భక్తురాలు :--
స్వామీజీ రాత్రి నాకో కల వచ్చింది స్వామీ నేను చనిపోయి పై లోకాలకు వెళ్లినట్లు అక్కడ తాతలు ముత్తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు అందరు కనుపించారు స్వామీ
స్వామీజీ :---ఇంకేం చాలా అదృష్టవంతురాలివి 🧖♂️
భక్తురాలు :---
ఏం అదృష్టం స్వామీ వాళ్లంతా చాలీ చాలని తుండు గుడ్డలు, చిల్లులు పడ్డ చీరలు కట్టుకుని చలికి వణుకుతూ ఒక పెద్ద భోజన శాలలో బంగారు కంచాల్లో భోజనానికి కూచున్నారు
కానీ తినటం మానేసి పురుగులు ఏరుకుంటున్నారు స్వామీ నేను ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు చేశాను స్వామీ. వాళ్ళకి ఆ దురవస్థ ఎందుకు పట్టింది స్వామీ 🤦🏻♀️
స్వామీజీ :---
అవునమ్మా. దీనికి కేవలం నువ్వే కారణం.🤷♂️
భ :--నేనా స్వామీ 🙆🏻♀️
స్వామిజీ :---
అవును నువ్వే
వ్రతాలకు,పూజలకు పెట్టిన చిన్న తుండు ముక్కలు పురుగులు పట్టిన రేషన్ బియ్యం, స్వయంపాకం ఇచ్చిన మీ ఇంట్లో మిగిలిపోయి పాడై పోయిన సరుకులు,
వస్త్ర దానం ఇచ్చిన ముతక పంచె, చీర పంతులుకే కదా అని ఎంతో ఉదారంగా ఇచ్చావు కదా ఇప్పుడు ఆలోకంలో వాళ్లకు అవే సంప్రాప్తం అయ్యాయి. నువ్వు ఏమిస్తావో తిరిగి అదే దక్కుతుంది ఇక నైనా నీ సంపద కక్కుర్తి తో కాక సక్రమంగా ఉపయోగించు. ఇక వెళ్ళిరా జై మాతా 🙋♂️
No comments:
Post a Comment