Wednesday, July 31, 2024

లిపి_విజ్ఞాన_శాస్త్రం

 పోస్ట్ పెద్దదే కానీ మంచి సమాచారం అందరూ చదవండి.. 👍🚩

#లిపి_విజ్ఞాన_శాస్త్రం

🍁18 మరియు 19 వ శాతాబ్దికి చెందిన కొందరు పాశ్చాత్య పరిశోధకులు ఒక భ్రమను వ్యాపింపచేసారు. ప్రాచీనకాలంలో భారతీయ ఋషులకు వ్రాత పరిజ్ఞానం లేదు. 300-400 BCE సంవత్సరాల పూర్వం భారతదేశంలో వాడు కలోనున్న #బ్రాహ్మీ_లిపి మరియు ఇతర లిపులు భారతదేశం బయట పుట్టినవే. 

🔹డా.ఓర్ ఫ్రీడు మరియు మ్యుయెలర్ అనువారు మరో ప్రతిపాదన ప్రచారం చేసారు. భారతదేశానికి లేఖన విద్య గ్రీకుల నుండి లభించినది. 
🔸సర్ విలియం జోన్స్ అనునతడు భారతీయుల బ్రాహ్మీలిపి సెమెటిక్ లిపి నుండి ఉత్పన్నమైనదనే మరో భ్రమను ప్రచారం చేసాడు. 
🔹ప్రొ. బేన్ ఫ్రే మరియు బేవర్ అనువారు బ్రాహ్మీలిపి మూలం ఫోనీషియన్ లిపి అని ప్రచారం చేసారు. 
🔸డా.డేవిడ్ డిరింజర్ అనునతడు అరేమిక్ లిపి నుండి బ్రాహ్మీ లిపి ఉత్పన్నమైనదనే ఊహను ప్రచరం చేసాడు .
🔹సంస్కృత సాహిత్య చరిత్ర వ్రాసిన మాక్స్ ముల్లర్ భారతదేశంలో లేఖన కళ 400 BCE సంవత్సరాల పూర్వం నుండి మాత్రమే వాడుకలోనున్నదని మరో భ్రమను ప్రచారం చేసాడు. మన దౌర్భాగ్యం కారణంగా తర్వాత కాలంలో పరిశోధనలు చేసిన భారతీయులు కూడా పాశ్చాత్యులనే ఆదర్శంగా తీసుకొని వారితో గొంతు కలిపారు. వారి భ్రమాత్మక సిధ్దాంతాలనే వీరు సత్యాలని ప్రతిపాదించారు. ఈ పరిశోధన, ప్రతిపాదన ప్రక్రియలో ఎవ్వరు కూడా మన దేశ పరంపరను, గ్రంధలిపి వికాసగాధలను పరిశోధించే ప్రయత్నం ఏ మాత్రము చేయలేదు.

ఈ పరిస్థితిలో వాస్తవాన్ని పరిశీలిద్దాం!
---------------------------------------------------
 
🍁ప్రసిధ్ధ పురాతత్వవేత్త మరియు లిపి పరిశోధకుడు అ.బ.వాలావల్కర్ మరియు ప్రఖ్యాత లిపికారుడు పద్మశ్రీ వాకణకర్ – అనువారు తమ పరిశోధనలో భారతీయ లిపి జన్మస్థానం భారతదేశమే అని నిరూపించారు. ధ్వన్యాత్మకత ఆధారంగా లేఖన పరంపర భారతదేశంలో వేదకాలము నుండి బాగా వాడుకలో ఉండి ప్రసిధ్ధి చెందింది. దీనికి అనేక పురాతత్వ సాక్ష్యాలున్నాయని వారు నిరూపించారు. 
రోమను లిపికి చెందిన ‘గిల్ సాంస్’ అనే రకమైన అక్షరాల నిర్మాత ఎరిక్ గిల్ అనునతడు ఇలా చెప్పాడు : ఒకానొక అక్షరము ఒకానొక సమయంలో ఒకానొక ధ్వనికి పర్యాయవాచకంగా ఉంది ఉంటుంది. కాని రోమను లిపి అధ్యయనం చేస్తే ఒకానొక అక్షరం, ఒకానొక ధ్వనికి పర్యాయపదంగా ఉంటుందని చెప్పలేము. ఉదా: Ough – ఈ నాలుగు అక్షరాలు 7 రకాలుగా ఉచ్చరించబడతాయు (ఓహ్, అఫ్,ఆఫ్,ఆఊ,ఔ,ఊ,ఆ) ఇవి వ్రాసిన తర్వాత గిల్ తన సిధ్ధాంతంగా ఒక సత్యాన్ని ఇలా చెప్పారు  : “మా రోమను అక్షరాలు ధ్వనియొక్క లేఖనము, ముద్రణము సరిగ్గా చేస్తాయని చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది.”

