🌹గుడ్ మార్నింగ్ 🌹మనలో మంచి అంతా ఆధ్యాత్మికమే. చెడు అంతా భౌతికమే. చెడును పోగొట్టుకొని, సంపూర్ణ మంచిలో జీవించటమే సాధన. శరీర అవసరాలు, ఇంద్రియ ఆకర్షణలు, కోరికలు, ప్రపంచములో అనేక అనుభవ విషయాలు - ప్రయత్నిస్తే తప్ప ఏది దొరకని సృష్టి విధానము - ఎంత ప్రయత్నించాలో - ఎంతవరకు ప్రయత్నించాలో - ఎంత కావాలో, ఎంత అనుభవించాలో, ఎన్ని అనుభవించాలో తెలిసి తెలియని స్థితి, అన్నీ కావాలనే మనసు, శరీరం - జాగ్రత్తలు చెప్పే బుద్ధి - చుట్టూ ఆకర్షించే ఎన్నో విషయాలు, వస్తువులు - అన్నిటిని పొందటానికి పోటీ పడుతున్న జన సమూహం - వీటన్నిటి మధ్యలో నిత్య ప్రయత్నము తప్పని నూరేళ్ళ జీవితం - మొత్తం మంచిగా గడిపితేనే ఆధ్యాత్మిక జీవితం. ఆ నేర్పు - ఓర్పు - ప్రజ్ఞ మనిషిలో వున్నాయి. లోపల వెతుక్కొని వాటిని పూర్తిగా వాడితేనే ఈ సాధన - అంటే ఆధ్యాత్మిక జీవితం కుదురుతుంది. నువ్వు నీకు తెలుస్తావు. 🌹god bless you 🌹
No comments:
Post a Comment