*శ్రీ కంచి పరమాచార్య వైభవమ్ - *
🙏🌻🌻🌻🌻🕉️🌻🌻🌻🌻🙏
🪷 _*ఆపరేషన్ ముందు నమస్కారం*_ 🌹
🌈 ఒకసారి నా పేషెంట్ వాళ్ళ అమ్మ తన కూతురి శస్త్రచికిత్స విజయవంతమవ్వాలని ఆశీర్వాదం తీసుకోవడానికి పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళింది.
🌈 “స్వామీ! ఇంకో రెండు రోజుల్లో నా కుమార్తెకు ఆపరేషన్ జరగబోతోంది. అది విజయవంతమవ్వాలని మీరు ఆశీర్వదించండి” అని వేడుకుంది.
🌈 ”భయపడవద్దు. తను కోలుకుంటుంది”
🌈 “తనకు చేస్తున్నది తలకు సంబంధించిన ఆపరేషన్ పెరియవ. చాలా క్లిష్టమైన శస్త్రచికిత్స అంటున్నారు”
🌈 ”భయపడవద్దు. తను కోలుకుంటుంది”
🌈“డా. కళ్యాణరామన్ ఈ ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ సఫలమౌతుందా పెరియవ?”
🌈”భయపడవద్దు. మీ అమ్మాయికి తప్పకుండా నయమవుతుంది”
🌈 “మహాస్వామివారు నా కూతురి గురించి కళ్యామరామన్ కి కొద్దిగా చెప్తే . . . ”
🌈 “దిగులుపడకండి. ఆపరేషన్ చేసే ముందు కళ్యాణరామన్ నన్ను ప్రార్థిస్తాడు. మీ అమ్మాయిపై నా ఆశీస్సులు ఉంటాయి” అని అభయమిచ్చారు.
🌈 ఆమె ఇంటికి కూడా వెళ్ళకుండా కాంచీపురం నుండి తిన్నగా నా క్లినిక్ కు వచ్చింది. ఆమె నాతో, “మీరు చేసే ప్రతి ఆపరేషన్ ముందు పరమాచార్య స్వామివారిని ప్రార్థిస్తారు అని స్వామివారు చెప్పారు. నిజమేనా?” అని అడిగింది.
🌈 ”అవునమ్మా అది నిజమే. ఆపరేషన్ చేసేముందు చేతులు కడుక్కునేటపుడు ఆపరేషన్ థీయేటర్లో వేసుకునే చెప్పులను విడిచి ఆ రోగికి నయంకావాలని పరమాచార్య స్వామివారిని ప్రార్థిస్తాను. శస్త్రచికిత్స చేసేముందు చేతులు కడుక్కుంటూ ఎందుకు చెప్పులు విప్పుతారు అని కొన్నిసార్లు నా సహాయకులు అడుగుతుంటారు. అది ఎందుకని వారికి ఎప్పుడూ చెప్పలేదు. చెప్పులకు నీరు సబ్బు అంటకుండా ఉండడానికి అలా చేస్తానని వాళ్ళు అనుకున్నారు. నా భార్యకు, తల్లితండ్రులకు, పిల్లలకు ఎవ్వరికి ఈ విషయం తెలియదు. బహుశా నేను వారికి చేస్తున్న ప్రార్థనలు వారికి అందుతున్నాయని మహాస్వామివారు నాకు చెప్పదలుచుకుని మిమ్మల్ని మధ్యవర్తిగా చేసుకున్నారేమో”
--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై
❀┉┅━❀🕉️❀┉┅━❀
*జయ జయ శఙ్కర హర హర శఙ్కర*
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*
🙏🌻🌻🌻🌻🌹🌹🌻🌻🌻🌻🙏.
No comments:
Post a Comment