Wednesday, July 24, 2024

స్వాతంత్ర సమరం సమయంలో RSS దేశ ప్రజలకు ఏం చేసింది?

*స్వాతంత్ర సమరం సమయంలో RSS దేశ ప్రజలకు ఏం చేసింది?*

చాడా శాస్త్రి గారి పోస్టు, తప్పక చదవండి, కాపీ పేస్ట్ చేసి ( ఫార్వర్డ్ కాదు ) మిగతా గ్రూపుల్లో పంపండి.

https://www.facebook.com/share/p/7V8wEJLWcAvHoMzB/?mibextid=oFDknk

ఉదయం లేచిన దగ్గర నుండి రాహుల్ గాంధీ మొదలుకొని చిన్న చితక కాంగ్రెస్ నాయకులు, ఆ కుటుంబ బానిసలు, అలాగే కమ్మీలు, ప్రాంతీయ పార్టీలు 'RSS' తిట్టని రోజు ఉండదేమో..

స్వాతంత్ర సమరం సమయంలో RSS దేశ ప్రజలకు ఏం చేసింది? మత భావాలు రెచ్చగొట్టడం తప్ప దానికి ఏమైనా తెలుసా? అంటూ దారుణ విమర్శలు చేస్తూ ఉంటారు. ఒక పక్క బ్రిటన్ వారిచ్చిన సంస్థాన స్వతంత్రాన్నే సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది అన్నంత లాగా కాంగ్రెస్ నాయకులు అభిమానులు సంబరాలు జరుపుకుంటూ ఉంటే...

పాక్ తో సరిహద్దుల్లో విభజించబడ్డ బెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అదుపుచేయలేని హింస,  మారణ కాండ చోటు చేసుకున్నాయి.
హిందువులు లక్షల్లో చనిపోయారు, వేల కొద్దీ స్త్రీలు అపహరించబడ్డారు, అత్యాచారాలకు గురి అయ్యారు.

*అంత పెద్ద సంస్థ అయిన కాంగ్రెస్ ప్రజలను రక్షించడానికి ఎటువంటి* *చర్యలు తీసుకుందో*
*ఏ కాంపులు* *నిర్వహించిందో మనకు తెలియదు*.

అయితే, ఆ సమయంలో RSS పాత్ర ఎలా ఉండేది అనేది 1947లో స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఏర్పడ్డ మొదటి ప్రభుత్వం లో డిఫెన్స్ మంత్రిగా పనిచేసిన సర్దార్ బలదేవ్ సింగ్ (పంజాబ్ కి చెందిన వారు) నాటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ గారికి రాసిన ఒక ఉత్తరం ద్వారా తెలుస్తోంది. ఆ ఉత్తరం ఒకటి ఆర్కివ్స్ నుండి బయటకు వచ్చింది.

ఆ ఉత్తరంలో సారాంశం క్లుప్తంగా :

సర్దార్ పటేల్ జి,

పాకిస్థాన్ లో జరుగుతున్న సంఘటనలను మనం పూర్తిగా అర్ధం చేసుకోలేదు అని అనిపిస్తోంది. అక్కడ ప్రజలు ప్రభుత్వం కుమ్మక్కు అయ్యి ఒక పద్దతి ప్రకారం మారణకాండ జరిపిస్తున్నారు. వారు చెప్పే మాటలకు చేతలకు పొంతనలేదు. కుటుంబాలు కూల్చడానికి అని ముస్లిమేతర యువతులు పెద్ద సంఖ్యలో ఒక ప్లాన్ కి అనుగుణంగా అపహరణకు గురిఅవుతున్నారు. 20వేల మందికి పైగా స్త్రీలు/యువతులు ఇలా అపహరణకు గురి అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి దారుణాలకు గురి కానీ ఒక్క గ్రామం కూడా పశ్చిమ పంజాబ్ లో లేదు అంటే అతిశయోక్తి కాదు. శకర్ ఘర్ అనే గ్రామం నుండే 500 మంది యువతులను కుటుంబాల నుండి దూరం చేశారు. ఒక్కరినీ కూడా రక్షించిన దాఖలాలు లేవు. లెఫ్టినెంట్ GN సిన్హా అనే ఒక యువ ఆఫిసర్ వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.

అపహరింపడిన యువతులను రక్షించడానికి ఈ క్రింది ప్రణాళిక సూచించబడింది:

రెండు దేశాల్లో  'విడిపించి తెచ్చే' టీమ్స్ ఏర్పాటు చేయాలి. వీరికి, వీరు ఆస్తులకు రక్షణ కల్పించాలి. వీరికి స్థానిక పోలీసులు మిలిటరీ సాయం అందచేయాలి. ఇద్దరు ప్రధాన మంత్రులు ఉమ్మడి ప్రకటన చేసిన వెంటనే ఈ ఏర్పాట్లు జరగాలి.

