*విలువల కాగితం ఇది*
మనిషి జీవితాన్ని అవసరాలతో తూచే త్రాసు
*ఈ కాగితం...*
మనిషి లక్ష్యాలను ఆర్థిక స్థోమతలను కొలిచే సాధనం *ఈ కాగితం...*
తల్లి పాలతోనే చేరువై
భూతల్లి ఒడిలో చేరాక
దూరమైయ్యే జీవనపూర్తి తోడు నేస్తం *ఈ కాగితం...*
మనిషి ఆలోచనలకు
మనిషి ప్రవర్తనలకు
మనిషిని శాశించే *ఈ కాగితమే* చెలియలికట్ట ప్రపంచం...
బంధాల తీగలు
బలాల సెగలు
ప్రేమల ప్రదర్శనలు
అన్నీ *ఈ కాగితపు*
వెలుగులో తిరిగే నీడలే
ఆ వెలుగుపోతే ఈ నీడలు కనబడవు...
చిలిపి పనులకు
చిల్లర పనలుకు
చిరస్థాయి చరితకు *ఈ కాగితమే* మూల సూత్ర నడక...
*ఈ కాగితం* సాధించాలి
*ఈ కాగితాన్ని* గౌరవించాలి
*ఈ కాగితంతోనే ఇటువంటి కాగితాలను సృష్టించుకోవాలి*
*ఈ కాగితం కాడ వచ్చే కల్తీ చప్పుడులో జారిపోకుండా*
*విలువైన ఈ కాగితంతో మమేకమైన* ఈ జీవన నదిని
అనుభాలతో ఆస్వాధనలతో దాటాలి...
*ఈ కాగితాన్ని తిట్టేవాడు*
*ఈ కాగితాన్ని పొగిడేవాడు*
*ఈ కాగితం లేకుండా బ్రతకలేని బలహీనుడు...*
*ఈ కాగితం బలం కావాలి*
*ఈ కాగితమే బంధం కావాలి*
*ఈ కాగితాల సముద్రంలో*
మనిషి ఆశలు అలలు
కోరికలు కెరటాలు...
*ఈ కాగితాలు ఉన్న లేకున్నా చలించని స్థిరత్వమనుషులే నిలబడిపోయే ద్వీపాలు*
*అభిరామ్ 9704153642*
No comments:
Post a Comment