Sunday, July 7, 2024



 *🙏🏻వారాహి_దేవి.!🙏🏻*

*సప్త మాత్రికలు ఎవరు...ఎలా* *ఉద్భవించారు.?*

*బ్రాహ్మణి,* 
*వైష్టవి,* 
*మహేశ్వరి,*
*ఇంద్రాణి,*
*వరాహి,* 
*కౌమారి,*
*చాముండ,*
*నరసింహీ,*
*వినాయకీగా*
*పిలవబడే సప్త మాత్రికల్లో ఒకరుగా వరాహ దేవి అమ్మవారిని చెబుతారు.*

*విష్ణుమూర్తి అవతారాల నుండి* *ఉద్భవించిన వారే*
*ఈ సప్త మాత్రికలు.*

*బ్రహ్మ నుండి బ్రాహ్మణి,*
*విష్ణువు నుండి వైష్ణవి,*
*పరమేశ్వరుని నుండి మహేశ్వరి,*
*ఇంద్రుని నుండి ఇంద్రాణి,*
*వరాహావతారం నుండి వరాహి,*
*స్కంధ నుండి కౌమారీ,*
*నరసింహావతారం నుండి నరసింహి,* 
*వినాయకుని నుండి వినాయకీ*
*సప్త మాత్రికలుగా ఉద్భవించారు.*

*వారిలోని వరాహి అవతారం ప్రత్యేకమైనది.* 
*ఆమె వరాహి దేవిగా పిలవబడుతూ,*
*ఆ పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్ర పాలికగా* 
*కాపు కాస్తోంది.*

*అంత ప్రత్యేకత ఉన్న ఈ వరాహి దేవి అమ్మవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...!*

*వరాహ మూర్తి అని దశావతారాల్లో విష్ణు మూర్తిని కొలుస్తుంటాం.*
*వరాహా మూర్తిగా తన ముక్కుపై భూగోళాన్ని మోస్తున్నట్లుగా మహా విష్ణువు రూపం అందరికీ సుపరిచితమే.*
*అయితే, వరాహి దేవి అనే పేరు మాత్రం ఇంతవరకూ ఎవ్వరూ విని ఉండరు.*
*ఎవరీ వరాహి దేవి.?*
*సప్త మాత్రికల్లో ఒకరుగా* *చెప్పబడుతున్న*
*ఈ అమ్మవారు ఎక్కడుంది.?*

*కాశీ క్షేత్ర పాలికే ఈ సప్తమాత్రిక..!*
*సాక్షాత్తూ పరమ శివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్ర పాలికగా వరాహిదేవిని కొలుస్తారట.  చాలా చోట్ల శివుడే క్షేత్ర పాలకుడుగా ఉంటాడు.*
*కానీ, ఆ పరమ శివునికే ఈ వరాహి దేవి*
*క్షేత్ర పాలికగా ఉందన్న మాట.*

*కాశీ పట్టణానికే కాదు, తంజావూర్  బృహదీశ్వరాలయానికీ ఈ మాత క్షేత్ర పాలికగా కాపలా కాస్తోందట.* 
*తంజావూర్ బృహదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది.*
*ఆ ఆలయంలో అమ్మ నల్లని రాతితో*
*వరాహ ముఖంతో నిండుగా,*
*ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది.*
*ఆ రూపాన్ని చూడాలంటే, నిజంగా పెట్టి పుట్టాలంతే అన్నట్లుగా ఉంటుంది అమ్మవారి రూపం అక్కడ.*

*అలాగే, కాశీ నగరంలో అయితే, నీలి రంగులో దర్శనమిస్తుంది.*
*వరాహ రూపంలోనే ఆరు చేతులూ శంఖు,*
*సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది.*
*సప్త మాత్రికలందరిలోనూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమట.*
*అందుకే అమ్మను క్షేత్ర పాలిక అంటారు.*
*చాలా శక్తివంతురాలిగా వరాహి దేవిని స్తుతిస్తారు. రాక్షసులను మట్టు పెట్టే సమయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగానే  ధైర్యసాహసాలకు ప్రతీకగా ఆమెను కొలుస్తారు.*

*ఈ అమ్మవారిని ఎందుకు కొలుస్తారంటే..!!*
*ధైర్యానికి ప్రతీకగా ఈ అమ్మను కొలుస్తారట. భారతదేశంలోనే కాదు, నేపాల్ వాసులు కూడా వరాహి దేవిని ప్రత్యేకంగా పూజిస్తారట.* 

*బుద్ధిజంలోనూ వరాహి దేవి ప్రస్థావన ఉంది. బుద్ధిజంలో వరాహి దేవిని వజ్రవరాహి,*
*వజ్ర యోగిని అని పిలుస్తారు.*
*ఎక్కువగా తాంత్రిక విద్యల కోసం నేపాల్ వాసులు*
*ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారట.*

*అయితే, చెడు కోసం వాడే తాంత్రిక విద్యలు కావట. మంచి కోసం ఉపయోగించే తాంత్రిక విద్యల కోసమే అమ్మవారిని కొన్ని ప్రత్యేక పూజలతో ప్రసన్నం చేసుకుంటారనీ తెలుస్తోంది.*
*బెనారస్, తంజావూరుతో పాటు, ఇండియాలోని మరికొన్ని ఆలయాల్లో వారాహి దేవి విగ్రహాలు కనిపిస్తాయి.*

🙏🏻 *ఓం శ్రీ మాత్రే నమః*🙏🏻

 *🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩*

No comments:

Post a Comment