Monday, August 5, 2024

 చలాచల బోధ:--
వివేక వైరాగ్యాలు:-
వివేకము అంటే నిత్యమైనదేదో అనిత్యమైనదేదో విచారణ చేసి నిశ్చయించుకొని నప్పుడు మన బుద్ధిలో కలిగే వివేకము.నిత్యమైనది ఆత్మ,అనిత్యమైనది అనాత్మ గనుక ఈ రెండు వివేకాలు ఒక్కటే.నిరంతరం మార్పు చెందేది, రూపాంతరం చెందేది, ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయేదానిని అసత్తు అని అంటారు.తద్వ్యతిరేక లక్షణాలు గలది శాశ్వత ఉనికి గలది యేదో అది సత్తు.కనుక సత్తు అనినా ఆత్మ అనినా ఒక్కటే.ఇక అసత్తు అంటే అనాత్మ లేక జడము లేక అనిత్యమైనది.ఆత్మ అనినా బ్రహ్మ అనినా చిద్రూపమనినా సద్రూపమనినా ఒక్కటే.కావున ఈ విచారణ వలన సదసద్వివేకము కూడా కలుగుతుంది.చిదచిత్ లేక చిజ్జడ వివేకము కూడా కలుగుతుంది.

No comments:

Post a Comment