Tuesday, July 9, 2024

 *వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రతలు.*
=======================
👉 వర్షాకాలంలో చాలా వ్యాధులు నీటి ద్వారా సంక్రమిస్తాయి కావున  కాచిపెట్టిన నీటిని తాగడం మంచిది.
👉 వీధులలో, ఫుట్ పాత్ల మీద తయారు చేసిన ఫుడ్ తినడం వర్షాకాలంలో వివిధ వ్యాధులకు అతిపెద్ద కారణాలలో ఒకటి. 
👉 బయటి ఆహారపదార్థాలు అపరిశుభ్రమైన పరిస్థితులలో తయారు చేయబడి వివిధ రకాల అంటువ్యాధులు రావటానికి అవకాశం ఉంది. 
👉 ఆరోగ్యంగా ఉండటానికి ఇంట్లో తయారుచేసిన వేడి ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
👉 దోమలు రాకుండా ఇంట్లో పరిశుభ్రత పాటించాలి. మీరు క్రమం తప్పకుండా పూల కుండీలను శుభ్రం చేయాలి.
👉 వైరల్ ఫీవర్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండండి 
👉 ఇంటి పరిసరాల్లో డ్రైనేజ్ వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
👉 రోడ్డు మీద వెళ్లేటప్పుడు నిలకడగా ఉన్న నీటిలో వెళ్లకండి.
👉 తడిసిన విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండండి, 
👉 ఇనుప స్తంభాలను తాకకుండా జాగ్రత్తగా ఉండండి, 
👉 చిన్న పిల్లలను బయటకు రానివ్వకండి.
👉 వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ముఖ్యమైనది, మీరు సులభంగా జారిపోని పాదరక్షలను ధరించడం మంచిది.
👉👉💯 వర్షాకాలంలో వ్యాపించే వైరల్, బ్యాక్టీరియల్ జ్వరాలకు, డయేరియా - డీసెంట్రీ వంటి విరేచనాలకు హోమియోపతి మందులు చాలా వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తాయి. 

Gvvs Prasad🙏
Homoeo practitioner,

No comments:

Post a Comment