రెండవ వైపు భారతదేశంలో ధన్యాత్మక లేకహంపరంపర యుగ యుగాలుగా వస్తున్నది. దీనికి అనేక ఋజువులు మన ప్రాచీన వాజ్మయములో లభిస్తున్నాయి.

🍁1.యజుతైత్తరీయ సంహితలో ఒక కధ ఉన్నది. దేవతలకు ఒక సమస్య వచ్చిపడినది. మాట(వాణి) అనేది మాట్లాడిన తర్వాత అదృశ్యమైపోతుంది. ఈ నిరాకారమైన మాటను సాకారం చేయడమెలా? దేవతలు ఇంద్రుని వద్దకు వెళ్లి ఇలా అడిగినారు : “ వాచంవ్యా కుర్వీత’ అనగా వాక్కుకు ఆకారమును ఇవ్వండి. అప్పుడు ఇంద్రుడన్నాడు. దీనికోసం నేను వాయువును సాయం తీసికోవాలి. అనగానే దేవతలు అందుకు సమ్మతించారు. అపుడు ఇంద్రుడు వాక్కుకు ఆకారమునిక్చినాడు. వాక్కుకు ఆకారమును ఇవ్వడమే లేఖనవిద్య. ఇది ‘ *ఇంద్రవాచన్య వ్యాకరణమ్*’ అనే పేరున ప్రసిధ్ధమైనది.

🍁2.అధర్వవేదములో గణక ఋషికృతసూక్తం ‘ *గణపతి_అథర్వశీర్షం*’ పేరుతో ఉన్నది. దీనిలో లేకహన్ విద్య యొక్క ఉత్పత్తికి సంబంధించిన ప్రమాణములున్నవి. క్రింది వాక్యాలలో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. 

గణాదిం పూర్వముచ్చార్యవర్ణాదిం తదనన్తరమ్ | అనుస్వారః పరతరః |
అర్ధేందులసితమ్ | తారేణరుధ్ధం | ఏతత్ తవ మనుస్వరూపమ్ | గకారః
పూర్వరూపమ్ | అకారో మధ్మమరూపమ్ అనుస్వారశ్చాస్త్య రూపమ్ |
బిందురుత్తర రూపమ్ | నాదః సంధానమ్ | సంహితా సంధిః | సైషా గణేశ విద్యా | 

దీని అర్ధము : మొదట ధ్వనియొక్క గణమును ఉచ్చారణ చేయాలి . తర్వాత అదే క్రమములో వర్ణములను రంగుల సాయంతో వ్రాయాలి. తదనంతరం అక్షరము పైన అనుస్వారము అర్ధచంద్రాకారంలో వ్రాయాలి. ఈ విధంగా హే గణేశ్ ! మీ చిత్ర స్వరూపము ఈ విధంగా గ్ అనే హల్లు మరియు మధ్యస్వర భాగము అనగా అకార రూపదండము మరియు అంతముక్త అనుస్వారము అవుతుంది . దీనినాదము లేదా సంధి రూప ఉచ్చారణ చేయుట – ఇదియే గణేశ విద్య. దీనిని గణపతి తెలిసికొనియున్నాడు.

