🔔 *కృష్ణ తత్వం* 🔔
ప్రశ్న :
కృష్ణుణ్ణి దొంగ అని అనటం లో అంతరార్ధం ఏమిటి ?
సమాధానం :
దొంగ మనతోనే ఉంటాడు మనకు కనపడడు . మనల్ని గమనిస్తూ ఉంటాడు .మనకు తెలియదు .
మనకు తెలీకుండానే మనవి ఎత్తుకుపోతాడు .
కృష్ణుణ్ణి దొంగ అనేవాళ్ళు ముందు అతణ్ణి భగవంతుడని అంగీకరించినట్లే . అవును కృష్ణస్తుభగవాన్ స్వయం . ఏ అవతారానికీ లేని , ఈ అవతారానికి మాత్రమే ఉన్న ప్రత్యేకతే ఇది .
కన్నయ్య మనతోనే ఉంటాడు . కాదు కాదు . మనలోనే ఉంటాడు . మనల్ని చూస్తూ ఉంటాడు . ఎలాగంటే , తాను లేని చోటు లేదు గనుక .
" సహస్ర శీర్షా పురుష : ........."
మనవి నమ్మకాలు . విశ్వాసం కాదు . జ్ఞానం కాదు . మనం విన్నవి మనకు జీర్ణం కావాలి . నిజమేమిటొ జ్ఞానులకు తెలుసు .
ఆ తండ్రిని ఆశ్రయించిన అనన్య భక్తుల కష్టాల్ని , కన్నీళ్ళను , దు:ఖాన్ని , తాపత్రయాలను , అరిషడ్వర్గాలను దొంగతనం చేస్తాడు . వాళ్ళ బ్రతుకులో వెన్నెల వెలుగుల్ని నింపుతాడు .
దొంగా తానే దొరాతానే .
No comments:
Post a Comment