Saturday, August 17, 2024

 🔔 *కృష్ణ తత్వం* 🔔

ప్రశ్న : 

కృష్ణుణ్ణి దొంగ అని అనటం లో అంతరార్ధం ఏమిటి ?

సమాధానం :

దొంగ మనతోనే ఉంటాడు మనకు కనపడడు . మనల్ని గమనిస్తూ ఉంటాడు .మనకు తెలియదు .
మనకు తెలీకుండానే మనవి ఎత్తుకుపోతాడు .

  కృష్ణుణ్ణి దొంగ అనేవాళ్ళు ముందు అతణ్ణి భగవంతుడని అంగీకరించినట్లే . అవును కృష్ణస్తుభగవాన్ స్వయం . ఏ అవతారానికీ లేని , ఈ అవతారానికి మాత్రమే ఉన్న ప్రత్యేకతే ఇది .

       కన్నయ్య మనతోనే ఉంటాడు .  కాదు కాదు . మనలోనే ఉంటాడు . మనల్ని చూస్తూ ఉంటాడు . ఎలాగంటే , తాను లేని చోటు లేదు గనుక .
" సహస్ర శీర్షా పురుష : ........."

మనవి నమ్మకాలు . విశ్వాసం కాదు .  జ్ఞానం కాదు . మనం విన్నవి మనకు జీర్ణం కావాలి . నిజమేమిటొ జ్ఞానులకు తెలుసు .

       ఆ తండ్రిని ఆశ్రయించిన అనన్య భక్తుల కష్టాల్ని , కన్నీళ్ళను , దు:ఖాన్ని , తాపత్రయాలను , అరిషడ్వర్గాలను దొంగతనం చేస్తాడు . వాళ్ళ బ్రతుకులో వెన్నెల వెలుగుల్ని నింపుతాడు .
దొంగా తానే దొరాతానే .

No comments:

Post a Comment