Thursday, July 4, 2024

బొమ్మల కొలువు పరమార్థం

 బొమ్మల కొలువు పరమార్థం 

✍️
Tangella Sreedevi Reddi

బొమ్మలు ఆషామాషీ కాదు.  బొమ్మల కొలువు
గురించి వివరించుకుంటే.... బొమ్మల కొలువు అనేది ఆత్మీయతలు కలుపుకోవడానికి నిలబెట్టుకోవడానికి ప్రతీక. బొమ్మల కొలువు ప్రాచీన సంప్రదాయం. పూర్వం పిల్లలకు రామాయణ మహాభారతం కథల్ని బొమ్మలను కొలువు దీర్చి తెలియజెప్పేవాళ్లు. బొమ్మల్లో మనుషులు జంతువులు, ప్రకృతి మమేకమై ఉంటాయి. మనిషి కూడా అదే విధంగా జీవించాలి అనేది ఇక్కడ భావన. బొమ్మలు కొలువు దీరే మెట్లు జీవిత గమనం. ముఖ్యంగా బొమ్మల కొలువు అనేది వ్రతం వంటిది. ఈ ఏడు సేకరించిన బొమ్మలకు వచ్చే ఏడు మరిన్ని బొమ్మల్ని జమ చేయాలి. ఆటోచ్చే ఏడు వీటికి మరికొన్ని జమ చేయాలి. ఇట్లా ప్రతి ఏటా బొమ్నల్ని పోగుచేస్తూ వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ పోవాలి. ఈ పద్దతి తరాలను సూచిస్తుంది.  పాత కొత్త బొమ్మల కలయిక ఒక కుటుంబమే. వీటిలోంచి పాడైన, పగిలిపోయిన, బొమ్మల్ని మాత్రమే తొలగించాలి. మనలోనుండి మన ఆత్మీయులు కాల ధర్మంగా నిష్క్రమించడాన్ని ఈ పద్దతిలో మనం గ్రహించవచ్చు. మొత్తానికి బొమ్మల కొలువు జీవితానికి కుటుంబానికి ప్రపంచానికి నిర్వచనం !

No comments:

Post a Comment