Friday, August 23, 2024

 *_అదేంటో..మనిషి ఈరోజుల్లో బంధాలను తెంచుకుంటున్నాడు,ఆస్తులు పెంచుకుంటున్నాడు._*

*_తీరా చనిపోయాక కొడుకులు ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు,తల్లిదండ్రులను అనాధవాశ్రమంలో వదిలి  మర్చిపోతున్నారు.._*

*_రేపటి రోజుల్లో మానవకాలం పోయి యంత్రల (రోబోల) కాలం వచ్చేలా ఉంది._*

*_మనిషి, మనిషిని ప్రేమించడం మానేసి... డబ్బుల వెంట ఆస్తుల  వెంట పరిగెడుతున్నాడు. ప్రొద్దున నుండి పడుకునే వరకు ఉరుకుల పరుగులు అంతా... డబ్బు,డబ్బు, డబ్బు ఉంటేనే సుఖమని ఉన్న సుఖాన్ని కోల్పోతున్నాడు ._*

*_బంధాలు, బంధుత్వాని కంటే, డబ్బును మాత్రమే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. బరితెగించిన వారికి బంధాల బరువు తెలియదు, బజారుకి ఎక్కిన వారికి సంసారం విలువ ఎలా తెలుస్తుంది..?_*

*_చావు  చేరే వరకు  తెలీదు, బంధం విలువ. కర్మ కాలి మనిషి  మంచాన పడితే గానీ,అర్థం కాదు ఈ అతుకుల బొంత బ్రతుకు విలువ ఎంత అనేది..._*

*_కాలం గుడ్డిది కాదబ్బ ఏంత ఎగిరెగిరి పడ్డ కింద పడక తప్పదు.పడిన రోజు అలా ఎందుకు బ్రతికానా..అని కుళ్లి కుళ్లి ఏడ్చేలా చేస్తుంది కాలం...అప్పుడే కదా నీకు తెలిసేది  బ్రతుకు విలువ ఎంత అనేది._*

*_అందుకే...మనమంటే విలువలేనివాళ్ళ దగ్గరికి వెళ్లి పదేపదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది.☝🏾_*

 *_✍🏾మీ.తుకారాం జాదవ్.🙏🏾_*

No comments:

Post a Comment