*అతను-ఆమె*
కలిసి నడిస్తే ఇద్దరం గెలుస్తమనే వాస్తవాన్ని దాచి
ఆమెను గెలవాలని అతను
అతన్ని గెలవాలని ఆమె
దాంపత్య రేఖపై ఆరాటపడుతున్నారు
గుండెపొరలో ప్రేమ ఊటను ఒకరికొకరు
పంచుకుంటూ...
ఆమె కళ్ళలో నీళ్ళు తుడవాలని అతను
అతని ఒళ్ళంతా నీళ్ళు తుడవాలని ఆమె
సమపాళ్ళు బ్రతుకు పంచుకుంటే
సంసారం స్వర్గమే కదా...
ఆమె పసుపు తాడుకు కట్టుబడింది
అతను ఆమె చూపే కరుణతాడుకు కట్టుబడ్డాడు
వారు కట్టుబడ్డది దేహాంలోనే రేగే దాహం తీర్చుకోవడానికే..
గమ్మత్తు ఏమిటంటే ఆ దాహం నుంచే దేహం తరించే మొలకలు పుట్టి చిలకల్లా సందడి చేస్తున్నాయి...
ఆమె కదా అతడి ఒడి
అతనే కదా ఆమె గుడి
వారిరువురే కదా బ్రతుకు మడికి
అనుబంధతడి
దాంపత్యమా వర్ధిల్లు...
*అభిరామ్ 9704153642*
No comments:
Post a Comment