Sunday, July 21, 2024

నేటి ఆధ్యాత్మిక సాధన..

 *_pasupula pullarao 9749163616🌹'నేటి ఆధ్యాత్మిక సాధన..'🌹_*

*_పవిత్ర జీవనం గడపటం ద్వారా మాత్రమే శాశ్వతమైన దాన్ని పొందగలం._*

*_కొందరు మాట్లాడినప్పుడు ఆ మాట సచేతన స్పందనలతో ప్రతిధ్వనిస్తుంది. నూతన జీవితాన్ని ఆరంభించేలా చేస్తుంది. అదే మాట వేరొకరు మాట్లాడితే ఉపయోగం లేకపోవచ్చు._*

*_మహాత్ముడు అంటే అర్థం ఏమిటి..? అంతఃశుద్ధిని కలిగి ఉన్నవారు. వారిలోని ప్రకాశాన్ని చూడకుండా ఉండలేము. వారు ఏం చేసినా అది పవిత్రీకరించబడుతుంది._*

*_అసలు భగవంతుని గురించిన వివేకం, ప్రజ్ఞ కలిగి ఉండటమే పవిత్రతలోని ముఖ్య లక్షణాలు. ఒక మనిషి జీవిత సత్యాలను అనుభూతి చెందినపుడు అతడు మృదువుగా, శీఘ్రగ్రాహిగా మారుతాడు._*

*_ఆ గాఢానుభూతి ద్వారా దైవప్రేమిగా, సకల మానవాళిని ప్రేమించగలవాడిగా మారతాడు. ఇది జ్ఞానం ద్వారా మాత్రమే వస్తుంది._*

*_ఆ జ్ఞానం సరియైన జీవనం  ద్వారానే వస్తుంది. ఆ జ్ఞానం పరిపూర్ణమైన ఏకాగ్రతతో, శ్రద్ధ వలనే సాధ్యమవుతుంది. అందుకే అన్నారు 'శ్రద్ధవాన్ లభతే జ్ఞానం.' శ్రద్ధ వలన మాత్రమే జ్ఞానం లభిస్తుంది.✍️_*"సేకరణ"
     సమయాన్ని ఎక్కువగా సాధనకు మాత్రమే కేటాయించాలి... అది కూడా సరైన సాధన మాత్రమే చేయాలి.. సరైన సాధన చేస్తేనే నాడీమండలం శుద్ధి జరుగుతుంది. . అప్పటి వరకు సమస్యలు అన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... వినడం, చదవడం అనే దానికి కొద్ది ప్రాముఖ్యత మాత్రమే ఇవ్వాలి... ధ్యాన సాధన లోనే శూన్య స్తితికి చేరుకుంటారు... శూన్యం లోనే సర్వం సకలం...విషయానందం వినడం ద్వారా మాత్రమే... జ్ఞానానందం సరైన సాధన ద్వారా మాత్రమే... ఎన్ని గంటలు, ఎన్నిరోజులు ధ్యానం చేసేనన్నది కాదు ఎన్ని సెకండ్స్, ఎన్ని నిమిషాలు శ్వాస మరియు ఆలోచనలు లేని స్థితిలో ఉన్నవన్నదే సరైన సాధన గమ్యం... వినడం, చదవడం ద్వారా ఙ్ఞానం మాత్రమే వస్తుంది.. విషయాలు తెలుస్తాయి... సరైన సాధన ద్వారా ఆత్మ విజ్ఞానం, విశ్వమయ ప్రాణశక్తి పొందడం, కుండలినీ ఉత్తేజం ద్వారా ఏడు చక్రాలు ఉత్తేజం,నాడీమండలం శుద్ధి జరిగి త్రికాల చెడు కర్మలు దగ్ధం.. త్రికాల ఙ్ఞానం... సంకల్ప శక్తి కలిగి ఉండడం... జీవుడే దేవుడు, దేవుడే ఆత్మ.. ఆత్మ పరమాత్మ స్వరూపము... నీలో ఉన్న ఆత్మ శక్తి సరైన సాధన ద్వారా పొందే అవకాశం ఎవరికి వారే చేయవలసిన సరైన సాధన ప్రక్రియ..

.

No comments:

Post a Comment