హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ: 🙏
ఈ జీవుడే ఆ బ్రహ్మము అని తెలుసుకున్నవాడు ఎవరైనా సరే నాకు వందనీయుడే... శంకరులు
వ్యష్టి మహాకారణం , సమిష్టి మహా కారణం .. కేవల ప్రకాశమానమై ఉన్నవాడే సమత్వ భావనలో ఉన్నవారు
నవావరణలలో కిందకు దిగి రాకుండా .. కేవల బిందు స్థానంలో నిలకడ కలిగి అంతటా.. తనను తాను దర్శించినవాడు ...
సర్వదా సృష్టి... స్థితి.. లయములందు సమత్వ భావాన్ని కలిగి ఉన్నవాడే బ్రహ్మము
అంతర్ముఖంలో సాక్షిగా నిలబడినవారికి సమరస భావం
ద్వంద్వా తీతుడు
తానున్నాననే భావనే లేనివాడె జన్మ రాహిత్యాన్ని పొందినవాడు
ఎరుకే మహదహంకారము ... అణువంత ఉన్నా బ్రహ్మాండమంతా వ్యాపిస్తుంది
నేనుని... తానుని అణువంత కూడా మిగుల్చుకోకూడదు ..
సమరసం... సమ దర్శనం కలిగినవాడే యోగి
మానవ ఉపాధి లోనే పరమాత్మ సహజంగా సమదృష్టి సృజించాడు
పరమాత్మ తనను తాను సృజించుకోవాలనుకున్నప్పుడు ... మానవదేహం వచ్చింది .
కార్య కారణములు భిన్నం... అన్నప్పుడే కర్మకు అవకాశం ఉన్నది .... కర్మ లేక బంధం లేదు... బంధం లేని వాడు నిత్య
ముక్తుడు
ఎప్పుడూ సుషుమ్న లో ఉన్నవాడికే సమత్వ భావం
పరిమితించబడిన ప్రజ్ఞ కలవాడు కించిదగ్నుడు
ఆ గురుమూర్తి... పరమాత్మ... సర్వజ్ఞుడు ఎక్కడ ఉంటే అది ముక్తి క్షేత్రం ..
నీ హృదయమే ముక్తి క్షేత్రం .. నీ హృదయంలో నీవు నిలిచి ఉంటే అదే పరమాత్మ స్థానం
క్షేత్రజ్ఞ దర్శనం ఎక్కడ అయ్యిందో అదీ పుణ్య క్షేత్రం
అజ్ఞానయుతమైన జీవుని మరణం... జ్ఞానోదయం ... కాశ్యాంతు మరణాన్ ముక్తి: ..
శ్రీ విద్యాసాగర్ స్వామి వారు
గురుగీత- 93
జై గురుదేవ 🙏
No comments:
Post a Comment