🍁3.ధ్వని సూత్రములనిచ్చే దేవుడు శంకరుడు. భిన్న భిన్నమైన వేదశాఖలు చెప్పేఆరు మృత్యువాత పడిన కారణంగా ఆ శాఖలు లుప్తమంపోవుచున్నవి. అందువలన వానిని కాపాడే దృష్టితో సనకాది సిధ్ధులు దక్షిణాదినున్న చిదంబరంలో నున్న శివుని వద్దకు వెళ్లి ప్రార్ధించినారు. ఆ ప్రార్ధన నాలకించి పరమశివుడు అలౌకికమైన శివతాండవ నృత్యము చేస్తూ మధ్యలో తన డమరుకమును తొమ్మిది మరియు ఐదు అనగా పదునాలుగుసార్లు మ్రోగించినాడు. దాని నుండిఉ 14 ధ్వని సూత్రాలు వెలువడినవి. దీనినే మాహేశ్వర సూత్రములన్నారు. దీన్ని వర్ణిస్తూ ఇలా చెప్పబడినది

నృత్యావసానే నటరాజ రాజౌ సనాద ఢక్కాం నవ పంచవారమ్ |
ఉధ్ధర్తు కామః సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్ర జాలమ్ || 
                                      - కౌశిక సూత్ర –I

పదునాల్గు మాహేశ్వర సూత్రములు : అ, ఆ, ఇ,ఈ,ఌ,ౡ,ఋ,ౠ ,ఏ,ఐ,ఓ,ఔ – ఈ సూత్రముల ఉపదేశము పాణిని మహర్షికి లభించింది. దాని ఆధారంగా ఆ మహర్షి తన వ్యాకరణ గ్రంధము ‘అష్టాధ్యాయి’ రచించినారు.ఆ గ్రంధమే ధ్వన్యాత్మక భాషను,దాని వికాసాన్ని శాస్త్రీయంగా ఉంచుతుంది. 

🍁4.వేదముల స్మరణ మరియు శుధ్ధత చిరస్థాయిగా నుండుట కొరకు అనేకమంది మహర్షులు అనేక జటిల పథన పధ్ధతులు వికసింపచేసినారు. అవి జటా,మాలా,శిఖా,రేఖా,దండ,రధ,ధ్వజ మరియు ఘనపాఠ – ఈ వేదపఠన పధ్ధతులు వ్రాత లేకుండా సురక్షితంగా ఉంచుట సాధ్యంకాదు.

🍁5.మహాభారత కర్త వ్యాసమహర్షి మహాభారత రచనకు ఉపక్రమించునపుడు ఏర్పడిన సమస్య. దీనిని ఎవరు వ్రాస్తారు? దాని కొరకు గణేశుణ్ణి స్మరించారు. ‘కావ్యస్యలేఖ నార్ధాయ గణేశం స్మర్యతామ్ మునే’ – అప్పుడు గణేశుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు వ్యాసుడన్నాడు ‘లేఖకో భారతస్యాస్య భవ గణనాయకః’ –మీరు మహాభారత గ్రంధ లేఖకులు కావాలన్నాడు. దీని నుండి తెలియు విషయం మన గణేశుడు ఆనాటి మూర్ధన్యలిపికారుడు అని అర్థమగుచున్నది.

🍁పాణిని మహర్షి ‘ *ఋగ్వేదవిద్య*’ లో ఇలా వివేచించి చెప్పినాడు – వాక్కు తన నాలుగు పదములలోని చివరి పదమైన ‘వైఖరి’ లో బయలు వెడలుతుంది. మనుష్యుని శరీరంలోని ఐదు అవయవాల సాయంతో ధ్వని ఉత్పన్నము అవుతుంది. దీని ఆధారంగా అచ్చులు, హల్లులు ఏ అవయవ సాయంతో ఉచ్చరిస్తామో ఆ అవయవాన్ననుసరించి వర్గీకరించుట క్రింది విధంగా జరిగింది. 

