండాలి..!! 
సబ్జెక్ట్ విడిచి సబ్జెక్ట్.. 
మార్చి చదివేటప్పుడు..    ॥ఓకే॥

5. మనసులోనే చదువూ

బయటకు చదువుట తగ్గించాలి..!!
మనస్సులోనే చదవాలి..!!
ఉంటారప్పుడు అలసిపోకుండా.. 
సొంత విశ్లేషణతో.. రాయొచ్చుకూడా..!!    ॥ బయటకు ॥

ఎలా చదివామన్నది కాదు..!! 
ఎంత ఆసక్తిగా చదివామన్నది చూడు..!! 
తప్పులు అసలే రాయొద్దు..!! 
ఆసక్తి లేకుండా చదవొద్దు..     ॥ బయటకు ॥

మనసు పెట్టి.. ఇష్టం పెంచుకు..
భాషా.. విషయాలు.. చదవాలి..!!
బాగా నువ్వు రాయాలి.. 
అందరికి పేరు తేవాలి..      ॥ బయటకు ॥


6. ఆసక్తి - కార్టెక్స్ ఎఫెక్ట్

ఆసక్తి పెంచుకోవాలి.. చదువుపై 
అపుడే కలుగుతుంది.. ఇతర విషయాలపై అనాసక్తి..!! 
చదువుపై 'ఆసక్తి లేని వారూ'!! 
'ఇతరాలపై ఆసక్తి ఉన్నవారూ.!!    ||ఆసక్తి||


ఆసక్తి పెరగాలంటే.. పరిసరాలు ఉండాలి.. 
ఆహ్లాదకరం..!! 
చూసుకోవాలి ఉండేట్టు.. ప్రశాంతంగా 
చుట్టూ వాతావరణం..      ||ఆసక్తి||

ఆసక్తి ఉంటేనే.. గుర్తుంటాయి.. 
అన్ని విషయాలు..!! 
రోజు ఉండాలి.. కొంత సమయం.. 
ఎవరితో.. ఏమీ.. మాట్లాడకుండ..!!   ||ఆసక్తి||

నిశబ్దంగా ఉంటేనే.. పెరుగుతుంది..!!
ఏకాగ్రత.. జ్ఞాపక శక్తీ..!!
నియంత్రించుకోవాలి.. మనస్సు.. 
అపుడే లక్ష్యం చేరటం.. సుళువు..   ||ఆసక్తి||

7. డయేరియా ఆఫ్ టాకింగ్

'అదర్ ఇంటరెస్ట్' ఉండటమే కదా.. అనాసక్తి.!!
ఇతర ఆసక్తులు తగ్గించవా.!! 
చదువుపై ఆసక్తి.. 
గొప్ప చదువులు మరి.. 
చదివేదేలా??!!..
నువ్వు తెలుసుకుంటే పోలా..!!?    ||అదర్||

'టీ.వీ.'లు.. సినిమాలు చూడటం.. 
చిట్..చాట్లు స్నేహితులతో..
తగ్గించాలి బాగా.. గాసిప్పులూ..!! 
'డయేరియా ఆఫ్ టాకింగ్'... 
అంటారు వీటిని.. 
ఉండాలి.. దూరంగ.. 
వాటికీ..!!       ||అదర్||

చదువుకునేప్పుడు.. కట్టేయాలి ..
'టీ.వీ.'ని.. ఇంట్లోని వారందరూ...!! 
లేకుంటే ఉండదు.. ఏకాగ్రత 
పుస్తకాలు ముందేసుకు.. కూర్చున్నా...!!!? 
పక్కనే కూర్చోవాలి ఎదో పనితో 
చదువుకునే వాని పక్కనే పెద్దలు..!!    || అదర్ ||

8. చదవాలి - రాయాలి

ఏర్పాటు చేసుకో..! చదవాల్సిన 
అంశాలున్న సబ్జెక్టును ముందు! 
ఆ తర్వాత.. రాసే అంశాలున్న. 
సబ్జెక్టులను పెట్టుకోవాలి చివర్లో!

దొరుకుతుందిలే సమయం ఎక్కువ.. చదివేందుకు నీకు. 
పరీక్షలో విజయాలే. కల్గుతాయి. నీకూ!    ॥ ఏర్పాటు ॥

చదివేటప్పుడు రాసుకోవాలి.! 
ముఖ్యమైన సంగతులన్నీ.! 
పునశ్చరణ సమయంలో…! 
గుర్తుకు తెచ్చుకోవచ్చు 
కొద్ది సమయంలోనే విషయాలన్నీ..! 
ఇంకెందుకు పోవు । భయాలన్నీ !     ||ఏర్పాటు||


9. సబ్జెక్టు బోరు - మార్కులు నూరు

కొన్ని సబ్జెక్టులంటే- బోరు నాకంటే..! 
పరీక్షల్లో రావు కదా.. మార్కులు నూరు! 
అసలు ఇష్టం లేని సబ్జెక్టు పట్ల 
పెంచుకోవాలి ఇష్టం...! 
లేకుంటే మనకే కష్టం...!     ||కొన్ని||


ఇష్టమైన- ఆసక్తి గల సబ్జెక్టును..!
చదువు కోవాలి.. రెండు ఆసక్తి లేని 
సబ్జెక్టుల నడుమ..! 
ముందు బోర్ కొట్టే సబ్జెక్టు చదవాలి ! 
తర్వాత వెంటనే.. ఇష్టమైన దాన్ని చదవాలి..! 
తగ్గుతుంది బోరు 
పెరుగుతుంది చదువులో జోరు...! 
వస్తాయిలే మార్కులు నూటికి నూరు...!     ||కొన్ని||


No comments:

Post a Comment