అసలది....
అసలది మానవజన్మే కాదు.....
పరోపకారము చేయకపోతే!
అసలది మానవత్వమే కాదు...
ఆపదలోనున్నవారిని ఆదుకొనకపోతే!
అసలతడు ధనవంతుడే కాదు..
దీనులకు దానము చేయకపోతే!
అసలది దానమే కాదు.......
మనసులో కరుణ కురియకపోతే!
అసలది కృతజ్ఞతే కాదు.......
చేసిన మేలు మరచిపోతే!
అసలతడు మనిషే కాదు......
తల్లిదండ్రులయెడ కనికరము లేకపోతే!
అసలతడు గురువే కాదు.......
శిష్యులలో జ్ఞానదీపాలను వెలిగించకపోతే !
అసలతడు శిష్యుడే కాదు......
మనస్ఫూర్తిగా విద్యనభ్యసించకపోతే!
అసలది మైత్రేకాదు.....
మిత్రుని క్షేమం కాంక్షించకపోతే!
అసలది జీవితమే కాదు.....
సత్ప్రవర్తన లేకపోతే!
అసలది భక్తే కాదు........
భగవంతుని మనసారా కీర్తించకపోతే!
అసలతడు నాయకుడేకాదు....
ప్రజల క్షేమానికి పాటుబడకపోతే!
అసలతడు కర్షకుడేకాదు.......
ప్రజల ఆకలి తీర్చడానికి పంటలు పండించకపోతే !
అసలది యుద్ధమేకాదు........
ఎవరైనా సవాలుని స్వీకరించకపోతే!
అసలతడు యోధుడేకాదు......
దేశంకోసం ప్రాణాలని సైతం ఫణంగా పెట్టకపోతే!
అసలది పూవేకాదు.........
సుగంధ పరిమళాలని వెదజల్లకపోతే!
అసలతడు రచయితేకాదు....
సంఘములోని మంచిచెడులను ఎత్తి చూపకపోతే!
పి.వి.కృష్ణారావు, కడప.
No comments:
Post a Comment