🔸1. *కంఠ్యములు* : శ్వాస కంఠము నుండి వెలువడుతుంది. అప్పుడు ఏ ధ్వనులు వెలువడుతాయో అవి ఈ వర్గము క్రిందకు వస్తాయి. అ, ఆ, క, ఖ,గ,ఘ,ఙ ,హ మరియు విసర్గ (ః) 
🔹2. *తాలవ్యములు* : కంఠము నుండి కొద్దిపైన దంతములు దగ్గర కఠిన తాల భాగముపై నుండి శ్వాస బయలు వెడలినప్పుడు ఆ ధ్వని, ఇ, ఈ, చ, ఛ,జ,ఝ,ఞ, య మరియు శ – అను అక్షరములు ద్వారా అభివ్యక్తీకరించబడును.
🔸3. *మూర్ధన్యములు* : నాలుక కొనను కొంచెం వెనుకకు తీసికొని కోమల తాల భాగముపై తాకి ధ్వని వెడలినప్పుడు ఈ అక్షరాలు పలుకుతాయి. ఋ, ౠ, ట,ఠ,డ,ఢ,ణ,ష
🔹4. *దంత్యములు* : నాలుక దంతములకు తాకునప్పుడు ఈ అక్షరముల్ పలుకుతాము. త,థ,ద,ధ,న,ల,స – 
🔸5. *ఓష్ఠ్యములు*: రెండు పెదవులు సాయంతో ఈ అక్షరములు పలుకుతాము – ఉ,ఊ,ప,ఫ,బ,భ,మ మరియు వ – 
మిశ్రిత అక్షరములు : పై అక్షరములు కాకుండా మిగిలినవి. ఏ,ఐ,ఓ,ఔ,అం,ఆః

పైన తెలుపబడిన ధ్వని శాస్త్రముననుసరించి లిపి వికసించబడింది. మరియు కాలక్రమమలో లిపులు మార్పులు చెందుచుండినవి. దీని ఆధారంగానే ధ్వనిశాస్త్రం యొక్క మూల సిధ్ధాంతము ఏర్పడినది. ప్రఖ్యాత పురాతత్వవేత్త వాలావాల్కర్ గారు ప్రాచీన ముద్రలతో లభించిన లిపులను అధ్యయనం చేసారు. ఈ అధ్యయనము ద్వారా వారు మూలరూపంలో మహేశ్వరి లిపి అనబడే వైదిక లిపి ఏర్పడినట్లు వారు ఋజువు చేసారు. కొద్దికాలం తర్వాత అదే బ్రాహ్మీలిపిగా, నాగరలిపిగా అభివృధ్ధి చెందినది. ప్రఖ్యాత లిపి శాస్త్రవేత్త శ్రీ వాకణకర్ ద్వారా తయారు చేయబడిన క్రింది చార్టులో మనం ఇదంతా గమనించవచ్చు. 

