*_కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినపుడే మన సామర్థ్యం బయట పడుతుంది._*
*_సమస్యను చూసి ఆగిపోయావో... నీ జీవితం అక్కడే ముగిస్తుంది. సమస్యను సవాలుగా స్వీకరించావో... నీకున్న సమస్య సులువుగా మారుతుంది._*
*_అందుకే నీ ప్రయత్నం ప్రామాణికంగా ఉండాలి. ప్రయత్నిస్తే పోయేదేముంది.? అయితే విజయం, లేదా... అపజయం. అపజయాల నుండి నేర్చుకున్న పాఠాలే నీ విజయానికి నాంది పలుకుతుంది._*
*_జీవితంలో నీవు ఎలా ఆలోచిస్తే నీ జీవితం అలానే ఉంటుంది. నీ ఆలోచన బట్టే, నీ 😎జీవితం ఉంటుంది. ఈ లోకంలో సాధ్యం కానిదంటు ఏది లేదు. ప్రయత్నిస్తే కఠినమంటూ ఏదీ లేదు. ప్రయత్నిస్తూ పోవడమే నీ అంతిమ కర్తవ్యం._*
*_మీ బలాలను నమ్మి ముందుకెళ్లండి. పరీక్షలైనా, ఆర్థిక సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా మీ పట్టుదలతో పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే, గట్టి నమ్మకంతో క్యాన్సర్ వంటి రోగాల్ని కూడా జయించవచ్చు._*
*_అధైర్యపడితే కడుపునొప్పితో కూడా చనిపోవచ్చు కాబట్టి, దేనికి నిరాశపడకుండా లక్ష్యం కోసం కష్టపడు. ఆదైర్య పడకు ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులు తప్పకుండా నీవు అనుకున్నది సాధించగలుగుతావు.☝️_*
*_సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌺🌺🌺 🪷🙇♂️🪷 🌺🌺🌺
No comments:
Post a Comment