Wednesday, July 24, 2024

****ఓ మనశ్శాంతీ నీ అడ్రస్ ఎక్కడ

 *ఓ మనశ్శాంతీ నీ అడ్రస్ ఎక్కడ* 
*సుఖాలను* ఇచ్చే డబ్బు అప్పుగానైనా దొరుకుతుంది.
కానీ
ఆనందాలను పంచే *మనశ్శాంతి* మాత్రం
నచ్చినట్టు *నిజాయితీగా ఉంటేనే* దొరుకుతుంది.
*అప్పుగా కూడా సంపాదించలేని విలువైన సంపద మనశ్శాంతి.*

మనిషి ఉండడానికి *ఇరుకుగా* ఉందని
ఇల్లు మారుస్తున్నాడు.
నడపడానికి *సౌకర్యంగా* లేదని వాహనాలు  మారుస్తున్నాడు.
*పొగడ్తలు* లేవని మనుష్యుల్ని మారుస్తున్నాడు.
*లాభం* రావడం లేదని వ్యాపారం మారుస్తున్నాడు.

చివరిగా *కష్టాలు* తొలగడం లేదని *దేవుల్ని సహితం* మార్చేస్తున్నాడు.

కానీ  *అసలు మార్చుకో వలసినది తనని తాను.*
       
తెల్లారితే నీకోసం ఒక *యుద్ధం* ఎదురు చూస్తున్నప్పుడు 
ఏ గతానికి నిన్ను బాధ పెట్టే అంత శక్తి ఉండదు. 

*స్నానం ద్వారా శరీరం*
*కన్నీళ్ల ద్వారా కళ్ళు కరుణ ద్వారా హృదయం*
మరియు *పశ్చాత్తాపం* ద్వారా *ఆత్మ శుద్ధి* అవుతాయి.
🙏

No comments:

Post a Comment