🍁 *పురాతత్వ ఋజువులు* : లిపి యొక్క అభివృధ్ధి క్రమము, పురాతత్వ ఋజువులపై శ్రీ వాలావాల్కర్ మరియు శ్రీవాకణకర్ విస్తృతంగా పరిశోధనలు గావించారు. అనేక ప్రతిపాదనలు చేసారు. వారి ప్రతిపాదనలను గూర్చి డా|| మురళీమనోహర జోషి తన ప్రసిధ్ధ వ్యాస పరంపర ‘లిపి’ విధాత గణేశ్’ లో అనేక అంశాలను ప్రస్తావించారు. అనేక ఋజువులు చూపించినారు. అతి ప్రాచీనకాలము నుండియే భారతదేశంలో లిపి విద్య, లేఖన కళ ప్రచారమందున్నది. అది పూర్తిగా ధ్వనిశాస్త్రముపై ఆధారపడి తయారైంది. ఈ శాస్త్రీయ దృష్టి ప్రపంచంలోని ఏ ఇతర లిపులలోను లేదు.
‘ఇప్పుడు పురాతత్వ శాస్త్రంలోని ఋజువుల గురించి చర్చిద్దాం! బ్రిటిష్ మ్యూజియంలో ఒక ముద్ర (సీల్) ఉన్నది. దాని క్రమసంఖ్య : 31-11-366/1067-47367-1881. 6 BCE శతాబ్దానికి చెందిన ఈ ముద్రలో బాబిలోనియాకు చెందిన కీలాక్షరలిపి మరియు మన బ్రాహ్మి లిపి రెండూ కలిసియున్నవి. కీలాక్షరలిపి 1936 లో మాత్రమే చదవగలిగినారు. మధ్యలో నున్న పంక్తిని తెలియని అజ్ఞాతలిపిగా వదిలివేసారు. పురాతత్వ లేఖనవేత్త వాలావాల్కర్ మాత్రమే ఈ అజ్ఞాతలిపిని చదివి చూపినారు. యూరపు పండితుల వాదనలను బూటకమని ఋజువు చేసారు. భారతీయ లిపికి మూలాధారము ఇతర దేశములయందున్నదే వాదనలను పటాపంచలు చేసారు. ఈ ముద్ర ఆశోకునికి పూర్వము మహేశ్వరీ లిపిలో వ్రాయబడిన సంస్కృత భాషకు సాక్శీభూతముగా న్నన్నది. ఈ పంక్తి పాఠము ఇలా ఉన్నది. ‘అవఖేజ్ఞరాఖను ఔహర్మమభ్యః దదదు’ – ఇది గ్రీకు కీలాక్షర లిపిలో వ్రాయబడిన అనుబంధమునకు సంస్కృతభాషలో వ్రాయబడిన అనువాదము. ఈ ఋజువుతో పాశ్చాత్య లిపి పరిశోధకులైన మెక్డోనల్ మరియు బ్యూహలర్ లు ప్రతిపాదించిన లిపి సిధ్ధాంతాలు బూటకములని తేలిపోయినవి. భారతీయులు 5 BCE  శతాబ్దిలో లిపిని విదేశాల నుండి అరువు తెచ్చుకొన్నారనే సిధ్ధాంతం పచ్చి అబద్ధమని వారి పరిశోధనలు భారతదేశానికి సంబంధించినవి అన్నీ బూటకములని తెలియుచున్నది. పాశ్చాత్య లిపి పరిశోధనలు నిస్సారములని తేలిపోయినవి – ఇదే విధంగా మరో మహత్యపూర్ణమైన పురాతత్వ సాక్ష్యం లభించింది. ఇది ప్యారిస్ మ్యూజియంలో ఉన్నది. (లూన్రే మ్యూజియం) ఇది 3000-2400 BCE నకు చెందినది. పాలస్తీనాలో త్రవ్వకాలు జరిపినప్పుడు లభించిన నాణెము . ఇది సార్గన్ అను రాజు కాలానికి చెందినది. ఈ నానేపు ముద్రను చూసి జాన్ మార్షల్ ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. దీని యొక్క పురాతత్వ ఫలితాలు అత్యంత సంభ్రమాన్ని కల్గిస్తున్నాయి. సింధులోయ నాగరికత నాటి ముద్రతో దీనికి పోలిక ఉన్నది. దీనితో భారతీయ లిపి పుట్టుక విదేశీయమైనదనే పాశ్చాత్య వాదనకు కాలదోషం పట్టినది. ఇప్పుడు కనీసం మన దేశీయపండితులు భారతీయ లిపి బయట నుండి అరువు తెచ్చుకొన్నదనే వాదనన్ కట్టిపెట్టినారు. అయినప్పటికీ భారతీయ లిపి ప్రాచీనతను సంబంధించిన ప్రశ్నలపి ఆంగ్ల మానస పుత్రులైన మన దేశీయ పండితులు మౌనమే పాటిస్తున్నారు. మనువాదాన్ని సరిగా వినిపించడంలేదు.

