Monday, August 5, 2024

 చలాచల బోధ:--
ప్రజ్ఞానం బ్రహ్మ,అహం బ్రహ్మ అనే వాక్యాలను మహా వాక్యాలు అని వేదాలలో చెప్పబడింది.ఆ మహా వాక్యాలను సాధన సంపత్తి కలిగిన వారే అవగాహన చేసుకొన గలరు.అందువలన ముందుగా మనము ఈ సాధనా చతుష్టయ సంపత్తి గురించి పూర్తిగా వివరించు కుందాము.
నిత్యానిత్య వస్తు వివేకము తరువాత రెండవ సాధన "ఇహాముత్ర ఫల భోగ విరాగము.
ఇహ  లేక ఇహము అంటే మనము నివసించే లోకము.ఆముత్ర అంటే ఈ కర్మ భూమిలో మనము ఇష్టపడి చేసే కర్మలు.ఫల అంటే ఆ కర్మ ఫలాలు.భోగ అంటే అనుభవాలు.విరాగము అంటే ఆ ఫలాల పట్ల రాగమును విడచినటువంటి స్థితి.
కావున"ఇహాముత్ర ఫల భోగ విరాగము "అంటే ఈ కర్మ భూమిలో మనము ఇష్టపడి చేసే కర్మల ఫలితాల వలన పొందే సుఖానుభవాల పట్ల వైరాగ్యం కలిగి యుండుట.కర్మ ఫలాల పట్ల వైరాగ్యం లేకపోతే మళ్ళీ మళ్ళీ అవే భోగాల కోసం మళ్ళీ మళ్ళీ కర్మ చేస్తూ పోతే జన్మ కర్మ, మళ్ళీ జన్మ కర్మ,ఈ విధంగా జనన మరణ చక్రంలో బంధించబడి ముక్తికి దూరమవుతాము.కావున ముముక్షువునకు ఇటువంటి వివేక వైరాగ్యాలు ఉండాలి.దానికి తగిన సాధనలు అవసరమవుతాయి.
సశేషం.

No comments:

Post a Comment