*స్వదేశీ అర్ధమైతే మన దేశం ఎప్పుడో బాగుపడుతుండే...*
బ్రిటన్ కంపనీ హిందూస్తాన్ లీవర్ గా మారి 70 సం. లుగా ఈ దేశంలో ఉన్న వనరులే వాడుతూ సబ్బులు, తలనూనెలు, పేస్టులు డిటర్జెంట్స్ సౌందర్య సాధనాలు ఇలా ప్రతీ వస్తువూ అమ్ముతూ అంబానీ, ఆదాని, టాటా, బిర్లాలు అందరి కంటే ఎక్కువ సంపాదించి వేల కోట్ల లాభాలు సంపాదిస్తూ బ్రిటన్ పట్టుకుపోతోంది.
కానీ మనకు ఎప్పుడూ బాధ గాని నొప్పి గాని అనిపించలేదు.
అయ్యో మన దేశంలో కూడా అటువంటి పెద్ద కంపనీలు తయారు అయి పలు దేశాలలో వ్యాపారం చేసి మన దేశానికి డబ్బులు సంపాదిస్తే బాగుండును కదా అన్న అలోచన కూడా ఎప్పుడూ రాలేదు.
బాగా చదువుకున్న వారి ఆలోచలను కూడా కమ్యూనిజం ఇంతలా కలుషితం చేసింది అంటే ఇంకా ఈ దేశంలో చదువురాని వారిని ఈ కమ్యూనిజం ఎంత బ్రష్టు పట్టించి ఉంటుందో ఆలోచించండి.
ఈ దేశంలో వ్యక్తుల సామర్ధ్యానికి తెలివితేటలకు లోటు లేదు. రామ్ దేవ్ బాబా నేను పతంజలి సంస్థను దేశీయ MNC గా తయారు చేసి విదేశీ FMCG హిందూస్తాన్ లీవర్ వంటి సంస్థలని ఎదుర్కొంటాను అని ఛాలెంజ్ చేసాడు. ఒక్క 10 సం. లలో వాటికి పోటీగా నిలిపి అనుకున్నది సాధించాడు.
కానీ అతనిని మనమే వెక్కిరిస్తాం. అతని ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ప్రశ్నిస్తాo. అతని మెల్ల కన్నుని, గోచీ కట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తాం తప్ప ఒక సాధారణ వ్యక్తి పట్టుదల ఉంటే ఎంతలా ఎదగగలడో అతనిని ఈ తరానికి చూపి స్ఫూర్తిని ఇవ్వం.
కానీ హిందూ స్థాన్ లీవర్ వాడు మా సబ్బు వాడితే తెల్లగా అవుతుంది అని చెపితే మన చర్మం తెల్లబడక పోయినా70 ఏళ్లుగా వాడుతూనే ఉన్నాం. వాడి కంపెనీని వెక్కిరించం. ఎందుకంటే మనకు వెయ్యి సం. ల బానిస బతుకు అలవాటు అయి మనదేశంలో వాళ్ళు చెప్పే దానికన్నా తెల్లవాడు చెప్పింది ఎక్కువ నమ్ముతాం సో కాల్డ్ చదువుకున్న మేధావులతో సహా...
ఒక్క టాటా, బిర్లా, ఆదాని, అంబానీ, రాం దేవ్ బాబా మాత్రమే కాదు అన్న�
No comments:
Post a Comment