Monday, August 5, 2024

 🙏 *రమణోదయం* 🙏

*ఇహ పరాల్లో పొందే అల్ప సుఖానుభవాలపై ఆశలు పెంచుకొని దుఃఖిస్తున్న ఓ మనసా! నీవు ఎటువంటి తలపులు లేకుండా నీ సహజ స్థితిలో ఉంటే ఇహపరాలని దాటిన బ్రహ్మానంద ముక్తిని నిశ్చయంగా పొందుతావు.*

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.379)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

మనస్సు హృదయంలో లీనం కాకపోవడానికి
పూర్వ సంస్కారాలే కారణం..వాస్తవానికి      
మనసేప్పుడూ హృదయంలోనే ఉన్నది..
కానీ, నీ పూర్వసంస్కారాల మూలంగా అది చలిస్తూ
ఉంటుంది.. పూర్వసంస్కారాల బలం లేకుండా
చేయబడినప్పుడది చలనముడిగి శాంతిని 
పొందుతుంది..ప్రాణాయామం, సజ్జన సాంగత్యం,
ఈ సంస్కారాలను తొలగించడానికి తోడ్పడతాయి..
అయితే, ప్రాణాయామంవల్ల తాత్కాలికంగా    
మాత్రమే మనస్సు నిశ్చలమౌతుంది..దానికి కారణం
సంస్కారాలింకా మిగిలి ఉండడమే.
మనస్సు ఆత్మగా మారినప్పుడే చిక్కూ ఉండదు.
అది ధ్యానం వల్లనే సాధ్యం!

💐 ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ 💐

No comments:

Post a Comment