🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*నిజాయితీ అంటే ఏమిటి?*
➖➖➖✍️
ఒకసారి, ఒక విద్యార్థి తన టీచర్ ని "నిజాయితీ అంటే ఏమిటి?" అని అడిగాడు.
టీచర్ చిరునవ్వుతో, "జీవితపు నిజమైన సంపద." అని చెప్పారు.
విద్యార్థి ఆశ్చర్యంతో, "నిజమైన సంపదా!" అన్నాడు.
టీచర్ ఇలా అన్నాడు, “ఈరోజు, కొంతమంది గొప్ప వ్యక్తుల జీవితంలోని కొన్ని సంఘటనలను నీకు చెప్తాను....”
“చాణక్యుడు అని కూడా పిలువబడే కౌటిల్యుడు దేశానికి ప్రధాన మంత్రిగా ఉన్నా, ఒక చిన్న గుడిసెలో నివసించేవాడు.
ఒకసారి ఒక విదేశీయుడు వచ్చి, “నేను ప్రధానమంత్రిని కలవాలనుకుంటున్నాను. ఆయన రాజభవనం ఎక్కడ ఉంది?” అని ఎవరినో అడిగాడు.
“ప్రధానమంత్రి రాజభవనంలో నివసించరని, నగర శివార్లలోని ఒక గుడిసెలో నివసిస్తార”ని అతనికి తెలియజేసారు.
చాణక్యుని వద్దకు అతనిని తీసుకువెళ్ళినప్పుడు, చాణుక్యుడు ఏదో రాజ్య కార్యంలో మునిగి ఉన్నాడు. సాయంత్ర సమయం కావడంతో ప్రక్కనే లాంతరు వెలుగుతూ ఉంది. చాణక్యుడు అతనికి స్వాగతం పలికి, మండుతున్న లాంతరును ఆర్పివేసి ప్రక్కనే ఉన్న మరో లాంతరును వెలిగించాడు.
విదేశీయుడు ఆశ్చర్యపోయి, అడిగాడు, "మీరు అలా ఎందుకు చేశారు?"
దానికి చాణక్యుడు ఇలా చెప్పాడు, “ఈ లాంతరు రాజ్యపు నూనెతో వెలుగుతుంది. ఇప్పుడు మీరు నన్ను వ్యక్తిగతంగా కలవడానికి వచ్చారు, కాబట్టి ఈ రెండవది నా వ్యక్తిగత నూనెతో మండే లాంతరు."
*ఇది ఒక ఉన్నత స్థాయి నిజాయితీ! నీ రాజ్యం పట్ల, నీ కర్తవ్యం పట్ల నిజాయితీ!*
“ఆ తర్వాత, చిన్నప్పటి నుంచి తన జీవితంలో కొన్ని సూత్రాలను, విలువలను పాటించిన మరొక వ్యక్తి ఉన్నాడు - గాంధీజీ గురువైన గోపాల కృష్ణ గోఖలే. అతను చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు, తన క్లాస్ లో ఒక ప్రశ్నకు సమాధానం వ్రాసాడు. ఇంటి నుంచి వాళ్ళ నాన్ననడిగి చెప్పించుకుని ఆ సమాధానం వ్రాసుకుని తీసుకొచ్చాడు. ఆ ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకున్న ఏకైక పిల్లవాడు అతనే అని ఉపాధ్యాయుడు క్లాస్ లో అందరినీ చప్పట్లు కొట్టమని అడిగాడు. అందరూ అతని కోసం చప్పట్లు కొట్టారు. కానీ గోపాల కృష్ణ గోఖలే ఏడవడం మొదలుపెట్టాడు.
అందరూ "ఏం జరిగింది.. అందరూ నీ కోసం చప్పట్లు కొడుతున్నారుగా" అని అన్నారు.
"ఈ ప్రశ్నను నేను పరిష్కరించలేదు, మా నాన్నగారు చేసారు. కాబట్టి ఈ చప్పట్లకు నాకు అర్హత లేదు", అని అతను చెప్పాడు.
*అది నీ చదువు పట్ల, నీ సామర్థ్యం పట్ల నిజాయితీ!*
భారతరత్న అయిన J.R.D టాటా గురించి మీరందరూ తప్పక వినే ఉంటారు. ఒకసారి, అతను తన చార్టర్డ్ అకౌంటెంట్ తో కూర్చున్నాడు. చార్టర్డ్ అకౌంటెంట్ ఒక నిర్దిష్ట మార్గంలో లెక్కలు సమర్పించినట్లయితే భారీ మొత్తంలో డబ్బు ఆదా చేయవచ్చని చెప్పాడు. ఇది పన్నులకు సంబంధించిన విషయం.
టాటా ఇలా అడిగారు, "ఇది చట్టబద్ధమైనదా లేదా చట్టం పరిధిలో సరైనదేనా?"
ఛార్టర్డ్ అకౌంటెంట్ "ఇది సరైనదే" అన్నాడు.
అప్పుడు టాటా."ఇది నైతికమైనదేనా? అని అడిగాడు.
చార్టర్డ్ అకౌంటెంట్ మౌనంగా ఉండిపోయాడు.
"కుదరదు, వేల కోట్ల ఆదాయమైనా, నైతికత లేనిదైతే మనకు వద్దు", అని టాటా చెప్పారు.
*”పిల్లలూ, ఇది మీ ఆత్మ యొక్క నిజాయితీ..."*
టీచర్ ఇంకా ఇలా అన్నారు, "నిజాయితీ అనేది డబ్బుకు సంబంధించినది మాత్రమే కాదు. దానికి సమగ్రమైన అర్ధం ఉంది. మనం మన శరీరానికి, మన మనస్సు పట్ల కూడా, మంచి ఆలోచనల ద్వారా, చెడు ఆలోచనలు మన మనస్సులోకి రానివ్వకుండా నిజాయితీగా ఉండాలి. మన స్వభావాన్ని అదుపులో ఉంచుకోవడం - అది కూడా నిజాయితీయే. సంతోషంగా ఉండటం, కోపం రాకపోవటం కూడా నిజాయితీయే. తల్లిదండ్రులకు సేవ చేయడం ... భార్యాభర్తల మధ్య విశ్వాసభరితమైన సంబంధం.... ఇవన్నీ నిజాయితీకి సంబంధించినవే.
పిల్లల పట్ల ప్రేమ కూడా నిజాయితీయే
వాగ్దానాలు నిలబెట్టుకోవడం .... దేశానికి సేవ చేయడం ఇవి కూడా నిజాయితీయే.
నిజాయితీ అంటే, ఒకరి స్వంత ఆత్మ ప్రకారం ప్రవర్తించడం... తన ఆత్మ యొక్క స్వరానికి అనుగుణంగా పనిచేసే వ్యక్తి, సరైనది మాత్రమే చేస్తాడు."
ఆ రోజు క్లాసులో పుస్తకాలేవీ తెరవలేదు కానీ, నిజాయితీ అనే సారాంశం అందరి హృదయాల్లో స్థిరపడింది.✍️
*♾️♾️♾️♾️♾️*
*ప్రయోజనాలలో స్వచ్ఛత, ఉద్దేశాలలో స్వచ్ఛత మనల్ని చాలా దూరం తీసుకెళ్తాయి. అంతర్గత శోధన కోసం ఇతరులలో* *స్వచ్ఛతను, చిత్తశుద్ధిని కలిగించే ముందు నేను నా అన్వేషణతో నిజాయితీగా ఉండాలి.* *—దాజీ*
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment