🌹గుడ్ మార్నింగ్ 🌹మనలోనే సమస్తము వున్నది. అందులో కొంత శరీరముతో గ్రహించి అనుభవించ గలుగుతున్నాము. అంతకంటే ఎక్కువ మనసుతో గ్రహించి - ఊహించి అనుభవించగలుగుతున్నాము.
నేను అని మనము అనుభవించేది అంతా సృష్టినే. అనుభవము కూడా సృష్టిలోనే తయారైన - సృష్టితోనే తయారైన - నేను అన్న వేరు భావనలో ఉన్న మన శరీరముతోనే.
మనసు ఈ సృష్టి శక్తే. దాని పని తీరు, శరీర పని తీరు - సృష్టి చేసిన సృష్టి.
శరీరము, మనసు, నిత్య అనుభవాలు.
ఈ రెండిటికి ఆధారమైన ప్రాణ శక్తి మనలో వున్నదని తెలుసుగాని దాని గ్రహింపు , అనుభవము లేవు. ఆ ప్రాణ శక్తినే మన పూర్వికులైన పెద్దలు కొందరు అంతరముఖులై సాధనతో గ్రహించి అనుభవము పొంది - అదే సమస్తము అన్న సత్యాన్ని - ఆత్మజ్ఞానము పేరుతో మనకు అందించారు. సమస్త ఏకత్వానుభవము పొందాలనుకున్నవారు తమలోనే దానిని దర్శించవచ్చని - అనుభవం పొందవచ్చని చెప్పారు. ఇదే ఆధ్యాత్మికత. అంతరంగ సాధన. 🌹god bless you 🌹
No comments:
Post a Comment