మాట వేరు- మనసు వేరు
కొందరు తియ్యగా పలుకరిస్తారు. ప్రేమగా మాట్లాడుతారు. మన బంధువుల క్షేమ సమాచారం గురించి ఎంతో ప్రేమ వున్నట్లుగా అడుగు తుంటారు. మనకు కాసింత ఓదార్పుగా అనిపిస్తుంది.
తియ్యటి మాటలతో సరిపెట్టి ఎక్కువ మార్కులు కొట్టేస్తార. మన చేత పనులు చేయించుకొంటారు,కానీ మనకు వారితో అవసరం వచ్చి అడిగినపుడు అంతే తియ్యటి మాటలతో, తప్పించుకొంటారు.
కానీ నిజాయితీ పరుడు లేని ప్రేమను నటించలేడు కావాలని తియ్యగా మాట్లాడే ప్రయత్నం చేయడు తను సహాయం చేయలేనప్పుడు, సానుభూతి మాటలు కూడా పెద్దగా మాట్లాడలేడు తనకు వీలున్నంత సహాయం చేస్తాడు. లేదా మౌనంగా వుండిపోతాడు.
No comments:
Post a Comment