ఈ ప్రణాళిక అమలు చేయడానికి ఒక 'సీక్రెట్ సర్వీస్' ని తప్పని సరిగా ఏర్పాటు చేయాలి. దీని కోసం కొందరు ఉత్సాహవంతమైన యువకులు ఇస్లాం మతం స్వీకరించి వారిలో కలసి మనకి 'ఇన్ఫార్మర్స్' గా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ నుండి ఖచ్చితమైన సమాచారం సేకరించడానికి ఇది ఒక్కటే సరి అయిన పద్దతి గా నాకు అనిపిస్తోంది, వారి సహాయం తీసుకుందికి మనం సంకోచించ అవసరం లేదు.  వీరిని ఒక ప్రత్యేక సూపరింటెండెంట్ క్రింద ఇంటెలిజెన్స్ విభాగం లోకి రెగ్యులర్ గా నియమిస్తూ ఉండాలి.

ప్రస్తుతం ఉన్న పోలీసు విభాగం నుండి బాగా నిజాయితీ గల ఒక సూపరింటెండెంట్ మరియు 20 సహాయక సూపరింటెండెంట్స్ ని సెలెక్ట్ చేయాలి. 

*గ్రౌండ్ లో పనిచేయడానికి "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్" ట్రైనింగ్ ఇవ్వబడ్డ తమ మనుషులను ఇస్తుంది*. RSS ముఖ్యులు
 శ్రీ గోల్వార్కర్ ని సంప్రదించాల్సి ఉంటుంది.
పంజాబ్ లో పనిచేస్తూన్న ఇటువంటి ఇతర సంస్థలను సహాయం కోసం సంప్రదించాలి.

ఈ సూచనలు పై మీరు గట్టి ఆలోచన చేసి ఏ విషయం నాకు తెలియచేయగలరు.

ఇట్లు
సర్దార్ బలదేవ్ సింగ్
డిఫెన్స్ మినిస్టర్.

దేశ ప్రయోజనాల కోసం RSS తాపత్రయ పడింది అనే దానికి ఇది ఒక్కటే రుజువు కాదు. 1962 చైనాతో యుద్ధం సమయంలో వామపక్షాలు చైనా కొమ్ము కాస్తే,  RSS పూర్తిగా ప్రభుత్వ సైనికులకు మద్దత్తు ఇచ్చింది. అందుకే RSS ని ద్వేషించే నెహ్రూ కూడా RSS కార్యకర్తలను 1963 రిపబ్లిక్ పెరేడ్ లో పాల్గొనడానికి ఒప్పుకున్నారు.

అప్పుడే కాదు దేశంలో ఏ మూల యే ప్రమాదం జరిగినా, ప్రకృతి వైపరీత్యం వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం కంటే ముందుగానే అక్కడకు చేరుకుని సహాయ పనులు మొదలుపెట్టేస్తుంది RSS. మన దివిసీమ ఉప్పెన సమయంలో కుళ్ళిన శవాలను తీయడానికి ప్రభుత్వ యంత్రంగం సందేహిస్తూ ఉంటే RSS వాళ్ళు ఆ కార్యక్రమం నిర్వహించారు. వైజాగ్ లో HPCL ప్రమాదం అప్పుడు కూడా RSS కార్యకర్తలు సరిగ్గా ఇటువంటి కార్యక్రమమే అంటే కాలిన మృత దేహాలను తరలించారు.

అయితే, విచారించవలసిన విషయం ఏమిటంటే ఎప్పుడూ దేశ ప్రయోజనాలు ఆశించే RSS ని కాంగ్రెస్ 24 గంటలూ విమరిస్తూ,  దేశ విభజన కు కారణం అయిన ముస్లిం లీగ్ తోనూ, మరియు 1962 చైనా యుద్ధ సమయంలో భారత్ కి వెన్నుపోటు పొడిచిన వామపక్షాలతోనూ ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయ పొత్తు పెట్టుకుని అటువంటి దేశ వ్యతిరేక శక్తులు దేశం లో మళ్ళీ బలపడటానికి సహాయం చేస్తోంది.

కాంగ్రెస్ కి అధికార దాహం. అందుకే తాను అధికారంలో ఉంటే ఎవరిని దేశ వ్యతిరేక శక్తులు అంటుందో, ఎవరితో వారి ప్రభుత్వం యుద్ధం చేస్తుందో , అధికారం కోల్పోతే అధికారంలోకి రావడానికి మళ్ళీ అదే దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలపడానికి రెడీ అయిపోతుంది.

కాంగ్రెస్ తో తస్మాత్ జాగ్రత్త..

....చాడా శాస్త్రి.....

No comments:

Post a Comment