🍁 *వైదిక ఓంకారము* :
------------------------
ఇదే క్రమములో మనం 6 BCE శతాబ్దానికి చెందిన సోహగరా తామ్రశాసనమును పరిశీలించాము. ఈ శాసనము మొదటి పంక్తిలోనే ఓంకార చిత్రము చెక్కబడియున్నది . ఈ ఓంకారము వాలావాల్కర్ ప్రదర్శించిన చార్టులో ముద్రింపబడినదే – ప్రక్కనున్న ఇతర చిత్రాలను పరిశీలించినప్పుడు కూడా వానిలోను వైదిక ఓంకారము,స్వస్తిక్ వంటి హిందూ ఆధ్యాత్మిక చిహ్నాలు ముద్రింపబడినవి. ఇవి అన్నీ నాణెములకు సంబంధించిన చిత్రములే. వైదిక ఓంకారము ఈ ఆకృతిలో ఎందుకు ఉందనే ప్రశ్నకు సమాధానం ‘జ్ఞానేశ్వరి’ లో వివరించబడినది. 
అ-కార చరనయుగళ | ఉ- కార ఉదర విశాల |
మ-కార మహామండల | మస్తకా – కారే || 19
హేతీన్హీ ఏకవటలే | తేవ శబ్ద బ్రహ్మ కవళల | 
తే మియాం గురుకృపా నమిలే | ఆదిబీజ || 20 
- ‘జ్ఞానేశ్వరి’ 

🍁(ఎ) జ్ఞానేశ్వరి మరియు వాలావాల్కర్ చెప్పిన వైదిక ఓంకారముల సామ్యము
శబ్ద బ్రహ్మ లేదా ఏకాక్షర బ్రహ్మ, ప్రణవము యొక్క ఆకృతిని గూర్చి ‘జ్ఞానేశ్వరి’ లోని వర్ణన చాలా మహత్వపూర్ణమైనది. ఆధునిక దేవనాగరి లిపిలో వ్రాయబడుచున్న ॐ తో ఈ వర్ణన పూర్తి సామ్యము లేకున్నా వాలావాల్కర్ గారు చూపించిన వైదిక ఓంకారముతో పూర్తి సామ్యమును కలిగియున్నది. మహేశ్వరి సూత్రములలోణి ‘అర్ధేందు సిధ్ధాంతమును’ గూర్చి లోతుగా ఆలోచన చేసినచో ఈ చిక్కు సమస్యకు సమాధానం లభిస్తుంది. వైదిక ఓంకార చిత్రమును పరిశీలిద్దాం. మొదట క్రింద రెండు అర్ధచంద్రాకారములున్నవి. ఇవి ‘అ’ కారము  ప్రతీకలు. వీనిపైన ఒక అర్ధచంద్రాకరమున్నది. ఇది ‘ఉ’ కారమునకు ప్రతీక. అన్నింటి పైన ఒక వృత్తము మరియు అర్ధచంద్రబిందు సహితము ఉన్నది. ఇది ‘మ’ కారమునకు ప్రతీక – ఈ విధంగా జ్ఞానేశ్వరిలో వర్ణించిన ఓంకారము, గీత మరియు ఉపనిషత్తులలో వర్ణించిన ఏకాక్షర బ్రహ్మ లేదా ప్రణవము – మరే పేరుతో చెప్పినా , అది మహేశ్వరి సూత్రములలోని ‘ *అర్దేందు_సిధ్ధాంతము* ‘ ననుసరించి చెప్పిన ఓంకారము – అది నిర్ణయింపబడిన నాదముల యొక్క ప్రతీకయే ! ఈ నాదముల ప్రతీకలను క్రమపధ్ధతిలో జోడించినప్పుడు ఏర్పడిన ఒక నిశ్చిత ఆకృతియో! దేవనాగరి ॐ లో కూడా ఇదే సూత్రము వర్తించుచున్నది. వైదిక ఓంకార చిత్రమును 90 డిగ్రీల నుండి గడియారపు ముల్లు దిశలో త్రిప్పినచో దేవనాగరి *ఓంకారముతో* చక్కగా సరిపోవును. – వైదిక ఓంకారము ప్రస్తుత దేవనాగరి ఓంకారమునకు రూపాంతరము చెందిన యాత్రయే భారతీయ లిపి యొక్క వికాసగాధ! దీనిని మనము *ఋగ్వేదము* నుండి *పద్మపురాణము* వరకు పరిశోధించి చూడవచ్చు. 
*** Source from : భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర page : 181-190

మీ 

*ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక*

No comments:

Post a Comment